ADVERTISEMENT
home / Bollywood
#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు

#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలని ఒక కుదుపు కుదిపేస్తున్న అంశం #MeToo. హిందీ నుండి మొదలై తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల్లో ఎందరో మహిళలు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి.. గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెడుతూనే ఉన్నారు.

ఇటీవలే తమిళ చిత్రపరిశ్రమలో గత ఆరేళ్ళుగా నటిస్తున్న శాలు శాము (Shalu Shamu) కూడా తన #Metoo అనుభవాలను పంచుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్న తరుణంలో ఒక అభిమాని ” ఈ ఆరేళ్ళ సమయంలో మీకెప్పుడైనా చిత్రపరిశ్రమలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయా?” అని ప్రశ్నించగా….

ఆ ప్రశ్నకి  శాలు స్పందిస్తూ – “అవును! ఈ ఆరేళ్ళ కాలంలో నేను కూడా ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నాను. అయితే నన్ను వేధించిన వారి పేర్లు మాత్రం బయటపెట్టాలనుకోవడం లేదు. అలాగే ఎవ్వరికి ఫిర్యాదు కూడా చేయాలనుకోవడం లేదు” అని తెలిపింది.

ఎందుకంటే నేను సదరు వ్యక్తి పై ఫిర్యాదు చేసినా.. ఏమైనా ఉపయోగం ఉంటుందా? తప్పు చేసినవాడు మనస్ఫూర్తిగా తాను చేసింది తప్పు అని అంగీకరిస్తాడా? లేదు కదా! అందుకే నేను ఎవ్వరి పేర్లు చెప్పాలనుకోవడం లేదు, ఇటువంటివి జరిగినప్పుడు ఎలా బయటపడాలో నాకు తెలుసు” అని చెప్పుకొచ్చింది శాలు శాము.

ADVERTISEMENT

me-too-comments

Image: Instagram

అలా తన మనసులో ఉన్న మాట చెప్పి, తనకి కొద్దిరోజుల క్రితం ఎదురైన ఒక సంఘటన గురించి కూడా అందరితో పంచుకుంది. – “ఒక దర్శకుడు తనతో ఒక రాత్రి గడిపితే, త్వరలో అతను విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) తీయబోయే చిత్రంలో నన్ను హీరోయిన్‌గా పెట్టుకుంటానని మాటిచ్చాడు” అని శాలు తెలిపింది.

ప్రస్తుతం శాలు చెప్పిన వివరాలు.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశమయ్యాయి.  శాలు శాము చెప్పే విషయంలో ఎంతవరకు నిజం ఉంది? అనే కోణంలో కూడా కొందరు మాట్లాడుతున్నారు.

ADVERTISEMENT

ఎందుకంటే.. ఇలాంటి సంఘటన బాలీవుడ్‌లో కూడా జరిగింది. గత ఏడాది హిందీ దర్శకుడు వికాస్ బేల్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా.. ఆయన చేస్తున్న చిత్రం నుండి బయటకి వెళ్లిపోవాల్సి వచ్చింది. అలాగే ఆయనతో కలిసి మరో ఇద్దరు దర్శకులు ఏర్పాటు చేసిన.. నిర్మాణ సంస్థని కూడా ఆ ఆరోపణల వల్ల మూసేయాల్సి వచ్చింది. చివరికి ఆయన తప్పేమీలేదు అని తేలింది. అందుకనే #MeToo పేరిట వస్తున్న వార్తల్లో నిజాయితీ ఎంతవరకు ఉందనే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ప్రస్తుతం శాలు స్టేట్ మెంట్ బయటకు వచ్చాక.. విజయ్ దేవరకొండ‌తో సినిమా చేయబోయే ఆ దర్శకుడు ఎవరు? అనే ప్రశ్న కూడా ఉద్భవించింది. విజయ్ దేవరకొండ పేరు చెప్పి.. వేరే వ్యక్తి శాలును మభ్యపెట్టి ఉండవచ్చని కూడా పలువురు నెటిజన్లు అంటున్నారు.  

ఇక శాలు శాము కెరీర్ పరంగా చూస్తే – ఇప్పటివరకు ఆమె తమిళంలో 10 చిత్రాలకు పైగా నటించింది.  తాజాగా శివకార్తికేయన్ (SivaKarthikeyan) హీరోగా స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం – మిస్టర్ లోకల్ (Mr. Local) చిత్రంలో ఒక కీలక పాత్రలో కూడా నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తన కుటుంబసభ్యులతో వేసవి విహారయాత్రకు వెళ్ళాడు. ఆ ట్రిప్ నుండి వచ్చాక డియర్ కామ్రేడ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.

ఏదేమైనా #MeToo ఉద్యమం జనాల్లోకి బాగా చొచ్చుకొచ్చాక.. ఎందరో మహిళలు తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోగలుగుతున్నారు. ఇది ఒకరకంగా మహిళలలో మనోధైర్యాన్ని నింపిందనే చెప్పాలి.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

‘కబీర్ సింగ్’ ప్రేయసి.. మన ‘అర్జున్ రెడ్డి’ని ఎందుకు కలిసింది..?

మన వెండితెర ముద్దుల ‘రౌడీ’ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

ADVERTISEMENT

 

05 Jun 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT