'కబీర్ సింగ్' ప్రేయసి.. మన 'అర్జున్ రెడ్డి'ని ఎందుకు కలిసింది..?

'కబీర్ సింగ్' ప్రేయసి.. మన 'అర్జున్ రెడ్డి'ని ఎందుకు కలిసింది..?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కిన.. 'అర్జున్ రెడ్డి' ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలియంది కాదు. ఇప్పుడు అదే సినిమాను సందీప్ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగులో షాలిని పోషించిన పాత్రను.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) పోషించనుంది. ఇటీవలే ఈమె విజయ్ దేవరకొండతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఆమె హిందీలో 'ధోనీ బయోపిక్‌'లో నటించింది. నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమైన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో కూడా కియారా ఓ బోల్డ్ పాత్రలో నటించి.. అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే కియారా ఓ ఈవెంట్‌లో భాగంగా.. విజయ్‌తో కలిసి ఫోటో దిగడం విశేషం.


ఇక కబీర్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమాల్ మాలిక్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. శంతన క్రిష్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.


తొలుత ఈ చిత్రానికి హీరోగా రణ్‌వీర్ సింగ్‌ని అనుకున్నా.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో షాహిద్ కపూర్‌ని హీరోగా తీసుకున్నారు. అంతకు ముందే అర్జున్ కపూర్‌ని హీరోగా తీసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.21 జూన్ 2019 తేదిన 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' విడుదల అవుతుందని నిర్మాతలు అంటున్నారు. నిజం చెప్పాలంటే.. 2017లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన చిత్రంగా అర్జున్ రెడ్డిని చెప్పవచ్చు.


ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లో ఈ చిత్రం ఫిల్మ్ ఫేర్ గెలుచుకొని.. అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఇక కథ విషయానికి వస్తే ప్రేమలో విఫలమై తాగుడుకి బానిసైన ఓ మెడికో కథ ఇది. ఈ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయి నటించారు. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు కూడా.. ఆ స్థాయి నటనను కనబరిచే హీరో కోసం బాగానే వెతికారట. కానీ ఆఖరికి ఈ రోల్ షాహిద్‌ని వరించింది.


 ఇదే చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. తొలుత బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించినప్పటికీ.. తర్వాత ఆయన ఈ ప్రాజెక్టు నుండి మధ్యలోనే నిష్క్రమించారు.


ప్రస్తుతం గిరీశయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ రీమేక్‌ను కూడా.. ఈ సంవత్సరం జూన్‌లోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.   


ఇవి కూడా చదవండి


ఆసుపత్రిలో "అర్జున్ రెడ్డి".. విజయ్ దేవరకొండకు ఏమైంది...?


తెెలుగు వారి మనసును దోచిన "గీత గోవిందం".. బాలీవుడ్‌ని కూడా అలరిస్తుందా..?


విజయ్ దేవరకొండ "డియర్ కామ్రేడ్" సినిమా గురించి.. మరిన్ని విషయాలు తెలుసుకుందామా..?