మిస్టీరియస్ ఫీలింగ్ కలిగించిన.. అడివి శేష్, రెజీనాల "ఎవరు" ఫస్ట్ లుక్..!

మిస్టీరియస్ ఫీలింగ్ కలిగించిన.. అడివి శేష్, రెజీనాల "ఎవరు" ఫస్ట్ లుక్..!

క్షణం, గూఢాచారి చిత్రాల తర్వాత.. సస్పెన్స్ చిత్రాల బాటలో నడుస్తున్న నటుడు అడివి శేష్ (Adivi Sesh). "కర్మ" చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి.. తర్వాత సహాయ నటుడిగా కూడా రాణించిన శేష్.. హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు "ఎవరు" అనే సస్పెన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. చాలా డిఫరెంట్ లుక్‌తో విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఇప్పటికే.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందిస్తోంది. 

వెంకట్‌ రామ్‌జీ (Venkat Ramji) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి.. పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  పీవీపీ సినిమా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రంలో అడివి శేష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారట. ఆగస్టు 23వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. నవీన్ చంద్ర ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నటి రెజీనాకి (Regina) కూడా "అ" చిత్రం తర్వాత.. ఒక డిఫరెంట్ పాత్రను అందిస్తున్న చిత్రంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. 

విశ్వక్ సేన్ "ఫలక్ నుమా దాస్" మూవీ రివ్యూ - ఇది పక్కా హైద్రాబాదీ సినిమా

పీవీపీ సంస్థ గత కొంత కాలంగా సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. క్షణం, రాజు గారి గది, గ్రహణం (తమిళం) లాంటి సినిమాలకు కో ప్రొడక్షన్ హౌస్‌గా వ్యవహరించింది. అలాగే కాష్మోరా సినిమాను కూడా తానే పంపిణీ చేసింది. ఇప్పుడు "ఎవరు" చిత్రంతో మన ముందుకు వస్తోంది. ఇక అడివి శేష్ కూడా ఈ మధ్యకాలంలో కాస్త డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్నారు. క్షణం సినిమా రిలీజ్ అవ్వకముందు దాదాపు 50 స్క్రిప్ట్స్ ఆయన రిజెక్ట్ చేశారట.

 

ఇక రెజీనా విషయానికి వస్తే.. తమిళంలో ఇప్పటికే కల్లాపార్ట్ అనే థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న "పార్టీ" అనే కాసినో బేస్డ్ కామెడీ చిత్రంలో కూడా తాను యాక్ట్ చేస్తోంది. ఈ మధ్యకాలంలోనే "ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా" అనే హిందీ చిత్రంలోనూ నటించింది. ఇటీవలే ఈమె తెలుగులో నటించిన "7" చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం "ఎవరు" ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. 

మల్లేశం మూవీ రివ్యూ - ఇది ఓ సామాన్యుడి అసామాన్య ప్రయాణం

"ఎవరు" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వెంకట్ రామ్‌జీకి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ చిత్రానికి ముందే అడివి శేష్.. మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న "మేజర్" చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా ఏదీ వెలువడలేదు. 

అలాగే చేతన్ భగత్ నవల "2 స్టేట్స్" ఆధారంగా.. ఎంఎల్‌వీ సత్యనారాయణ దర్శకత్వంలో అడివి శేష్, శివానీ రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కినట్లు కనిపించలేదు. ఈ క్రమంలో "ఎవరు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అడివి శేష్ ప్రకటించడంతో.. ప్రస్తుతం ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

'జెర్సీ' తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? - మూవీ రివ్యూ

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.