ADVERTISEMENT
home / Bollywood
RRR కి మరో బాలీవుడ్ టచ్.. షూటింగ్ ప్రారంభించిన అజయ్ దేవగణ్

RRR కి మరో బాలీవుడ్ టచ్.. షూటింగ్ ప్రారంభించిన అజయ్ దేవగణ్

RRR.. జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ఇది. బాహుబలి లాంటి భారీ చిత్రాల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా. అందులోనూ టాలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటిస్తోన్న చిత్రం కాబట్టి.. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే దాని పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ కథానాయికగా కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ అనే విదేశీ కథానాయిక కనిపించనుంది. డి వి వి దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

ఈ సినిమాలో నటించడానికి చాలామంది బాలీవుడ్, హాలీవుడ్ తారలను ఎంచుకున్నారు రాజమౌళి. సముద్రఖని లాంటి ఇండియన్ నటులతో పాటు.. రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ నటులు కూడా ఇందులో నటిస్తుండడం విశేషం. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 

ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ఆయన ఇందులో ఓ ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్, రాజమౌళి.. ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ‘మేమందరం అజయ్ గారితో షెడ్యూల్ ప్రారంభించేందుకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉన్నాం. వెల్ కం సర్’ అంటూ అజయ్, రాజమౌళి ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకుందీ చిత్ర యూనిట్.

తన దక్షిణాది తెరంగేట్రం గురించి ట్విట్టర్‌లో పంచుకున్నారు అజయ్. ‘రాజమౌళి సర్‌తో నా బంధం ఇప్పటిది కాదు. 2012 నుంచి మేం చాలా మార్గాల్లో కలిసి పనిచేశాం. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా అనిపిస్తోంది’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారాయన.

ADVERTISEMENT

#RRR సినిమా గురించి.. ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన టాప్ 10 ఆసక్తికర పాయింట్స్..!

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నారని.. వీరిద్దరూ మళ్లీ అన్నదమ్ముల్లా పుట్టిన కథే ఇదని వార్తలొస్తున్నాయి. అల్లూరి సీతారామ రాజు, కొమురం భీంలుగా వీరు నటించడం సరైనదని రాజమౌళి చెప్పగా.. వీరు ద్విపాత్రాభినయం చేయనున్నారా? లేక ఈ సినిమా కూడా పిరియడ్ డ్రామాగా మాత్రమే రూపొందనుందా అన్న సంగతి ఇంకా తెలియలేదు.

గతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు రాజమౌళి ఇది స్వతంత్ర పోరాటానికి ముందు 1920 కి సంబంధించిన కథ అని.. అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం స్వాతంత్ర్య పోరాటానికి ముందుగా దిల్లీలో కలుసుకోవడం, తద్వారా వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న దానిపై ఈ సినిమా ఆధారపడి ఉంటుందని చెప్పడం తెలిసిందే. అయితే ఇది నిజ జీవిత కథ కాదని.. కేవలం కల్పిత గాథ మాత్రమేనని రాజమౌళి చెప్పడం గమనార్హం.

ADVERTISEMENT

ఎన్టీఆర్ సరసన విదేశీ హీరోయిన్ … ‘RRR’ చిత్రంలో హాలీవుడ్ నటుల సందడి

ఈ సినిమాని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం పది భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించినా.. విడుదల తేదీ దసరా వరకూ వాయిదా పడొచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

21 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT