బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : ఇంటి కొత్త కెప్టెన్‌గా అలీ రెజా..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 :  ఇంటి కొత్త కెప్టెన్‌గా అలీ రెజా..!

దాదాపు నాలుగు వారాల "బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"లో (Bigg Boss Telugu).. హౌస్‌కి రెండవ కెప్టెన్‌గా అలీ రెజా (Ali Reza) ఎంపికయ్యాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మొదలైన.. 'నేనే రాజు నేనే మంత్రి' కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా "లెవెల్ 1"లో  అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్ & రవిక్రిష్ణలు మాత్రమే మిగిలారు. అలా ఈ ముగ్గురిలో ఒకరు.. "లెవెల్ 2"లో తలపడి ఇంటి కెప్టెన్ అవ్వాలని బిగ్ బాస్ నిర్ణయించడం జరిగింది.

బిగ్‌బాస్ శిక్షకి గురైన శివజ్యోతి & రోహిణి...!

అందుకు తగ్గట్టుగానే నిన్నటి ఎపిసోడ్‌లో ఒక సింహాసనాన్ని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన సింహాసనంపై బిగ్ బాస్ చివరి బజర్ మోగించే సమయంలో ఎవరు ఉంటే.. వారే కెప్టెన్ అవుతారని ప్రకటించారు. దానితో స్టార్ట్ బజర్ మోగగానే.. అందరికంటే ముందుగా అలీ రెజా ఆ సింహాసనంపై కూర్చోవడం జరిగింది.

ఆ తరువాత అతనిని పక్కకి తోసేసి.. సింహాసనాన్ని ఆక్రమించాలన్న రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దానికి తోడు అలీ రెజాకి ఇంటిలోని మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడం మొదలుపెట్టారు. వారిలో శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్, మహేష్ విట్టా, హిమజలు ఉన్నారు. ఆ తర్వాత.. మిగతా కంటెస్టెంట్స్ అలీ రెజాని సింహాసనం నుండి పక్కకి జరపాలని చేసిన  ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

అలాగే రాహుల్ సిప్లిగంజ్‌కి మద్దతుగా ఉన్న వితిక, వరుణ్ సందేశ్, పునర్నవిలు ఎంత ప్రయత్నించినా.. అవతలి వారి ముందు వీరి బలం ఏమాత్రం సరిపోలేదు. ఇక అప్పటికి కూడా రాహుల్ సిప్లిగంజ్... "కేవలం మమ్మల్ని ముగ్గురిని వదిలేస్తే.. మేమే తేల్చుకుంటాము" అని బహిరంగంగానే తెలిపాడు. 

రవికృష్ణతో కలిసి.. తాను ఈ విషయంలో ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే రవికృష్ణ చేతికి గాయం ఇంకా తగ్గకపోవడంతో.. పూర్తి స్థాయిలో అతను పోటీ ఇవ్వలేకపోయాడు.

ఇక చివరికి బిగ్ బాస్ లాస్ట్ బజర్ మోగించే సమయానికి.. సింహాసనం పైన అలీ రెజా కూర్చుని ఉండడంతో అతను బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలా "బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"లో  హౌస్ రెండవ కెప్టెన్‌గా అలీ రెజా ఎంపికయ్యాడు.

అతను కెప్టెన్ అయ్యాక.. ఇంటి సభ్యులందరూ ఒక చోట చేరి తమకి ఇంటిలో ఉన్న సమస్యలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మరలా అటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి అని.. వాటికి తగు నిర్ణయాలు తీసుకొవాలని అందరూ తీర్మానించుకున్నారు.

విచిత్రమైన శిక్షలతో.. ఇంటి సభ్యులను ఉక్కిరిబిక్కిరి చేసిన బిగ్‌బాస్

ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య విభేదాలు తగ్గలేదు. సింహాసనం దగ్గర టాస్క్ జరిగే సమయంలో.. ఒకరినొకరు టార్గెట్ చేస్తూ మాట్లాడుకోవడం, పరోక్షంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం లాంటివి జరిగాయి. అలాగే ఇంటికి సంబంధించి సమస్యలని కొత్త కెప్టెన్‌తో చర్చించే సమయంలో కూడా ఇరువురు విమర్శించుకోవడం జరిగింది.

అయితే ఎపిసోడ్ చివరలో మాత్రం, శ్రీముఖి ప్రొఫెషన్ గురించి మాట్లాడినందుకు "తనని క్షమించాలి" అని రాహుల్ సిప్లిగంజ్ కోరడం జరిగింది. అయితే తాను ఈ క్షమాపణని అంగీకరించినప్పటికీ కూడా.. "బిగ్ బాస్ ఇంటిలో నామినేషన్స్ జరిగినప్పుడల్లా నిన్ను (రాహుల్ సిప్లిగంజ్) నామినేట్ చేస్తాను" అని తాను స్పష్టం చేసింది.

అలా ఈ ఎపిసోడ్ ముగిసింది. అలాగే ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరో అన్నది కూడా స్పష్టమైపోయింది. మరి ఆగస్టు 15వ తేదిన జరిగే.. స్వాతంత్ర దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ క్రింద ఇంటి సభ్యుల చేత బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ చూపిస్తాడో... అలాగే ఎవరైనా స్పెషల్ గెస్ట్‌లను ఇంటికి పంపిస్తాడా లేదా.. అన్నది రేపు తెలుస్తుంది.

కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ