ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3 : బిగ్‌బాస్ శిక్షకి గురైన శివజ్యోతి & రోహిణి…!

Bigg Boss Telugu 3 : బిగ్‌బాస్ శిక్షకి గురైన శివజ్యోతి & రోహిణి…!

“బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3″లో ( Bigg Boss Telugu) నాల్గవ వారం మొదలైంది. ప్రతివారం తొలిరోజు జరిగే నామినేషన్ ప్రక్రియ ఈరోజు కూడా బిగ్‌బాస్ ఇంటిలో జరిగింది. అయితే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త వైవిధ్యంగా సాగింది. దాని వల్ల ఇంటిలో ఒక విధమైన గంభీర వాతావరణం నెలకొంది.

బిగ్ బాస్ తెలుగు నాల్గవ వారం ఆసక్తికర నామినేషన్స్

ఇక వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ స్వయంగా ఇద్దరేసి ఇంటి సభ్యులని ఎంపిక చేసి వారిని కన్ఫెషన్ రూమ్‌కి పిలవడం విశేషం.  ఆ ఇద్దరిలో ఒకరిని నామినేట్ అవ్వమని.. మరొకరిని సేఫ్‌గా ఉండమని బిగ్‌బాస్ తెలపడంతో.. ఒక్కసారిగా కన్ఫెషన్ రూమ్‌కి వచ్చిన సభ్యులంతా షాక్‌కి గురయ్యారు. ఆ ప్రక్రియలో భాగంగా ముందుగా వితిక, రవికృష్ణలని కన్ఫెషన్ రూమ్‌కి పంపించారు. ఈ క్రమంలో రవికృష్ణ తాను నామినేషన్స్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. దీని కారణంగా వితిక సేఫ్ జోన్‌లోకి వెళ్ళింది.

ఆ తరువాత కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లిన జంట – శివ జ్యోతి & రోహిణి. ఈ ఇద్దరిలో శివ జ్యోతి (Shiva Jyothi) నామినేషన్స్‌లోకి వెళ్లగా.. రోహిణి సేఫ్ జోన్‌లో నిలిచింది. అయితే బయటకి వచ్చాక … నామినేషన్స్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులు మాట్లాడుకోకూడదని బిగ్‌బాస్ పెట్టిన నియమాన్ని పట్టించుకోకుండా.. ఓ డిస్కషన్ చేసిన శివ జ్యోతి, రోహిణిలను బిగ్‌బాస్ శిక్షించారు. ఈ వారం మాత్రమే కాకుండా.. వచ్చేవారం కూడా  వారిని బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేశారు. తద్వారా  నియమాల విషయంలో ఉదాసీనంగా ఉంటే శిక్షకి గురికావాల్సిందే అని బిగ్‌బాస్ హెచ్చరిక కూడా జారీ చేశారు.

ADVERTISEMENT

శివజ్యోతి, రోహిణిల తర్వాత కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లిన జంట – మహేష్ విట్టా & వరుణ్ సందేశ్. కానీ ఈ ఇద్దరూ  సేఫ్ జోన్‌లో ఉండడానికే ఇష్టపడ్డారు. అయితే ఒక్కరే సేఫ్ జోన్‌లో ఉండాలనే తప్పనిసరి నిబంధన కారణంగా.. వరుణ్ సందేశ్ నామినేషన్స్‌లో ఉండాలని నిర్ణయించుకోగా.. మహేష్ విట్టా సేఫ్ జోన్‌లోకి వెళ్లడం జరిగింది.

ఇక వీరి తరువాత నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కన్ఫెషన్ రూమ్‌కి వచ్చిన వ్యక్తులు – బాబా భాస్కర్ & అషు రెడ్డి. ఈ ఇద్దరిలో బాబా భాస్కర్ తాను నామినేషన్స్‌లో ఉంటానని చెప్పగా.. దానిని సమర్థిస్తూ అషు రెడ్డి కూడా.. అంతకుముందే “ఇంటి పనులు పంచుకునే విషయంలో.. బాబా భాస్కర్ ధోరణి తనకి నచ్చని కారణంగా” ఆయనని నామినేట్ చేయాలనుకున్నట్టు తెలిపింది. దీంతో బాబా భాస్కర్ నామినేట్ అవ్వగా..  అషు రెడ్డి సేఫ్ జోన్‌లో నిలిచింది. 

కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ

ఇక ఈ ప్రక్రియలో ఆఖరుగా వచ్చిన జంట హిమజ & రాహుల్ సిప్లిగంజ్. ఈ ఇద్దరూ తామెందుకు ఈ ఇంటిలో ఉండాలని భావిస్తున్నారో తెలిపారు. అలాగే అవతలి వ్యక్తిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా చెప్పారు. చివరికి ఈ ఇద్దరిలో.. హిమజ సేఫ్ జోన్‌లో ఉండగా.. రాహుల్ సిప్లిగంజ్ నామినేషన్స్ ఉండేందుకు సిద్ధమయ్యారు.

ADVERTISEMENT

మొత్తంగా ఈ వారం నామినేట్ అయిన సభ్యులు – శ్రీముఖి (గత వారం టాస్క్‌లో జరిగిన ప్రమాదానికి పరోక్షంగా కారణమైనందుకు.. నేరుగా ఈ వారం నామినేట్ అవ్వడం జరిగింది). ఆమెతో పాటు శివజ్యోతి, రోహిణి  (వీరిని బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశారు), రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్, బాబ్ భాస్కర్ , రాహుల్ సిప్లిగంజ్.

ఇదిలావుండగా బక్రీద్ సందర్భంగా, ఇంటిలోని సభ్యులంతా చక్కగా సాంప్రదాయక దుస్తుల్లో సిద్ధమవ్వగా.. బిగ్ బాస్ “షీర్ ఖుర్మా”ని ఇంటి సభ్యులకి పంపించారు. ఆ సందర్భంగా వారు తమ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకొని.. కాస్త భావోద్వేగానికి గురయ్యారు. అలా ఈ ఎపిసోడ్ సంతోషంగా ముగిసింది.

అయితే నామినేషన్స్‌లో తన పేరు వచ్చిన తరువాత నుండి.. బాబా భాస్కర్ కాస్త అసహనంగా కనిపించారు. ఆ విషయాన్నీ.. ఆయనే స్వయంగా తోటి ఇంటి సభ్యులతో చెప్పుకోవడం గమనార్హం. చూద్దాం.. ఈ వారం నామినేషన్స్ ఆయనలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో…

విచిత్రమైన శిక్షలతో.. ఇంటి సభ్యులను ఉక్కిరిబిక్కిరి చేసిన బిగ్‌ బాస్

ADVERTISEMENT
12 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT