బిగ్ బాస్ తెలుగు 3 : రవికృష్ణ, అలీ రెజా & రాహుల్ సిప్లిగంజ్‌లలో ఎవరు కెప్టెన్..?

బిగ్ బాస్ తెలుగు 3 : రవికృష్ణ, అలీ రెజా & రాహుల్ సిప్లిగంజ్‌లలో ఎవరు కెప్టెన్..?

"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3" (Bigg Boss Telugu) నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్ తదుపరి కెప్టెన్‌షిప్ కోసం ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ద్వారా ఇంటికి కాబోయే కెప్టెన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.

విచిత్రమైన శిక్షలతో.. ఇంటి సభ్యులను ఉక్కిరిబిక్కిరి చేసిన బిగ్‌బాస్

ఇక టాస్క్ వివరాల్లోకి వెళితే.. నేనే రాజు నేనే మంత్రి అనే పేరుతో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్ మొత్తం రెండు లెవెల్స్‌లో సాగుతుంది. మొదటి లెవల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో పెట్టిన మూడు డ్రాగన్ గుడ్లని సభ్యులు సొంతం చేసుకోవాలి. అలా సొంతం చేసుకున్నవారు నేరుగా.. టాస్క్‌లో "లెవెల్ 2"కి వెళతారని బిగ్‌బాస్ తెలిపారు.

దానితో వెంటనే - శివ జ్యోతి, రోహిణి & వితికలు టాస్క్‌లో భాగంగా.. మూడు డ్రాగన్ గుడ్లని తమ సొంతం చేసుకున్నారు. ఇదిలావుండగా.. మిగిలిన ఇంటి సభ్యులలో హిమజ & శ్రీముఖిల నేతృత్వంలో రెండు టీమ్స్‌‌ని విభజించి.. వారి గ్రూప్‌లో చెరో నలుగురిని ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

అలా శ్రీముఖి టీంలో - అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, అషు రెడ్డి.. అలాగే హిమజ టీంలో - బాబా భాస్కర్, పునర్నవి, వరుణ్ సందేశ్ & రవికృష్ణలు చోటు దక్కించుకున్నారు.

ఈ రెండు టీమ్స్‌లోని సభ్యులు.. తమ ప్రత్యర్థి టీం ఏరియాలో తమ రంగు జెండాని నిలబెట్టాలి. అలా చివరి బజర్ వచ్చే సమయానికి.. ఎవరైతే తమ ప్రత్యర్థి ఏరియాలో జెండాలు ఉంచగలుగుతారో.. వారే ఈ టాస్క్‌లోని "లెవెల్ 1"ని దాటుతారు అని చెప్పడం జరిగింది. అదే సమయంలో డ్రాగన్ గుడ్లు దక్కించుకున్న ముగ్గురు కూడా.. గార్డెన్ ఏరియాలోనే ఉంటూ.. తమ వద్ద ఉన్న గుడ్లని ఎవరు కాజేయకుండా జాగ్రత్తపడాలి.

బిగ్‌బాస్ శిక్షకి గురైన శివజ్యోతి & రోహిణి...!

ఇక లెవెల్ 1 మొదలయ్యాక, రెండు టీంలు కూడా రసవత్తరంగా పోటీపడ్డాయి. చివరికి మాత్రం అవతలి వారి ఏరియాలో.. శ్రీముఖి టీం వారి జెండాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇరువురి టీమ్స్‌లో.. ఏ ఒక్క సైనికుడు కూడా బ్రతికి లేని కారణంగా.. ఈ రెండు టీమ్స్ "లెవెల్ 2"కి అర్హతను సాధించలేకపోయాయి. అయితే డ్రాగన్ గుడ్లు మాత్రం "లెవెల్ 1"లో.. ఒకరి నుండి మరొకరికి మారుతూ చివరికి రవికృష్ణ (Ravikrishna), అలీ రెజా & రాహుల్ సిప్లిగంజ్‌ల (Rahul Sipligunj ) వద్దకు చేరాయి.

అలా మిగిలిన ఈ ముగ్గురిని "లెవెల్ 2" కి పంపిస్తూ.. వీరి మధ్యనే ఇంటికి కాబోయే కొత్త కెప్టెన్ ఎవరు అన్నది నిర్ణయించడం జరుగుతుంది.. అని బిగ్ బాస్ తెలిపారు. మరి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో "లెవెల్ 2" పోరు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కెప్టెన్ అయ్యే వ్యక్తులు.. వచ్చే వారం నామినేషన్స్ నుండి బయటపడొచ్చు.

నిన్నటి ఎపిసోడ్ మొత్తం కెప్టెన్సీ టాస్క్‌తోనే గడిచిపోయింది. అయితే ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అంశాలు ఏంటంటే - టాస్క్‌లో ఉన్న సభ్యులందరిని చాకచక్యంగా అవుట్ చేసిన శ్రీముఖి... తన వరకు వచ్చేసరికి "తనని ముట్టుకోకూడదని.. తనతో విభేదాలు ఉన్నా సరే.. నా టీంలోకి తీసుకున్నాను" అని రాహుల్ సిప్లిగంజ్‌తో మాట్లాడడాన్ని ఇంటి సభ్యులు వ్యతిరేకించారు.

అలాగే లెవెల్ 1 ముగిశాక కూడా.. శ్రీముఖి అంశమే ఇంటి సభ్యుల మధ్య చర్చకి హాట్ టాపిక్‌గా మారింది. మరి శ్రీముఖి టాస్క్‌లో వ్యవహరించిన తీరు పై.. ఎటువంటి కామెంట్స్ వస్తాయో అన్నది తెలియాలంటే వారాంతం వరకు ఆగాల్సిందే..

కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ