Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్ ?

Bigg Boss Telugu 3:  అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్ ?

(Ali Reza Re Entry in Bigg Boss House)

ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగచ్చు అనేదానికి చక్కటి ఉదాహరణే - రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌ల మధ్య జరిగిన గొడవ. అది పక్కకి పెడితే.. ఈరోజు ఎపిసోడ్‌లో అలీ రెజా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది  ఇంటిసభ్యులకి ట్విస్ట్‌తో పాటు సర్‌ప్రైజ్‌లా కూడా మారింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. మరి అలీ రెజా ఒకవేళ  బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

ఇక రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌ల గొడవ విషయానికి వస్తే,  బిగ్‌బాస్ ఇచ్చిన వీక్లి టాస్క్‌లో పాల్గొంటుండగా .. వీరిద్దరూ బాహాబాహీకి దిగారు. ఆ పెనుగులాట జరుగుతున్న క్రమంలో.. వరుణ్ సందేశ్‌కి మద్దతుగా వితిక వచ్చింది. అదే సమయంలో రాహుల్‌ని ఆపే ప్రయత్నంలో.. ఆమె చేతివేలి గోళ్లు రాహుల్‌కి గుచ్చుకుపోవడం జరిగింది.

Bigg Boss Telugu 3 : రాహుల్ హౌస్‌‌లోకి రావడంతో.. డల్ అయిన శ్రీముఖి!

అలా గిచ్చడంపై రాహుల్ సిప్లిగంజ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అలా అనడం 'ముమ్మాటికి తప్పు' అని వరుణ్ సందేశ్ అనడంతో.. ఈ ఇరువురి మధ్య గొడవ మొదలైంది. అలా మొదలైన గొడవ చివరికి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో దూషణల వరకు వెళ్ళింది. ఆ దూషణల్లో భాగంగా గత వారాల్లో ఇంటి సభ్యులతో రాహుల్ సిప్లిగంజ్ ప్రవర్తన ఎలా ఉంది? గతంలో కూడా ఆయన ఇంటి సభ్యులతో వ్యవహరించిన తీరుని గుర్తు చేస్తూ.. కామెంట్స్ కూడా చేశారు. దీనితో ఈ ఇద్దరూ ఒకానొక సందర్భంలో తోపులాట వరకు వెళ్లగా.. ఇంటి సభ్యులు వచ్చి ఇద్దరిని పక్కకి జరపడం గమనార్హం.

అయితే ఈ గొడవ జరిగాక, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిలు ఒక వైపు ఉండిపోగా.. మరొక వైపు వరుణ్ సందేశ్, వితికలు ఉండిపోయారు. ఈ గొడవ జరిగే ముందు వరకు కలిసున్న ఈ నలుగురు.. గొడవ పూర్తవ్వగానే ఇలా విడిపోవడం జరిగింది. విడిపోవడమే కాకుండా.. ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలో శ్రీముఖి, రవిక్రిష్ణలు... వరుణ్ సందేశ్, వితికలకి మద్దతు తెలపడం గమనార్హం.

మొత్తానికి ఈ గొడవ వల్ల.. బిగ్ బాస్ ఇంటిలో స్నేహితులుగా ఉన్న వ్యక్తులు ఒక్క 10 నిమిషాల్లో విడిపోయి.. ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు. ఇలా జరుగుతుందని అటు ఇంటి సభ్యులు లేదా ఇటు షో చూస్తున్న వీక్షకులు కానీ ఏమాత్రం ఊహించలేదు. ఇక వీరిద్దరూ మళ్ళీ స్నేహితులవుతారా? లేదా? అనేది రాబోయే రోజుల్లో మాత్రమే తెలుస్తుంది.

ఇదిలావుండగా వీక్లి టాస్క్‌లో శ్రీముఖి ప్రదర్శన చాలా యాక్టివ్‌గా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. అలాగే మిగతా ఇంటి సభ్యులు తమ గొడవలో ఉండగా శ్రీముఖి - రవిక్రిష్ణలు మెల్లగా తమ టాస్క్‌ని పూర్తి చేసేసుకున్నారు. అలాగే టాస్క్‌లో అత్త పాత్ర పోషించిన శివజ్యోతి వీలునామా మాత్రం.. ఎవ్వరికీ దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయంలో ఆమె చాలా పకడ్బందీగా వ్యవహరించడం విశేషం.

 Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం ..!

ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్ మేట్స్ బాబా భాస్కర్,  శ్రీముఖిల మధ్య ఇంకా దూరం పెరుగుతూనే ఉంది. అయితే ఈ వారం బాబా భాస్కర్ వెళ్లిపోయే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉంది. ముఖ్యంగా శ్రీముఖితో మాట్లాడే సమయంలో.. ఆయన మాట తీరు ఈ వారం 'ఇంటి నుండి వెళ్ళేది తానే' అని చెబుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఏదేమైనా.. ఈ వారం హైలైట్‌గా నిలిచేది రాహుల్ సిప్లిగంజ్ - వరుణ్ సందేశ్‌ల మధ్య జరిగిన వివాదం & అలీ రెజా రీ-ఎంట్రీ. ఈ రెండింటి గురించి వీకెండ్‌లో నాగార్జున ఎటువంటి కామెంట్స్ చేస్తారనేది.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య గొడవ                                                                                   

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.