Bigg Boss Telugu 3 : రాహుల్ హౌస్‌‌లోకి రావడంతో.. డల్ అయిన శ్రీముఖి !

Bigg Boss Telugu 3 :  రాహుల్ హౌస్‌‌లోకి రావడంతో.. డల్ అయిన శ్రీముఖి !

(Sreemukhi is unhappy due to Rahul Sipligunj's Entry in Bigg Boss House)

బిగ్ బాస్ తెలుగు 'సీజన్ 3'లో మొన్న శనివారం నాడు ఫేక్ ఎలిమినేషన్ పేరిట.. రాహుల్ సిప్లిగంజ్‌ని రహస్యంగా ఒక రూమ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నిన్న తనను మళ్లీ హౌస్‌లోకి ప్రవేశపెట్టారు. అలా బిగ్ బాస్ హౌస్ ఆవరణలోకి మరోసారి ప్రవేశించాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ తరుణంలో శ్రీముఖి కాస్త డల్‌గా కనిపించింది. ఎలిమినేట్ అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఇలా మళ్ళీ హౌస్‌లోకి తిరిగొస్తాడని ఆమె ఊహించలేదు. అలాగే రాహుల్ తన ఎంట్రీలో భాగంగా  "ఎందుకు నన్ను హేట్ చేస్తున్నావు" అని అడగడంతో ఆమె కంగుతింది.

Bigg Boss Telugu 3 : కుటుంబ సభ్యులని చూసి.. కంటతడి పెట్టిన హౌస్ మేట్స్

అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. రాహుల్  ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వెళ్ళాక.. శ్రీముఖితో తన ఫ్రెండ్‌షిప్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే ప్రశ్నకి ఆయన సమాధానమిచ్చాడు "ఇంతక మునుపులా అయితే.. మా ఫ్రెండ్‌షిప్ కచ్చితంగా ఉండదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె నా పై ఒక ఇమేజ్ ఏర్పరచుకుంది. ఈ  నేపథ్యంలో తనని ఇంతకముందు చూసినట్టుగా చూడకపోవచ్చు" అని రాహుల్ చెప్పాడు. అయితే రాహుల్ అలా మాట్లాడడం.. తనకు ఇబ్బంది కలిగించిందని శ్రీముఖి తెలిపింది. 

ఈ క్రమంలో శ్రీముఖి మాట్లాడుతూ "రాహుల్ ఒక్కడే కాదు.. రోహిణి వెళ్ళేటప్పుడు కూడా నన్ను నిందించే వెళ్ళింది. వీళ్లిద్దరి పై నాకు హేట్ ఫీలింగ్ వచ్చినా సరే.. మౌనంగానే ఉన్నాను. వాళ్లు వెళ్లిపోతున్నారన్న ఉద్దేశంతోనే అలా ఉండిపోయాను" అని తెలిపింది. ఇదే సందర్భంలో వితిక కూడా మాట్లాడుతూ.. " హేమ, తమన్నా, అషు మొదలైన వారు కూడా..  ఇల్లు విడిచే వెళ్లే సమయంలో.. నా గురించి మాట్లాడిన మాటలు నచ్చలేదు" అని  తెలిపింది. మొత్తానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇలా మాట్లాడుకుంటారని ఊహించే .. రాహుల్ సిప్లిగంజ్‌ని వీరికి తెలియకుండా.. బిగ్‌బాస్ ఒక స్పెషల్ రూమ్‌లో ఉంచినట్టు స్పష్టమవుతోంది. 

మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొందరు ఆనందపడుతుంటే.. మరికొందరు మాత్రం ఊహించని ఈ సంఘటనకి షాక్‌లో పడిపోయారు. ఏదేమైనా బిగ్ బాస్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ కొందరికి స్వీట్‌గా ఉంటే.. మరికొందరికి మాత్రం హాట్‌గానే ఉంది.

ఇదిలావుండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. ఇంటి కెప్టెన్ అయిన మహేష్‌ని మినహాయించి.. మిగతా వారిని ఇద్దరిద్దరుగా బిగ్ బాస్ విడదీశారు. అందులో భాగంగా శ్రీముఖి - శివజ్యోతి, రవికృష్ణ - వితిక, వరుణ్ సందేశ్ - రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్ - పునర్నవి‌లని పెయిర్స్‌గా విడదీశారు.

Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం ..!

ఈ క్రమంలో హౌస్ మేట్స్.. తమకు జోడిగా ఉన్న వ్యక్తి కంటే తాము ఎందులో బెటరో చెబుతూ.. ఆ ఇంటిలో తామే ఎందుకు ఉండాలో చెప్పాలి. అదే సమయంలో ఇంటి సభ్యులు కూడా.. జోడిగా వచ్చిన ఇద్దరిలో తమకి నచ్చిన వారికి ఓటు వేయాలని బిగ్ బాస్ తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీముఖి, శివజ్యోతిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఇద్దరు కూడా తామెందుకు  హౌస్‌లో ఉండాలని భావిస్తున్నారో చెబుతూ.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. చివరికి ఇంటి సభ్యుల మద్దతు శివజ్యోతికి ఉండడంతో.. ఆమె సేఫ్ అయ్యి శ్రీముఖి నామినేషన్స్‌లో నిలవడం జరిగింది. 

అలా ఈ వారం నామినేట్ అయిన సభ్యులు - శ్రీముఖి, రవికృష్ణ, వరుణ్ సందేశ్ & బాబా భాస్కర్. ఈ నలుగురు ఇంటిసభ్యులలో ఒకరు.. ఈ వారం ఇంటి నుండి వెళ్ళిపోయేందుకు రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరన్నది ఆసక్తిగా మారింది.

ఏదేమైనా ఈ వారం నుండి టాస్క్‌ల లెవెల్ పెరగనుందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఫైనల్ ఎపిసోడ్‌కి కేవలం.. ఇంకా అయిదు వారాలే సమయం ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయం మాత్రం స్పష్టమైంది.

Bigg Boss Telugu 3:టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!