ADVERTISEMENT
home / వినోదం
‘ఓ బేబీ’ హిందీ రీమేక్‌లో.. అలియా భట్ లేదా కంగనా రనౌత్?

‘ఓ బేబీ’ హిందీ రీమేక్‌లో.. అలియా భట్ లేదా కంగనా రనౌత్?

కొరియన్ సినిమా “మిస్ గ్రానీ”కి (Miss Granny) తెలుగు రీమేక్‌గా వచ్చిన చిత్రం “ఓ బేబీ” (Oh Baby). ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషించగా.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సమంత పోషించిన పాత్రలో అలియా భట్ (Alia Bhatt) లేదా కంగనా రనౌత్‌ (Kangana Ranaut) నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

అలాగే “ఓ బేబీ” హిందీ రీమేక్ చిత్రంలో రానా దగ్గుబాటి ఓ ప్రధాన పాత్ర పోషిస్తారని.. అలాగే నిర్మాతగా కూాడా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. 70 ఏళ్ల ముసలావిడ.. 25 ఏళ్ల పడుచు పిల్లగా మారిపోతే ఎలా ఉంటుందన్న కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం.. బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని పలువురు చిత్ర విశ్లేషకులు అంటున్నారు. ఇక “ఓ బేబీ” చిత్రానికి వస్తే..ఈ సినిమా తొలివారంలోనే దాదాపు రూ.17 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును తిరగరాసింది.                                     

ADVERTISEMENT

కొరియన్ భాషలో తొలుత విడుదలైన “ఓ బేబీ” చిత్రం.. ఆ తర్వాత ఏడు భాషల్లోకి రీమేక్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో సమంత ప్రధాన పాత్రను పోషించగా.. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మీ, సునయన, నాగశౌర్య, ఊర్వశి, జగపతి బాబు, ఐశర్వ, ప్రగతి, తేజ సజ్జా, స్నిగ్ద, హేమంత్, ధనరాజ్, రాజా రవీంద్ర ఇతర పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.                                      

లక్ష్మీ భూపాల చిత్రానికి పాటలు, మాటలు సమకూర్చారు. నాగచైతన్య కూడా ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలలో నటించి కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర రీమేక్ రైట్స్‌కి.. ఇతర భారతీయ భాషల్లో మంచి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.                                                

“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

“ఓ బేబీ” చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూశారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ వర్క్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్, గురు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

ADVERTISEMENT

ఇందులో క్రాస్ పిక్చర్స్ అధినేత ఓ కొరియన్ కావడం విశేషం. 5 జులై 2019 తేదిన విడుదలైన “ఓ బేబీ” చిత్రం.. దాదాపు రూ.20 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కింది. 

అలా మొదలైంది, జబర్దస్త్, కళ్యాణ్ వైభోగమే.. చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని.. “ఓ బేబీ” చిత్రానికి దర్శకత్వం వహించారు డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ డిసెంబరు 2018 నెలలో జరిగింది. 

అమ్మ మనసుని తెరపై.. హృద్యంగా చూపించిన ‘ఓ బేబీ’

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది. 

 

 

11 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT