అలియా భట్ (Alia bhatt).. టీనేజీలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. వరుస విజయాలు సాధిస్తోన్న కథానాయిక. తాజాగా రాజీ, గల్లీబాయ్ చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటు కెరీర్‌లో విజయం సాధించడంతో పాటు అటు తనకెంతో ఇష్టమైన వ్యక్తితో డేటింగ్ చేస్తూ వ్యక్తిగతంగా కూడా ఎంతో సంతోషంగా ఉందీ బ్యూటీ.
అయితే అన్నింటా సంతోషంతో సాగిపోతున్నా.. కొన్నిసార్లు తాను కారణం లేకుండానే ఏడ్చేదాన్నని చెబుతూ తన మానసిక సమస్య డిప్రెషన్ గురించి అందరితోనూ పంచుకుంది అలియా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మానసిక పరిస్థితి గురించి ప్రపంచానికి తెలియజేసింది.
గతంలో డియర్ జిందగీ సినిమాలో మానసిక సమస్య ఉన్న అమ్మాయి పాత్రలో కనిపించింది అలియా. అందుకే ఎలాంటి బెరుకూ లేకుండా.. ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా డిప్రెషన్, యాంగ్జైటీ గురించి మాట్లాడింది. తన సమస్య గురించి బయటపెట్టింది. డిప్రెషన్ గురించి మాట్లాడుతూ – నేను డిప్రెషన్‌కి గురయ్యాను. అయితే ఎప్పుడూ అలాగే ఉండిపోకుండా అప్పుడప్పుడూ యాంగ్జైటీ అటాక్స్ వస్తూ పోతూ ఉంటాయి.
ఇది గత ఐదారు నెలల నుంచి జరుగుతోంది. ఇది పూర్తిగా యాంగ్జైటీ ఎటాక్ కాదు. అలాగని డిప్రెషన్ కూడా కాదు.. అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఇంకా మొదటి దశలోనే ఉంది. అలాగే మా అక్క షాహీన్ భట్ డిప్రెషన్ (Depression) తో బాధపడింది. తన అనుభవాలపై ఓ పుస్తకం కూడా రాసింది. ఆ పుస్తకం నేను చదివాను. కాబట్టి నాకు డిప్రెషన్ గురించి బాగా తెలుసు. అందుకే తొలినాళ్లలోనే దీని గురించి తెలుసుకొని చికిత్స తీసుకుంటున్నా.. అంటూ తన పరిస్థితిని వెల్లడించింది అలియా.
నాకు ఎంత బాధగా అనిపించినా దాన్ని భరించేందుకు నేను సిద్ధంగా ఉంటాను. కొన్నిసార్లు నాకు బాధగా అనిపిస్తుంది. కారణం లేకుండా ఏడుపొచ్చేస్తుంది. ఆ తర్వాత తిరిగి మామూలుగా మారిపోతాను. ప్రారంభంలో ఇది నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించేది. అయితే పని ఒత్తిడి ఎక్కువవడం వల్ల లేదా చాలాకాలం నుంచి స్నేహితులను కలవకపోవడం వల్ల ఇలా జరుగుతోందని నేను భావించేదాన్ని.
నా పర్సనాలిటీ దీని వల్ల పూర్తిగా మారిపోయింది. అందుకే ఈ విషయాన్ని ముందుగా నా స్నేహితులతో పంచుకున్నా. నా స్నేహితులు అయాన్ ముఖర్జీ, రోహన్ జోషీలతో ఈ విషయాన్ని పంచుకున్నా. కొన్ని రోజులకు అది పూర్తిగా తగ్గిపోతుందని.. అయితే అప్పటివరకూ పరిస్థితి ఎలా ఉందో.. దాన్ని అలా ఒప్పుకోవాలని వారు నాకు చెప్పారు. మనసు బాగాలేకపోయినా సరే.. బాగున్నా అంటూ బాధను నాలో దాచుకోవద్దని వారు నాకు చెప్పారు. మనసులో ఏం అనిపించినా దాన్ని బయటకు చెప్పమని చెప్పారు. అలాంటి స్నేహితులు ఉండడం నా అదృష్టం అనుకోవాలి.. అని చెప్పుకొచ్చింది.
గతంలోనూ మానసిక సమస్యల గురించి బయటకు చెప్పడం మంచిది అంటూ తన అక్క డిప్రెషన్ గురించి చెబుతూ అందరినీ తమ సమస్యలు పంచుకోమని ప్రోత్సహించింది అలియా. గతంలో అలియా తన అక్క రాసిన పుస్తకం గురించి పంచుకుంటూ తన అక్కకి ఉత్తరం కూడా రాసి ఆ వీడియోను పోస్ట్ చేయడం విశేషం.
ప్రస్తుతం అలియా నటించిన కలంక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమెతో పాటు సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, వరుణ్ ధావన్, సంజయ్ దత్‌లు నటించారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తోన్న RRR చిత్రంలోనూ కథానాయికగా నటించనుంది.
అద్భుతమైన వార్త.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చక్కటి మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మరెన్నో ఇక్కడ 25 శాతం డిస్కౌంట్‌తోనే లభిస్తున్నాయి. POPXOFIRST అనే కూపన్ కోడ్‌ని ఉపయోగించండి. దీంతో మహిళలకు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.
ఇవి కూడా చదవండి.
షారూఖ్ పార్టీకి అమీర్ టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాడట.. ఎందుకో తెలుసా?
చక్కటి లిమి సంతకం..ఈ మహర్షి మొదటి పాట..ఛోటీ ఛోటీ బాతే..!
తమన్నా ఈ నటుడితో.. డేటింగ్‌కి వెళ్లాలని అనుకుందట. ఎందుకో తెలుసా?
Images : Instagram.