(Kareena Kapoor or Anushka Sharma to play lead role in Hindi Remake of “Arundathi”)
కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో విడుదలైన “అరుంధతి” చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాసిందో మనకు తెలియంది కాదు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన అనుష్క శెట్టికి.. ఆ సినిమా ఒక మరచిపోలేని విజయాన్ని అందించింది. ఆమె నటనా ప్రస్థానంలో ఒకానొక కీలక చిత్రంగా నిలిచింది. ఆ చిత్రంలో “జేజమ్మ” పాత్రలో.. ఆమె ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ “అరుంధతి” చిత్ర రీమేక్ హక్కులను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించేందుకు కరీనా కపూర్‌తో పాటు అనుష్క శర్మను.. ఆయా సంస్థ నిర్మాతలు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరిని ఫైనలైజ్ చేస్తారన్న విషయంపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని.. పలు ఆంగ్ల పత్రికలు రాయడం గమనార్హం.
ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..
కరీనా కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె రెండు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి రాజ్ మహతా దర్శకత్వం వహిస్తున్న “గుడ్ న్యూస్”. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. అలాగే కరీనా నటిస్తున్న మరో చిత్రం పేరు “అంగ్రేజీ మీడియం”. హోమీ అద్జానియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. 2018లో కరీనా నటించిన “వీరా ది వెడ్డింగ్” సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
నా 14 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఒక అందమైన కల: అనుష్క శెట్టి
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే.. తను నటించిన ఆఖరి చిత్రం “జీరో” 2018లో విడుదలైంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా.. అంత పెద్ద హిట్ చిత్రంగా ఏమీ నిలవలేదు. ఆ తర్వాత అనుష్క ఏ సినిమాకీ సైన్ చేయలేదు. అయితే వ్యాపార రంగంలో మాత్రం ఆమె దూసుకెళ్తోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లో విరివిగా పాల్గొంటోంది. ఫార్చ్యూన్ ఇండియా వారు ప్రకటించిన “భారతదేశంలోనే శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితా”లో అనుష్క కూడా చోటు దక్కించుకుంది.
అరుంధతి.. దేవసేన.. భాగమతి.. ఈ పాత్రలను మించిన క్యారెక్టర్‌లో అనుష్క నటిస్తోందా..?
అయితే బిజినెస్ రంగంలో ఇంత బిజీగా ఉన్న అనుష్క.. మళ్లీ సినిమాల్లో నటిస్తుందా..? అని పలువురు అంటున్నారు. అయితే మంచి స్క్రిప్ట్.. మంచి పవర్ ఫుల్ పాత్ర దొరికితే తాను సినిమా చేస్తానని.. గతంలో అనుష్క శర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆమె నటించిన “సూయ్ దాగా”లో అనుష్క నటన.. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అదే సంవత్సరం ఆమె నిర్మాతగా మారి.. నటించిన “పారి” చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.