అరుంధతి.. దేవసేన.. భాగమతి.. ఈ పాత్రలను మించిన క్యారెక్టర్‌లో అనుష్క నటిస్తోందా..?

అరుంధతి.. దేవసేన.. భాగమతి.. ఈ పాత్రలను మించిన క్యారెక్టర్‌లో అనుష్క నటిస్తోందా..?

"బాహుబలి" లాంటి జానపద చిత్రంలోనూ.. "రుద్రమదేవి" లాంటి చారిత్రక చిత్రంలోనూ నటించిన అనుష్క (Anushka Shetty).. రాజసం ఉట్టిపట్టే అలాంటి పాత్రలను అవలీలగా పోషించగలదని ఎప్పుడో ప్రూవ్ చేసింది. అంతకముందే ఆమె అరుంధతి చిత్రంలో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని కూడా సంపాదించుకుంది. ఇప్పుడు చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న "సైరా" చిత్రంలో కూడా అనుష్క.. ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తుందని టాక్. అయితే భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని ప్రధానాశంగా తీసుకొని నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క.. ఝూన్సీ లక్ష్మీబాయి పాత్ర పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. కాకపోతే.. ఇదే వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఇప్పటికే కంగన రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తీసిన "మణికర్ణిక"లో టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్రలో ఇప్పటి వరకూ ఏ తెలుగు హీరోయిన్ కూడా నటించలేదు. ఒకవేళ అనుష్క కనుక.. సైరా చిత్రంలో ఈ పాత్రను గనుక పోషిస్తే.. దాని నిడివి ఎంతవరకు ఉంటుందన్నది కూడా ప్రధానమైన చర్చే. ఇదే సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

ఈ కథనం కూడా చదవండి:  ఈ ఫీమేల్ ఓరియంటెడ్‌ సినిమాలు నేటి త‌రం అమ్మాయిల‌కు ఆద‌ర్శం..

సైరా చిత్రంలో అనుష్క కథను నేరేట్ మాత్రమే చేస్తారని.. ఆమె ఈ చిత్రంలో ఎలాంటి పాత్రనూ పోషించరని కొందరు అంటున్నారు. ఇదే చిత్రంలో హీరోయిన్ తమన్నా మాత్రం నెగటివ్ షేడ్స్ ఉన్న ఓ పాత్రలో నటిస్తున్నారట. ఈ సంవత్సరం అక్టోబరు 2వ తేదిన గాంధీ జయంతిని పురస్కరించుకొని సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథను అందిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ కథనం కూడా చదవండి: టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?

View this post on Instagram

Thank you #Ananthakrishnan 😊

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

ఇక అనుష్క ప్రస్తుత సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె "సైలెన్స్" అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా ఆ చిత్రం తెరకెక్కనుంది. ఎ ఫ్లాట్, వస్తాడు నా రాజు, ముంబయి 125 కిమి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమాంత్ మధుకర్.. ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను అనుష్క సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బాహుబలి విడుదలయ్యాక.. అనుష్క ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. 

ఈ కథ కూడా చదవండి: నా 14 ఏళ్ల సినీ ప్ర‌స్థానం.. ఒక‌ అంద‌మైన క‌ల‌: అనుష్క శెట్టి

2018లో కూడా అనుష్క ఒకే ఒక చిత్రంలో నటించారు. అదే "భాగమతి". ఆ చిత్రం ఆమెకు మంచి పేరే తీసుకువచ్చింది. బాహుబలి 2 విడుదల అవ్వక ముందు మాత్రం సింగం 3, ఓం నమో వెంకటేశాయ, సైజ్ జీరో చిత్రాలలో నటించారు అనుష్క. ప్రస్తుతం సైరాలో ఆమె ఝూన్సీ లక్ష్మీబాయిగా అతిథి పాత్రలో నటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.  ఆ మధ్యకాలంలో అనుష్క బాలీవుడ్‌లో నటించనున్నారని కూడా పలు వార్తలు వచ్చాయి. మొత్తానికి సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక.. ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వస్తున్నాయన్నది మాత్రం నిజం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.