టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?

టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?

సినిమాల్లోకి వెళుతున్నాను అని ఎవరికైనా చెబితే ... అది విన్న వారి నోటినుండి వెంటనే వచ్చే మొదటి మాట.. “గ్యారంటీ లేని దాని కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావు..” అని. ఈ రోజుల్లో సినీ రంగంలో నటీమణులుగా ఎంట్రీ ఇచ్చే వారు ఎన్ని రోజులు ఈ గ్లామర్ ఫీల్డులో నెగ్గుకురాగలరో చెప్పడం చాలా కష్టం.


అయితే అవకాశాలు తక్కువగా ఉండే ఇలాంటి రంగంలో కూడా.. ఒక దశాబ్దానికి పైగానే కొందరు తమ సత్తాని చాటారంటే అది నిజంగా అభినందించాల్సిన అంశమే. టాలీవుడ్ (Tollywood) పరిశ్రమలో అలా దూసుకుపోతున్న ఓ అయిదుగురు ప్రముఖ హీరోయిన్స్ (టాలీవుడ్ క్వీన్స్) గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ... 


నయనతార


ఈ మలయాళ ముద్దుగుమ్మ తన మాతృ బాష అయిన మలయాళంలో 2003లోనే తెరంగేట్రం చేసినప్పటికీ.. మన తెలుగు ప్రేక్షకులకి మాత్రం 2005లో విడుదలైన చంద్రముఖి (డబ్బింగ్ చిత్రం)తో పరిచయమైంది. ఇక అప్పటినుండి మొదలైన ఈ అమ్మడి హవా ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. సింహా, శ్రీ రామరాజ్యం, తులసి, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి చిత్రాలకు నయనతార ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహ రెడ్డి చిత్రంలో నటిస్తోంది.


giphy


త్రిష


త్రిషకి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చాలామంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి . ఆమె తెలుగు వారికి ఒక డబ్బింగ్ చిత్రం ద్వారానే పరిచయమైనప్పటికి ...ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన "వర్షం " చిత్రంలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత విడుదలైన "నువ్వొస్తానంటే నేనొద్దంటానా " చిత్రంతో ఆమె ఒక విధంగా స్టార్ స్టేటస్ అందుకుందనే చెప్పాలి. ఆ తర్వాత అతడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, దమ్ము మొదలైన చిత్రాల్లో నటించింది. దాదాపు 15 ఏళ్ళుగా ఆమె తన కెరీర్ కొనసాగిస్తూ ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి తన అభిమానుల మనసులని గెలుచుకుంది.   


Trisha-performance-in-the-movie-samy


 


అనుష్క శెట్టి


" సూపర్" చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ సూపర్ స్టార్ తన కెరీర్ తొలినాళ్ళలోనే " అరుంధతి" వంటి చిత్రంతో ఒక మరపురాని పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటు గ్లామర్.. అటు అభినయం ఉన్న సినిమాలని చేసుకుంటూ తెలుగు నాట నెం 1 కథానాయికగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది . ఇక బాహుబలి 1 & 2 లలో ఆమె నటన అందరికి గుర్తుండిపోయేదే. ప్రస్తుతం తన నటనాజీవితంలో కాస్త విరామం తీసుకున్న అనుష్క.. త్వరలో మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుందాం.


Anushka-shettys-performance-in-the-movie-arundati


తమన్నా


2005లోనే తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ మిల్కీ బ్యూటీకి శేఖర్ కమ్ముల తీసిన " హ్యాపీ డేస్" చిత్రంతో కాని సరైన బ్రేక్ రాలేదు. ఇక ఆ తరువాత ఇటు తెలుగు.. అటు తమిళ నాట చిత్రాలు చేస్తూ బిజీ కథానాయికగా మారిపోయింది. ఇక బాహుబలి పార్ట్ 1లో ఆమెని చూడడానికే ప్రేక్షకులు ప్రత్యేకంగా వచ్చారు అన్న టాక్ కూడా ఆ చిత్ర విడుదల సమయంలో వినపడింది . ఇక ఈ మధ్య పలు హిందీ చిత్రాలతో కూడా బిజీ అయిన తమన్నా ప్రస్తుతం తెలుగులో "నెక్స్ట్ ఏంటి " అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానుంది.


tamannah-in-the-movie-baahubali


కాజల్ అగర్వాల్


దర్శకుడు తేజ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ అనతికాలంలోనే మంచి విజయాలను సొంతం చేసుకుంది. 2007లో పరిశ్రమకి వచ్చిన సమయం నుండి ఈరోజు వరకు కూడా దాదాపు అందరు హీరోలతో నటించి.. ఇప్పుడు యువ హీరోలతో కూడా నటించడానికి సై అంటోంది ఈ ముంబై భామ. దాదాపు మెగా హీరోలందరి పక్కన కథానాయికగా చేసిన ఈ జనరేషన్ హీరోయిన్ అనే రికార్డు కూడా కాజల్ సొంతం. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాల్లో నటించి.. ఆమె తన అందం ,అభినయంతో ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని కోరుకుందాం.


kajal-aggarwal-in-the-movie-magadheera


తెలుసుకున్నారుగా ... అత్యంత స్వల్పకాలికం అనుకునే సినిమా కెరీర్లో ఈ అయిదుగురు నటీమణులు తమకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుని ఒక దశాబ్దానికి పైగానే తమ నటనా జీవితాన్ని కొనసాగించడం నిజంగా అభినందించాల్సిన విషయమే.