ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో (Bigg Boss Telugu) ఎనిమిదవ వారం మొదలైంది. అలీ రెజా ఎలిమినేషన్‌తో ఏడవ వారం షాకింగ్‌గా ముగియడంతో .. ఈ వారం నామినేషన్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. పైగా ఈ వారం నుండి  సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకి సంబంధించి పోటీ ఆరంభమవుతున్నట్లు బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది.

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!

ఇక ఆ నామినేషన్స్‌లో భాగంగా రెండు గ్రూపులుగా ఇంటి సభ్యులని విభజించారు. ఒక గ్రూప్‌లో వితిక, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శిల్పా చక్రవర్తి, పునర్నవి ఉండగా.. మరొక గ్రూప్‌లో రవికృష్ణ, హిమజ, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్ విట్టా ఉన్నారు. బాబా భాస్కర్ ఇంటి కెప్టెన్ అయిన కారణంగా.. ఆయనకు నామినేషన్స్ నుండి ఉపశమనం ఇవ్వడం జరిగింది.

ఎక్కువగా ఓట్లు వచ్చి ఈ వారం నామినేట్ అయిన సభ్యులు – శిల్పా చక్రవర్తి, పునర్నవి, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖి & రవికృష్ణ. 

ADVERTISEMENT

ఇదే క్రమంలో బిగ్ బాస్ (Bigg Boss) ఇంటి కెప్టెన్ అయిన బాబా భాస్కర్‌కి.. ఒక ప్రత్యేకమైన పవర్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ ప్రకారం, నామినేషన్స్ నుండి ఒకరిని సేవ్ చేయమని ఆయనను బిగ్ బాస్ కోరారు. దీంతో ఆయన రవికృష్ణ‌ని సేవ్ చేయడం జరిగింది. 

అయితే బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేయమని బాబా భాస్కర్‌ని (Baba Bhaskar) అడగగా.. తనని కాకుండా ఆయన రవికృష్ణని సేవ్ చేయడంతో శ్రీముఖి (Sreemukhi) ఫీల్ అయినట్లు, ఆ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేనట్లు.. మనకు ఆమె రియాక్షన్ ద్వారా అవగతమవుతోంది. అయితే మిగతా ఇంటి సభ్యులకు మాత్రం బాబా భాస్కర్ తీసుకున్న నిర్ణయం బాగా నచ్చడం విశేషం.

అలాగే నామినేషన్స్‌లో ఉన్న పునర్నవి, మహేష్ విట్టాలు కూడా.. తమని అకారణంగా నామినేట్ చేసినట్లు మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా వరుణ్ సందేశ్, వితిక, శివజ్యోతి చెప్పిన కారణాలతో తాము విబేధిస్తున్నట్లుగా వారు తెలిపారు.

ఈ సందర్భంగా తనని, బాబా భాస్కర్‌ని విడదీసేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నిస్తున్నారని మహేష్ విట్టా ఆరోపించారు. అయితే ఈ సారి నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ.. హిమజ ఏమాత్రం కూడా బాధ పడలేదు. సరికదా.. నామినేషన్స్‌ని స్పోర్టివ్‌గా కూడా తీసుకోవడం జరిగింది.

ADVERTISEMENT

Bigg Boss Telugu 3: ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు చదివి.. భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్

నామినేషన్స్ సందర్భంగా ఆసక్తికరంగా జరిగిన మరొక విషయమేమిటంటే – ప్రతివారం రాహుల్ సిప్లిగంజ్‌ని నామినేట్ చేస్తానని చెప్పే శ్రీముఖి.. ఈ వారం ఆ మాటని పక్కన పెట్టి తనని నామినేట్ చేయలేదు. అయితే రాహుల్ మాత్రం “శ్రీముఖి తనని బెస్ట్ ఫ్రెండ్ అనడమే తప్ప.. అలా తనని చూడని కారణంగా” ఆమెని నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం విశేషం.

ఇదిలావుండగా “ఒప్పో బీబీ రిపోర్టర్ టాస్క్” అనే ఒక టాస్క్‌ను హౌస్ మేట్స్‌కి ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్‌లో రిపోర్టర్‌గా శివజ్యోతిని, ఫోటోగ్రాఫర్‌గా హిమజని నియమించగా… వారు ఇంటి సభ్యుల మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను ఫోటోలు, వీడియోలుగా తీయడం జరిగింది. అలా తీసిన వాటిని టీవీలో చూపెట్టగా.. వాటికి ఆసక్తికరమైన రిపోర్టింగ్ చేస్తూ అందరిని నవ్వించింది శివజ్యోతి.                                            

ఆఖరుగా “బిగ్ బాస్ సీజన్ 3” 50 రోజులు పూర్తయ్యాయని.. ఈ క్రమంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించి పోటీ ప్రారంభమైందని  బిగ్ బాస్ ప్రకటించారు. ఈ  క్రమంలో ఈ వారం జరిగిన నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ నామినేషన్స్ ప్రభావం ఇంటి సభ్యుల పైన ఏ విధంగా పడనుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

09 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT