"బిగ్ బాస్ 3" తెలుగు రియాల్టీ షో.. కంటెస్టంట్స్ వీరేనా..?

"బిగ్ బాస్ 3" తెలుగు రియాల్టీ షో.. కంటెస్టంట్స్ వీరేనా..?

స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షోకి ఎంత ఆదరణ ఉందో.. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మూడో సీజన్‌లోకి కూడా అడుగుపెట్టబోతోంది. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో శివబాలాజీ టైటిల్ గెలుచుకోగా.. రెండవ సీజన్‌లో కౌశల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో  అనగానే పలు కాంట్రవర్సీలు, పుకార్లు మీడియాలో సర్క్యులేట్ అవ్వడం సహజంగా మారిపోయింది.


ఇప్పుడు అలాంటి వదంతులే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.  ముఖ్యంగా ఈసారి షోని ఎవరు హోస్ట్ చేస్తున్నారనే అంశం పై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ  సీజన్‌లో నటుడు నాని ఆ బాధ్యతలు స్వీకరించారు.


ఇప్పుడు మూడో సీజన్‌లో ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు అన్న ప్రశ్నకి.. నెటిజన్లు చాలా ఆప్షన్లు చెప్పడం గమనార్హం. రానా, విజయ్ దేవరకొండ, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి మొదలైన వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. హీరోయిన్ అనుష్క కూడా హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్న సెలబ్రిటీల విషయానికి.. వస్తే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు నిన్నటి వరకూ బాగా వినిపించింది.అయితే తాను ఈ షోలో పార్టిసిపేట్ చేయడం లేదని.. ఇలా సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, ఆమె ఈ రోజు ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో 'బిగ్ బాస్ 3'లో పార్టిసిపేట్ చేయబోయే సెలబ్రిటీల ఎవరై ఉంటారా? అన్న అంశం సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.


ఈ క్రమంలో మరికొందరి పేర్లు తెరమీదికి రావడం గమనార్హం. ముఖ్యంగా మేల్ కంటెస్టెంట్స్‌లో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్, హీరో వరుణ్ సందేశ్, గాయకుడు హేమచంద్ర,  టాలీవుడ్ నటుడు కమల్ కామరాజు, 'రొమాంటిక్ క్రైం స్టోరీ ' సినిమా హీరో మనోజ్ నందం, జబర్దస్త్ ఫేమ్ పొట్టి రమేష్, కొరియోగ్రాఫర్ రఘు, యాంకర్ హేమంత్.. మొదలైన వారు బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం గమనార్హం.


ఇక ఫిమేల్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. యాంకర్ రష్మీ, శ్రీముఖి, ఉదయభాను, నటి హరిత, రేణు దేశాయ్, కరాటే కళ్యాణి మొదలైన వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో కూడా తెలియదు. గతంలో వైవా హర్ష, హీరో తరుణ్ కూడా బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.


అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకోవాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. జులై 16, 2017లో తొలిసారిగా ఈ షో స్టార్ మాలో ప్రసారమైంది. రెండో సీజన్ మాత్రం జూన్ 10, 2018 తేదిన ప్రారంభించారు. ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభమవడానికి కూడా రోజులు దగ్గరపడుతున్న క్రమంలో.. కంటెస్టెంట్స్ విషయంలో ఆసక్తి పెరిగింది.  70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో సాగే ఈ రియాలిటీ షోలో.. ఈ సారి ఓ కామన్ మేన్‌తో పాటు.. కామన్ ఉమన్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి


జబర్దస్త్ యాంకర్ 'రష్మీ' హీరోయిన్‌గా.. కొత్త చిత్రం..!


మన సినిమాలూ... కామిక్ బుక్స్‌గా వచ్చేస్తున్నాయి..!


మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!