నా పాప రాసింది చదివి.. కన్నీళ్లు పెట్టుకున్నాను : సుస్మితా సేన్

నా పాప రాసింది చదివి.. కన్నీళ్లు పెట్టుకున్నాను : సుస్మితా సేన్

#BornFromTheHeart : Sushmita Sen's Daughter Pens An Emotional Essay On Adoption

బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్ తన దత్త పుత్రిక అలీషాకి సంబంధించిన ఓ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అలీషాకి స్కూల్లో ఓ టాపిక్ మీద వ్యాసం రాయమని టీచర్ కోరగా.. ఆమె "దత్తత" అనే అంశంపై ఓ వ్యాసం రాసింది. "నా తల్లి ఓ చిన్నారిని కాపాడి.. ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించిందని" సుస్మిత గురించి చెబుతూ అలీషా ఆ వ్యాసంలో పేర్కొంది. అలీషా వ్యాసం రాస్తున్నప్పుడు తీసిన వీడియోను చూసి.. అలాగే ఆమె రాసింది చదివి సుస్మిత భావోద్వేగానికి గురైంది. ఆ వీడియోను తన అభిమానుల కోసం ట్విటర్‌లో కూడా పోస్టు చేసింది. 

రాజశేఖర్ కుమార్తె శివాని ఛాలెంజ్ స్వీకరించిన.. ఆర్ ఎక్స్ 100 హీరో

"దత్తత తీసుకోవడం అంటే హృదయం నుండి జన్మనివ్వడం" అని సుస్మిత ఈ సందర్భంగా తెలిపింది. 25 ఏళ్లు నిండకముందే సుస్మిత తన తొలి బిడ్డగా రీనా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు అలీషాను దత్తత తీసుకుంది. అనేకసార్లు సోషల్ మీడియాలో తన బిడ్డలపై ఉన్న ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరిచింది సుస్మిత. అలీషా, రీనాలు తనకు రెండు కళ్లని ఆమె పేర్కొంది. 

ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??

ప్రస్తుతం అలీషాకి 10 ఏళ్లు. ఓ ఇంటర్వ్యూలో తన దత్త పుత్రికల గురించి మాట్లాడుతూ సుస్మిత తన మనసులోని మాటలను పంచుకుంది. దత్తత తీసుకోవడమంటే ఏదో ఛారిటీ చేస్తున్న ఫీలింగ్‌లా తనకు ఎప్పుడూ అనిపించలేదని.. దత్తత అనేది ఒక బాధ్యత అని.. మంచి మనసుంటేనే ఎవరినైనా అక్కున చేర్చుకోవాలని అనిపిస్తుందని ఆమె తెలిపింది. నిజాయతీగల ప్రేమలో ఉండే శక్తి అదేనని ఆమె చెప్పింది. 

 

1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న సుస్మితా సేన్.. తర్వాత బాలీవుడ్‌లో కూడా అగ్రనటిగా కొన్నాళ్లు తనను తాను నిరూపించుకుంది. బీవీ నెంబర్ 1 చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా కైవసం చేసుకుంది. ఆంఖే, మే హూ నా, ఫిలాల్, బేవఫా, చింగారీ లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. తమిళ, తెలుగు భాషలలో విడుదలైన "రక్షకుడు" చిత్రంలో.. నాగార్జున సరసన నటించిన సుస్మిత దక్షిణాదిలో కూడా మంచి పాపులర్ నటిగా మారింది. 

ప్రస్తుతం సుస్మితా సేన్ తన కూతురికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశాక #BornFromTheHeart హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. సుస్మితది నిజంగానే గొప్ప మనసని ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే అలీషాని కూడా కొనియాడుతున్నారు. వీరిద్దరిదీ కేవలం తల్లీ, కూతుళ్ల బంధం మాత్రమే కాదని.. అంతకు మించిన అనుబంధమని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 

డియర్ మమ్మీ... నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.