రాజశేఖర్ కుమార్తె శివాని ఛాలెంజ్ స్వీకరించిన.. ఆర్ ఎక్స్ 100 హీరో

రాజశేఖర్ కుమార్తె శివాని ఛాలెంజ్ స్వీకరించిన.. ఆర్ ఎక్స్ 100 హీరో

తెలుగులో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరుగాంచిన హీరో డాక్టర్ రాజశేఖర్ అన్న సంగతి మనకు తెలిసిందే. అంకుశం, ఆహుతి, ఆవేశం, మగాడు లాంటి యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తర్వాత అల్లరి ప్రియుడు లాంటి సినిమాతో అప్పట్లో లవర్ బాయ్‌గానూ అభిమానులను సంపాదించుకున్నారు.

ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలకు పరిమితమయ్యారు. సింహరాశి, మా అన్నయ్య, గోరింటాకు, మనసున్న మారాజు లాంటి చిత్రాలు ఆయనకు మంచి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చాయి. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు పెద్ద ఆదరణకు నోచుకోలేదు. చాలా ఫ్లాప్స్ ఎదురయ్యాక.. గతేడాది ఆయన నటించిన గరుడవేగ చిత్రం బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తాను చాటింది. టేకింగ్ పరంగా.. కలెక్షన్ల పరంగా ఫరవాలేదనిపించుకుంది. 

ఈ కథనం కూడా చదవండి: 'మా' ఎలక్షన్స్‌లో మహిళల సత్తా.. కీలక పదవుల్లో జీవిత రాజశేఖర్, హేమ..!

Kalki Movie Poster

ఇటీవలే రాజశేఖర్ కుమార్తె శివాని (Shivani Rajasekhar) కూడా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. 2 స్టేట్స్ అనే చిత్రంతో ఆమె త్వరలో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం కానుంది. కాగా.. ఇటీవలే ఆమె సినీ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. అయితే అది తన సినిమా ప్రమోషన్ కోసం కాదండోయ్. తన తండ్రి రాజశేఖర్ సినిమా ప్రమోషన్ కోసం. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కల్కి (Kalki) సినిమా త్వరలో విడుదల అవుతుందన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’కి ఇటీవలి కాలంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పాటకు తమదైన శైలిలో డ్యాన్స్ చేసి.. సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేయమని సినీ అభిమానులను శివాని కోరిందట. ఆమె అలా అడగడమే తరువాయి.. అనేకమంది ఆ పాటకు తమదైన స్టెప్స్‌తో డ్యాన్స్ చేసి.. వీడియోలు పోస్టు చేశారట. 

ఈ కథనం కూడా చదవండి: బాలీవుడ్‌లో దీపికా రణ్‌వీర్.. మరి టాలీవుడ్‌లో..?

 

అలా వీడియోలు పోస్టు చేసినవారిలో టాలీవుడ్ నటుడు కార్తికేయ (Kartikeya) కూడా ఒకరట. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో బాగా పాపులరైన కార్తికేయ.. ఇటీవలే హిప్పీ అనే చిత్రంలోనూ నటించారు. కానీ ఆయన గత చిత్రంతో పోల్చుకుంటే.. ఈ చిత్రం అంతగా ప్రేక్షకులకు రుచించలేదు.

ఇక శివాని విషయానికి వస్తే, ఆమె నటిస్తున్న 2 స్టేట్స్ చిత్రంలో అడివి శేషు కథానాయకుడిగా నటిస్తున్నారట. ఇప్పటికే ఆయన కర్మ, గూఢాచారి వంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అలాంటి బాహుబలి చిత్రంలో కూడా ఓ డిఫరెంట్ రోల్ పోషించారు. 

తాజాగా శివాని, అడివి శేషు నటిస్తున్న 2 స్టేట్స్ చిత్రం.. బాలీవుడ్ చిత్రం 2 స్టేట్స్ చిత్రానికి అధికారిక రీమేక్. చేతన్ భగత్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం హిందీ వెర్షనులో అలియా భట్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ కథనం కూడా చదవండి: తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 'దొరసాని' చిత్రం.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ ..!

Shivani Rajasekhar (Instagram)

ఇటీవలే రాజశేఖర్ మరో కుమార్తె శివాత్మిక కూడా కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆమె నటిస్తున్న దొరసాని చిత్రం ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా పరిచయం కావడం గమనార్హం. జులై 12వ తేదిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

కేవీఆర్ మహేంద్ర ఈ  సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాజశేఖర్ చిత్రం కల్కి చిత్రానికి వస్తే.. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు నిర్మాతలు. దానికి హానెస్ట్ ట్రైలరుగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఇటీవలే కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన చిక్కుల్లో పడింది. ఈ చిత్రకథ తనదేనని రచయిత కార్తికేయ అలియాస్ ప్రసాద్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషనుకి ఫిర్యాదు చేశారు.

Featured Image: Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.