జయహో భారత్.. శభాష్ ఇండియ‌న్ హీరోస్ (సోషల్ మీడియాలో ఆనంద హేల)

జయహో భారత్.. శభాష్ ఇండియ‌న్ హీరోస్ (సోషల్ మీడియాలో ఆనంద హేల)

ఫిబ్ర‌వ‌రి 26... ఉద‌యం లేస్తూనే భార‌త‌దేశం(India) ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది.. జోహార్ భార‌త వాయుసేన.. అంటూ నినదించింది. ఫిబ్ర‌వ‌రి 14న ప్ర‌ముఖ ఉగ్ర‌వాద సంస్థ జైషే మహ్మ‌ద్ భార‌తీయ సైనికులు వెళ్తున్న బ‌స్సుపై బాంబు దాడి చేసింది. ఈ దాడిలో న‌ల‌భైకి పైగా సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందిన సంగ‌తి తెలిసిందే. ఆ దాడికి ప్ర‌తీకార చ‌ర్య‌గా భార‌త వాయుసేన(indian air force) పాకిస్థాన్ భూభాగంలోని జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురిపించింది. మంగ‌ళ‌వారం మ‌న ఎయిర్‌ఫోర్స్ వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ దాటి పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి మ‌రీ జైషే మ‌హ్మ‌ద్ స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేసింది.


ఈ మెరుపు దాడితో ఉగ్ర‌వాద సంస్థ‌కే కాదు.. పాకిస్థాన్ సైన్యానికి కూడా దిమ్మ‌దిరిగిపోయింద‌ని చెప్ప‌చ్చు. ఈ దాడితో దేశ‌మంతా పుల‌కించిపోయింది. ప్ర‌జ‌లంతా ఒక్క‌టై మ‌న ఎయిర్‌ఫోర్స్ సాధించిన విజ‌యానికి జోహార్లు అంటూ నినదిస్తున్నారు. #IndiaStrikesBack హ్యాష్‌ట్యాగ్‌తో దేశం ప్ర‌తీకారం తీర్చుకుంద‌ని ఆనందంతో పండ‌గ చేసుకుంటున్నారు.


26 జ‌న‌వ‌రి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌మైతే.. 26 ఫిబ్ర‌వ‌రి ప్ర‌తీకార దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సామాన్యుల‌తో క‌లిసి సెల‌బ్రిటీలు కూడా మ‌న ఎయిర్‌ఫోర్స్ సాధించిన ఈ విజ‌యాన్ని ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ దాడి గురించి ఎవ‌రేం చెప్పారంటే..
1. మ‌న రియ‌ల్ హీరోస్‌కి పెద్ద సెల్యూట్ అంటూ రాశీ ఖ‌న్నా ట్వీట్ చేసింది.
2. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కి నా సెల్యూట్‌. దేశ‌మంతా ప్ర‌స్తుతం ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతోంది.అంటూ ట్వీట్ ద్వారా త‌న ఆనందాన్ని పంచుకుంది అందాల భామ ర‌కుల్ ప్రీత్.
3. ఫ‌స‌క్ కి అస‌లు అర్థం ఇదే.. జైహింద్ అంటూ ట్వీట్ చేసి ఆనందాన్ని చాటుకున్నారు మోహ‌న్‌బాబు..
4. జైషే మ‌హ్మ‌ద్ దాడికి జ‌వాబుగా భార‌త ఎయిర్ ఫోర్స్ చేస్తున్న ఈ దాడికి పూర్తిగా మ‌ద్ద‌తిస్తున్నా. మ‌న సైనికుల శౌర్యానికి స‌లాం చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్‌..
5. యుద్ధాన్ని మ‌నం మొద‌లుపెట్టం. కానీ దాన్ని హీరోల్లా పూర్తి చేస్తాం.. జైహింద్ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అంటూ ట్వీట్ చేసి ఆనందాన్ని పంచుకుంది స‌మంత‌.
6. అన్ని విష‌యాల‌పై త‌న‌దైన రీతిలో స్పందించే రామ్ గోపాల్ వ‌ర్మ దీనిపైనా ట్వీట్ చేశారు. అరే పాకిస్థాన్ నువ్వు ఒక‌టి కొడితే మేం నాలుగు కొడ‌తాం.. అంటూ ట్వీట్ చేశారు.
7. హీరో రామ్ ఈ విష‌యంపై స్పందిస్తూ.. చెప్పినం.. విన్లే.. భార‌త ఎయిర్‌ఫోర్స్ సరైన ప్లానింగ్‌కి, దాన్ని అమ‌ల్లో పెట్టిన విధానానికి సెల్యూట్ అని ట్వీట్ చేశాడు.
8. మ‌న దేశం సరైన స‌మాధానం చెప్పింది. భార‌త ఎయిర్ ఫోర్స్‌కి నా సెల్యూట్ అంటూ త‌న‌ ఆనందాన్ని పంచుకున్నాడు ఎన్టీఆర్‌.
9. భార‌త వాయుద‌ళానికి నా సెల్యూట్‌. ఈ రోజు ఒక్క ఉగ్ర‌వాదిని చంపినా.. రేపు వంద‌ల మంది అమాయ‌కులైన ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడిన‌వాళ్ల‌వుతారు.. అంటూ ట్వీట్ చేసింది అందాల భామ ప్ర‌ణీత‌.
10. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చేసిన దాడిని చూసి ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. వారి శౌర్యానికి నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేసింది త‌మ‌న్నా.
11. భార‌త్ త‌న‌పై జ‌రిగిన దాడికి తిరిగి దాడితోనే స‌మాధానం చెప్పింది. మ‌న ఎయిర్‌ఫోర్స్‌లోని సాహ‌స‌వీరుల‌కు నా స‌లామ్ అంటూ ఆనందాన్ని పంచుకుంది కాజ‌ల్‌.


 
12. ఎలాంటి జాలి, ద‌య లేని మాన‌వ మృగాల్లాంటి ఉగ్ర‌వాదుల‌ను అంత ప‌క్కాగా ప్లాన్ చేసి బాంబుల‌తో హ‌త‌మార్చిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు నా సెల్యూట్‌. దాడులు చేసి త‌ప్పించుకోవ‌చ్చ‌ని భావించే వారికి త‌మ ఆలోచ‌న త‌ప్ప‌ని నిరూపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.. అంటూ భావోద్వేగపూరిత‌మైన ట్వీట్ చేసింది కృతీ స‌న‌న్‌.
13. త‌న ఫ‌న్నీ ట్వీట్ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకునే సెహ్వాగ్ ఈ దాడిపై స్పందిస్తూ.. మ‌న బాయ్స్ చాలా బాగా ఆడారు. మీరే మారిపోండి లేదా మేం మారుస్తాం.. అంటూ ట్వీట్ చేశాడు.
14. భార‌త ఎయిర్‌ఫోర్స్‌కి, అందులోని ధైర్య‌సాహ‌సాలు క‌లిగిన పైలెట్ల‌కు ఉగ్ర‌వాదుల‌పై చేసిన ఈ అద్భుత దాడికి శుభాకాంక్ష‌లు. మిమ్మ‌ల్ని చూసి మేం గ‌ర్విస్తున్నాం.. అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.
15. జ‌వాన్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ ఈ దాడిని బాగా ఎంజాయ్ చేసిన‌ట్లుంది. దీనికి సంబంధించి నాలుగైదు ట్వీట్ల‌తో ఆక‌ట్ట‌కున్నాడీ యువ క‌థానాయ‌కుడు. పాకిస్థాన్ బతుకు ఎండ‌మావే అని చెబుతూ.. ఎండ‌మావంటే.. దూరంగా ఉన్న వ‌స్తువుపై వెలుగు ప‌డి కాస్త వంగిన‌ట్లుగా త‌యార‌వ‌డంతో అక్క‌డేదో వ‌స్తువు ఉంద‌ని అనిపించేలా చేస్తుంద‌ని చెబుతూ ఈ జోష్ ఎలా ఉంది.. అన్న ఉరి సినిమాలోని డైలాగ్‌ని పంచుకున్నాడు. ఇదే కాదు.. మ‌రో వీడియోను కూడా రిట్వీట్ చేసి త‌న ఆనందాన్ని పంచుకున్నాడు.
16. భార‌త ఎయిర్‌ఫోర్స్ ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌ను నాశ‌నం చేసినందుకు మ‌న ఎయిర్‌ఫోర్స్‌కి సెల్యూట్ అంటూ ట్వీట్ చేసింది సైనా నెహ్వాల్‌.


ఇవి కూడా చ‌ద‌వండి.


ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!


ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశ‌భ‌క్తిని మ‌రింత పెంచుతాయి..!


స్కూల్ మెమ‌రీస్.. మ‌న‌ జీవితంలోనే ఉత్త‌మ‌మైన‌వి ఎందుకంటే..