నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

చైసామ్.. టాలీవుడ్‌లో ఎందరికో ఇష్టమైన జంట. పర్ఫెక్ట్ పెయిర్ అనగానే గుర్తొచ్చే జంట వీరిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మాయిలందరూ చైతన్య (Chaitanya) లాంటి భర్తే తనకు కావాలి.. అని కోరుకునేలా వారి కెమిస్ట్రీ ఉంటుంది. అలాంటి అద్భుతమైన జంట వీరిది.. చిన్మయి శ్రీపాద హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న "ఫేమస్ లీ విత్ ఫిల్మ్ ఫేర్" కార్యక్రమంలో ఈ మధ్యే పాల్గొని చై తమ ప్రేమ గురించి చెప్పుకొచ్చారు.


సమంతతో (Samantha) ప్రేమ గురించి.. తనతో పెళ్లి తర్వాత జీవితం గురించి అన్ని విషయాలను పంచుకున్నారు. అంతకుముందు ఎపిసోడ్‌లో సమంత కూడా తన జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు చైతన్యతో తన బంధం గురించి చెప్పడం విశేషం. మరి, ఈ ఇంటర్వ్యూలో వారిద్దరూ పంచుకున్న ఈ విశేషాల గురించి మనం కూడా ఓసారి తెలుసుకుందాం..


5


సమంతతో తన ప్రేమ గురించి చెబుతూ.. "మా ఇద్దరి మొదటి సినిమా ఏం మాయ చేశావే. మొదటి సినిమా షూటింగ్ సమయంలో తనని చూసి నేను చాలా మంచి అమ్మాయి, అల్లరి పిల్ల అనుకున్నా. తనంటే నాకు అప్పటినుంచే ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం. నేను తనని స్నేహితురాలిగా చూశాను. కానీ తను మాత్రం మొదటి సినిమా షూటింగ్‌లో చూసిందట. "నిన్ను చూసినప్పుడే ప్రేమించేశాను. నువ్వే ఆలస్యం చేశావు.. నాది ఎనిమిదేళ్ల ప్రేమ" అంటూ నన్ను ఆటపట్టిస్తూ ఉంటుంది. అది ఎంత వరకూ నిజమన్న సంగతి నాకు తెలీదు.


మొదటి నుంచి మేం మంచి స్నేహితులం కాబట్టి అన్ని విషయాలు పంచుకునేవాళ్లం. అలా ఎప్పుడు స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారిపోయామో నాకు తెలీదు. మా పెళ్లికి ముందు.. ఒక సంవత్సరం పాటు మేమిద్దరం మామూలుగా కంటే కాస్త ఎక్కువే కలిసి బయటకు వెళ్లాం. అలా వెళ్లిన ఓ సందర్భంలో నాకు అనిపించింది.


"ఎలాగూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా కదా. ఇంతకంటే మంచి అమ్మాయి నాకు దొరుకుతుందా?" అని. సాధారణంగా పెద్దవాళ్లు అంటూ ఉంటారు కదా.. "తెలియని దేవత కంటే తెలిసిన రాక్షసి నయం" అని. నాకు తెలిసిన రాక్షసి సామ్ ఒక్కరే. అందుకే నాకు తెలిసిన ఈ అందాల రాక్షసిని పెళ్లి చేసుకున్నా. పెళ్లికి ముందు, తర్వాత తను చేసిన అల్లరి పనులన్నీ నాకు తెలుసు. కానీ అవన్నీ నాకు నవ్వు తెప్పిస్తాయి. తనపై ఉన్న ప్రేమను మరింత పెంచుతాయి. అందుకే తనంటే రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది.


2 9520295


నా దృష్టిలో ఇంట్లో నా భార్య నాకు సపోర్ట్ చేస్తూ, ఎప్పుడూ తను నవ్వుతూ నన్ను నవ్విస్తూ ఉండాలి. అలా ఉంటే చాలు.. పని, డబ్బు మిగిలినవన్నీ సెకండరీ విషయాలు. అందుకే పెళ్లిని నేను ఎంజాయ్ చేస్తున్నా. బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంత ఆనందం ఉంటుందని నాకు ముందు తెలీదు. పెళ్లికి ముందు రిలేషన్ షిప్ గురించి నాకు చాలా విషయాలు అర్థం అయ్యేవి కావు. అంతకుముందు ఖాళీ దొరికితే బయటకు వెళ్లాలనుకునేవాడిని. ఇంట్లో ఉండడం ముసలివాళ్లు చేసే పని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి తనతో ఎక్కువ సమయం గడపాలనిపిస్తోంది. పెళ్లయ్యాక నేను అంతగా మారిపోయాను.


1


మా పెళ్లికి మాతో బాగా క్లోజ్‌గా ఉన్నవారే అటెండ్ అవ్వాలని అనుకున్నాం. అందుకే తక్కువ మందిని పిలిచి పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు.. మా ప్రేమను చాటుకునేలా మేం ఇద్దరం మోర్స్ కోడ్‌లో మా పెళ్లి తేదీని ట్యాటూ వేయించుకున్నాం. ఆ పని కూడా మా పెళ్లి రోజు నాడే చేశాం.. అంటూ తమ ప్రేమ, పెళ్లి, పెళ్లి తర్వాత జీవితం గురించి పంచుకున్నాడు చైతన్య.


3


అంతకుముందు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సమంత తమ ప్రేమ గురించి చెబుతూ.. "మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ నా జర్నీలో చైతన్య తోడున్నాడు. నా గురించి నాకు కూడా తెలియని రోజులవి. నేను చాలా బలహీనురాలినని అనుకున్న రోజులవి. ఆ రోజులలో నా గురించి తెలుసుకొని.. నన్ను అర్థం చేసుకొని.. నా శక్తిని తెలుసుకొని.. ఈ రోజ వరకూ తను నాకు తోడున్నాడు. మొదటి నుంచి తనంటే నాకు ఎంతో ఇష్టం.


తనపై ఎక్కువగా ఆధారపడేదాన్ని. మేమిద్దరం ఒక్కటవ్వాలని ఉన్నా, ఏవో అడ్డంకులు వచ్చేవి. కొంతకాలం నేను తన ప్రేమలో ఉన్నా. కానీ తను వేరే అమ్మాయిని ప్రేమించేవాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. తర్వాత మరికొన్ని కారణాల వల్ల మేమిద్దరం దూరంగా ఉన్నాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు తను నాకు ప్రపోజ్ చేశాడు. అలా మేమిద్దరం ఒక్కటయ్యాం.


7


చిన్నతనం నుంచి చై లాంటి పర్ఫెక్ట్ మ్యాన్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నా. తను ప్రతి అమ్మాయికి ఓ డ్రీమ్ హస్బెండ్. అందుకే నాక్కూడా తను మొదట్లోనే నచ్చేశాడు. ఈ కారణంగానే 2016 డిసెంబర్‌లో చైతన్య నాకు ప్రపోజ్ చేయగానే వెంటనే ఒప్పుకున్నా.


2017 జనవరిలో మా ఇద్దరి ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ఆపై అక్టోబర్‌లో మేం పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లిలో ప్రతిఒక్కరూ మాకు బాగా తెలిసి ఉండాలని.. ప్రతి సంఘటనను మేం జీవితాంతం గుర్తుంచుకోవాలని భావించాం. అందుకే కేవలం 120 మందిని మాత్రమే పిలిచాం.


6


చైతన్యకు నాలో నచ్చని విషయం ఒక్కటే. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. కానీ చైకి అది నచ్చదు. అందుకే తను దగ్గరున్నప్పుడు మాత్రం దానికి నేను దూరంగా ఉంటా. ఇంట్లో ఉన్నప్పుడు మేం సినిమాలు, పని.. వేటి గురించీ మాట్లాడుకోం. రోజూ 6 తర్వాత బయట విషయాలు మాట్లాడకుండా కేవలం మా కుటుంబం, మా గురించి మాత్రమే మాట్లాడుకోవాలని మేం ఒక రూల్ కూడా పెట్టుకున్నాం. దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. జీవితంలో మంచి ఆనందాలు దక్కాలంటే ఇలాంటి కొన్ని రూల్స్ తప్పనిసరి.. అంటూ తమ ప్రేమ గురించి చెప్పింది సమంత.


స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?


మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!


మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?