నగ్న చిత్రాలు అడిగిన ట్రోలర్‌కు.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన చిన్మయి..!

నగ్న చిత్రాలు అడిగిన ట్రోలర్‌కు.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన చిన్మయి..!

సోషల్ మీడియా, ఇంటర్నెట్.. ఇప్పుడు ఇవీ మన జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి. ఈ రెండూ లేకుండా ఒక రోజు గడపమంటే మన ప్రాణం పోయినంత పని అవుతుంది. ఇంటర్నెట్ ద్వారా మనకు ఎంత ప్రయోజనం ఉందో కొన్నిసార్లు దాని వల్ల అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.


ముఖ్యంగా మహిళలు.. అందులోనూ సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోలింగ్‌కి (trolling) గురువుతుంటారు. దీని వల్ల వారు మానసికమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబుతుంటారు.


అలాంటి సెలబ్రిటీల్లో చిన్మయి శ్రీపాద కూడా ఒకరు. ఇటీవలే గాయని చిన్మయి శ్రీ పాదను (Chinmayi Sripada) వేధించడానికి ఓ ట్రోలర్ (troller) ప్రయత్నించాడు. దానికి ఆమె స్పందించిన తీరును ప్రస్తుతం నెటిజన్లు అందరూ అభినందిస్తున్నారు.
 

 

 


View this post on Instagram


A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) on
తమిళ గేయ రచయిత వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన‌ గాయని చిన్మయి శ్రీపాద. దక్షిణాదిన మీటూ ఉద్యమ పతాకను మోస్తున్న ఏకైక సెలబ్రిటీగా చిన్మయిని పేర్కొనవచ్చు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఆమె మీద లైంగికపరమైన కామెంట్లు చేసే వారిని తనదైన శైలిలో తూర్పారబడుతుంటుంది ఈ సింగర్. తాజాగా తనను ఇబ్బంది పెట్టాలని చూసిన ఓ ట్రోలర్ పని పట్టింది. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ఆకతాయికి చిన్మయి బాగా బుద్ధి చెప్పిందే’ అనుకొనేలా చేసింది.ఓ ట్రోలర్ చిన్మయిని న్యూడ్ పిక్స్ (నగ్న చిత్రాలు) పంపించమని అడిగాడు. అతడు అడిగినట్టుగానే చిన్మయి చేసింది. అంటే నిజంగా న్యూడ్ పిక్స్ పంపించిందనుకోకండి. అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. తాను ఉపయోగించే న్యూడ్ బ్రాండ్ లిప్ స్టిక్ ఫొటోలు తీసి ‘ఇవే నా ఫేవరెట్ న్యూడ్స్’ అంటూ మెసేజ్ చేసింది. మెసెంజర్లో జరిగిన ఈ సంభాషణ స్క్రీన్ షాట్‌ను తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారడం మాత్రమే కాదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ట్రోలర్ పని పట్టిందని అంతా చిన్మయిని బాగా మెచ్చుకొంటున్నారు.


చిన్మయి శ్రీపాద గాయనిగానే కాకుండా దక్షిణాదిలో వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, రేడియో జాకీగా కూడా సుపరిచితులు. అంతే కాకుండా ఆమె ఓ ఎంట్రప్రెన్యూర్ కూడా. బ్లూ ఎలిఫెంట్ అనే ఓ ట్రాన్స్‌లేషన్స్ సర్వీసెస్ అందించే కంపెనీకి తను సీఈఓగా కూడా పనిచేస్తున్నారు.


నటుడు రాహుల్ రవీంద్రన్‌ను వివాహమాడిన చిన్మయి ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే సార్క్ విమెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును కూడా పొందారు. గాయనిగా మూడు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే ఓ గాయనీమణిగా తన పేరు మీద తానే స్వయంగా ఒక యాప్ తయారుచేసి.. ఆ ఘనతను సాధించిన తొలి సింగర్‌గా వార్తల్లోకెక్కారు చిన్మయి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి:


నల్లగా, లావుగా ఉన్నావు.. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు: సోనమ్


ఇప్పుడు ఆ భయం.. మహిళలను వేధించేవారిలో కనిపిస్తోంది: కృతి సనన్


బాక్సింగ్‌లోనే కాదు.. పాట పాడడంలో కూడా మేరీ కోమ్ నెం 1..!