నల్లగా, లావుగా ఉన్నావు.. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు: సోనమ్

నల్లగా, లావుగా ఉన్నావు.. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు: సోనమ్

అమ్మాయిలను బాడీ షేమింగ్ చేసే విషయంలో.. కొందరు చాలా ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. కాస్త బొద్దుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. జుట్టు పొట్టిగా ఉన్నా.. రంగు తక్కువైనా.. అమ్మాయిలను వేలెత్తి చూపిస్తుంటారు. నలుగురూ ఉన్నప్పడూ ఫలానా అమ్మాయిని "చూడండి ఎలా ఉందో.. అలా ఉంటే ఆమెను ఇంకెవరు పెళ్లి చేసుకొంటారు" అని మాట్లాడుకొంటారు. ఇలా చేయడం వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు.


అయినా అలాగే చేస్తుంటారు. ఈ బాడీ షేమింగ్ ప్రతి అమ్మాయి ఎదుర్కొనే సమస్యే. ఎందుకంటే.. మన సమాజం "అమ్మాయి అంటే ఇలా ఉండాలి" అంటూ తనకు తానే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకొంది. దానికి తగ్గట్టుగా ఎవరు లేకపోయినా వారిని దెప్పి పొడుస్తుంటుంది. ఇదే పరిస్థితి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor) కి సైతం ఎదురైంది. మరి దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? అందరి నోళ్లు ఎలా మూయించింది? ఈ విషయాలన్నీ.. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పించ్ కార్యక్రమంలో వివరించింది.
 

 

 


View this post on Instagram


#mellowyellow


A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on
బాలీవుడ్‌లో స్టైల్ దివా ఎవరంటే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు సోనమ్ కపూర్. తన ఫిట్నెస్, స్టైల్, యాటిట్యూడ్‌తో అందరి మనసులూ దోచుకొన్న ఈ ముద్దుగుమ్మ టీనేజ్‌లో ఉన్నప్పుడు కాస్త బొద్దుగా ఉండేది. అందరు టీనేజ్ అమ్మాయిల మాదిరిగానే తనను తాను అద్దంలో చూసుకొంటూ మురిసిపోయేది. కానీ ఆమె తన వయసు వారితో పోలిస్తే పొడవుగా ఉండటం, కాస్త ఛామనఛాయ కలిగి ఉండటంతో ఆమెను గేలి చేసేవారట.


"ఇంత పొడవుగా, నల్లగా ఉన్నావు,, నిన్నెవరు పెళ్లి చేసుకొంటారని" అంటూ ఉండేవారట. ఇది తనను బాధించేదని పించ్ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది సోనమ్. అయితే అలా మనల్ని వెక్కిరించేవారు, విమర్శించేవారిని మన స్నేహితులుగా భావించాలని చెప్పుకొచ్చింది ఈ భామ. ఎందుకంటే వారి కారణంగానే తనను తాను మార్చుకొని ఈ స్థితికి చేరుకొన్నానంటోంది సోనమ్. అంతేకాదు.. తాను ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకొని ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
 

 

 


View this post on Instagram


Our next guest @sonamkapoor 😊on #PinchByArbaazKhan on 16th April @quplaytv #youtube #Zee5


A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) on
సోనమ్ టీనేజ్‌లోనే కాదు.. స్టార్ హీరోయిన్‌గా మారినప్పటికీ బాడీ షేమింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ఆమె చాలా నేర్పుగా వ్యవహరించి.. తనని ట్రోల్ చేసే వారి నోళ్లు మూయిస్తోంది. 2017లో ఆమె బికినీతో ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆమె వక్షోజాల పరిమాణం గురించి కొందరు నీచమైన కామెంట్లు చేశారు. అయినా వారికి ఆమె దీటుగాను సమాధానం చెప్పింది.


2018లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సమయంలోనూ ఆమెను బాడీ షేమింగ్ చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలను సోనమ్ నిత్యం ఎదుర్కొంటూనే ఉంటుంది. నేటితరం అమ్మాయిలకు సైతం.. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా.. మీకు ఎలా సౌకర్యవంతంగా ఉంటుందో అలాగే ఉండమని సలహా ఇస్తోంది.


ప్రస్తుతం సోనమ్ దుల్కర్ సల్మాన్ సరసన జోయా ఫ్యాక్టర్ అనే సినిమాలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Featured Image: Instagram


ఇవి కూడా చదవండి


ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?


ఇప్పుడు ఆ భయం.. మహిళలను వేధించేవారిలో కనిపిస్తోంది: కృతి సనన్


రానా అందించిన కానుకతో.. మురిసిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..!