బాలీవుడ్ హాట్ న్యూస్: ఆ యువరాణి పాత్రకి.. దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్

బాలీవుడ్ హాట్ న్యూస్: ఆ యువరాణి పాత్రకి.. దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్

2018 మొదట్లోనే పద్మావత్ (Padmaavat) చిత్రంలో రాణి పద్మావతిగా అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది దీపికా పదుకొనే. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్ళను రాబట్టి.. కమర్షియల్‌గా కూడా విజయవంతమైంది. ఇక అదే సంవత్సరం దీపిక పదుకొనే (Deepika Padukone) జీవితంలో మరొక అద్భుతమైన ఘట్టం జరిగింది. అదే ఆమె వివాహం. హీరో రణ్ వీర్ సింగ్‌ని 2018 చివరలో వివాహం చేసుకుని తన జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి దీపిక తెరతీసింది.


దీపిక-రణ్ వీర్‌ల వివాహం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా అత్యంత వైభవంగా జరిగిన వివాహంగా అది నిలిచిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే.. 2018 సంవత్సరం దీపికకి అటు కెరీర్ పరంగానే కాకుండా ఇటు వ్యక్తిగత జీవిత పరంగా కూడా ఒక మంచి సంతృప్తిని మిగిలించిందని అనుకోవచ్చు.


ఇటీవలే 2018లో పలు భిన్నమైన పాత్రలు పోషించిన నటీమణులతో ఒక మీడియా ఛానల్ వారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి దీపికతో పాటుగా రాణి ముఖర్జీ, అనుష్క శర్మ, టబు, ఆలియా భట్ & తాప్సి పన్ను మొదలైన వారందరూ హాజరయ్యారు. ఇక్కడ వీరందరూ తాము చేసిన పాత్రల గురించి.. అలాగే ఈ ఏడాది చిత్రపరిశ్రమని కుదిపేసిన #METOO ఉద్యమం గురించి తమ అభిప్రాయాలు తెలియచేశారు.


ఇక ఆ కార్యక్రమం ముగిసే సమయంలో సదరు యాంకర్ అందరిని ప్రశ్నిస్తూ "మీకు ఏదైనా నిజ జీవిత పాత్రలో నటించాలని ఉందా?" అని అడిగారు. దానికి సమాధానంగా యువరాణి డయానా (Princess Diana) పాత్రలో అయితే తాను తప్పకుండా నటిస్తానని తెలిపింది దీపిక.
 

 

 


View this post on Instagram


👗: @justinplz 📸: Alan Gelati 💇🏻‍♀️: Earl Simms 💄: Gina Kane @tingslondon


A post shared by Deepika Padukone (@deepikapadukone) on
 


డయానా బ్రతికున్న సమయంలో ఒక యువరాణిగా ఎలా హుందాగా ప్రవర్తించేదో.. అలాగే ఆమె సాధారణ ప్రజలతో మమేకమయ్యే తీరు తనని ఎంతగా ఆకట్టుకొనేదో ఈ సందర్భంగా తెలిపింది దీపిక. డయానా చనిపోయినప్పుడు తాను కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్లు ఆమె తెలిపింది. దీపిక సమాధానానికి ఆ సమావేశంలో పాల్గొన్న మిగతా నటీమణులు కూడా మద్దతు తెలిపారు.  డయానా పాత్రకి దీపిక కచ్చితంగా న్యాయం చేయగలదని వారు అభిప్రాయపడ్డారు.


ఇది అసలే బయోపిక్‌లను తెరకెక్కించే కాలం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో గొప్ప వ్యక్తుల జీవితాల పై సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీపిక ఇచ్చిన ఈ సమాధానం పై ఎవరైనా నిర్మాతలు దృష్టి పెడితే పరిస్థితి వేరేగా ఉంటుంది. భవిష్యత్తులో నిజంగానే ఎవరైనా ఆమెకి ఈ పాత్రని ఆఫర్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ ఆమెకి ఛాన్స్ వస్తే.. దీపికను నవతరం యువరాణి పాత్రలో మనం చూడవచ్చు.

దీపిక పదుకొనే త్వరలో చేయబోయే చిత్రం 'చపక్' (Chhapaak) కూడా యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ (Laxmi Agarwal) జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన కథే అవ్వడం విశేషం. ఈ చిత్రానికి "రాజీ" చిత్రానికి దర్శకత్వం వహించిన మేఘన గుల్జార్ డైరెక్షన్ చేయనున్నారు.


ఇటీవలే జాన్వి కపూర్ కూడా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే నటి కంగనా రనౌత్ ఇప్పటికే నటించిన "మణికర్ణిక" విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఇవి కూడా చదవండి


మరో సవాల్ విసురుతున్న కంగనా రనౌత్ మణికర్ణిక


కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!


కీర్తి సురేష్ "మహానటి" చిత్రం.. నిత్యా మీనన్ "ఐరన్ లేడీ"కి ఆదర్శమా?


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చుఅద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.