కూతుళ్ల పెళ్లికి డబ్బు కోసం దుబాయ్ వెళ్లాడు.. నేడు లాటరీలో కోట్లు గెలిచాడు..!

కూతుళ్ల పెళ్లికి డబ్బు కోసం దుబాయ్ వెళ్లాడు.. నేడు లాటరీలో కోట్లు గెలిచాడు..!

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన చాలామంది రైతులు, రైతు కూలీలు దుబాయ్ (Dubai) వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. నీటి సౌలభ్యం లేక పొలాలు పండించే స్థితి లేక నిజామాబాద్ నుంచి అలాగే దుబాయ్‌కి వలస వెళ్లాడు ఆ రైతు. ముందు కూలీగా.. ఆ తర్వాత డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవలే వీసా గడువు ముగియడంతో తిరిగి భారత్ వచ్చాడు. మళ్లీ కొన్నాళ్లలో తిరిగి వీసా తీసుకొని దుబాయ్ వెళ్లాలని.. కష్టపడి సంపాదించి తన ఇద్దరు కూతుళ్లను బాగా చదివించి.. పెళ్లిళ్లు చేయాలని ఆశించాడు. అయితే ఆ అవసరం లేకుండానే అతడు కొన్న ఓ లాటరీ (lottery) టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది.

Facebook
ఈ యువకుడు అమ్మ కు రెండో పెళ్లి చేశాడు.. ఎందుకో తెలుసా..?

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌లోని జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్ ఐదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కొన్నాళ్ల పాటు కూలీగా పనిచేసిన విలాస్.. ఆ తర్వాత డ్రైవర్‌గా మారాడు. డ్రైవర్‌గా తన వీసా గడువు పూర్తి కావస్తుండడంతో.. మరో ఉద్యోగం కోసం చాలా వెతికాడట. అయినా దొరకకపోవడంతో.. చేసేదేం లేక 45 రోజుల క్రితం ఇండియాకి తిరిగొచ్చేశాడు. విలాస్‌కి దుబాయ్ వెళ్లినప్పటి నుంచి లాటరీ టికెట్లు కొనడం అలవాటట. గతంలో ఓ కేరళ వ్యక్తికి ఇలాగే లాటరీ తగిలి.. కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ వ్యక్తిని చూసి స్పూర్తిని పొంది.. మరింత రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనేవాడు విలాస్. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు విలాస్‌కి. తన భార్య పద్మని బతిమాలి ఆమె వద్ద ఉన్న రూ.20 వేలు కూడా తీసుకొని లాటరీ కొన్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన ఫ్రెండ్‌కి పంపి తన పేరు మీద మూడు లాటరీ టికెట్లు కొనమని చెప్పాడట.

ఆ స్నేహితుడు విలాస్ పేరుపై మూడు టికెట్లు కొనగా.. అందులో ఒక టికెట్‌కి బంపర్ లాటరీ తగిలిందట. తాను కొన్న టికెట్ నంబర్ 222805కి పదిహేను మిలియన్ దీర్హమ్స్ అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 28, 45, 17, 877 వచ్చాయట.

Shutterstock
అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న

దుబాయ్ బిగ్ టికెట్ మంత్లీ డ్రా అక్కడ చాలా పాపులర్. ఇందులో ఎంతో మంది భారతీయులు కూడా గెలుపొందడం విశేషం. ఈ లాటరీలో విలాస్ కంటే ముందు ఎంతో మంది భారతీయులు గెలుపొందారు. తనకు లాటరీ తగిలిన విషయాన్ని వివరిస్తూ విలాస్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

"శనివారం రాత్రి భోజనం చేస్తుండగా.. లాటరీ ఆర్గనైజర్లు నాకు ఫోన్ చేసి నేను కొన్న టికెట్‌కి మొదటి బహుమతి దక్కిందని చెప్పారు. అసలు నేను నమ్మలేకపోయాను. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాను. పక్కనే ఉన్న మా అమ్మ వాళ్లింటికి పరుగెత్తి.. వారితో నా ఆనందాన్ని పంచుకున్నా. వాళ్లు కూడా నమ్మలేకపోయినా ఎంతో ఆనందంగా ఫీలయ్యారు.

దుబాయ్‌లో ఇన్నాళ్లూ ఎన్నో కష్టాలు పడుతూ ఉద్యోగం చేశాను. మరో ఉద్యోగం దొరికితే తిరిగి వెళ్లాలనుకున్నా. కానీ ఇప్పుడు ఇక పనిచేయడానికి అక్కడికి వెళ్లను. నా డబ్బు తెచ్చుకోవడానికి మాత్రం వెళ్తా. నా కూతుళ్లను బాగా చదివించడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. వాళ్లు ఏం చదువుకుంటారో అది వాళ్ల ఇష్టం. దానికి తగిన డబ్బు నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా. ఇది నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇప్పటివరకూ మాకు ఇల్లు లేదు. ఈ డబ్బు రాగానే ముందు ఒక ఇల్లు కొనుక్కుంటాను.

మిగిలిన డబ్బు ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదు. ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం కాస్త రిస్కీగానే అనిపించినా.. ఆ డబ్బు మాకు తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఆ పని చేశాను. ఇప్పుడు దాని ప్రతిఫలం రావడం ఎంతో ఆనందాన్ని అందిస్తోంది.." అని చెప్పాడు విలాస్. అతడి ఇద్దరి కూతుళ్లలో పెద్దమ్మాయి హిమాని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. చిన్నమ్మాయి మనస్విని ఎనిమిదో తరగతి చదువుతుంది"

Shutterstock
ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమెతో.. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ సంపాదించేసింది..!

కేవలం విలాస్ మాత్రమే కాదు.. ఈ లాటరీ గెలుపొందిన పదిమంది విజేతల్లో మరో ఐదుగురు భారతీయులు ఉండడం విశేషం. విలాస్‌తో పాటు శరత్ తలయిల్ ఉదయక్రిష్ణన్ (90,000 దీర్హమ్స్), సౌమ్య (70,000 దీర్హమ్స్), అశోకా శెట్టి (50,000 దీర్హమ్స్), డానిస్ లాస్రడో (20,000 దీర్హమ్స్), బింటో వట్టక్కాములాయిల్ థామస్ (10,000 దీర్హమ్స్) గెలుపొందారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.