సమంత శరీరంపై ఉన్న ఈ సీక్రెట్ టాటూ.. ఏం చెబుతుందో తెలుసా?

సమంత శరీరంపై ఉన్న ఈ సీక్రెట్ టాటూ.. ఏం చెబుతుందో తెలుసా?

ఈ వైట్ అండ్ వైట్ డ్రస్‌లో దేవతలా మెరిసిపోతోన్న సమంతను(Samantha) పరిశీలించారా? ఆమె ఛాతీ దగ్గర కనీకనిపించనట్టుగా ఉన్న టాటూ(Tattoo) ఒకటి ఉంది గమనించారా? ఇప్పటి వరకు ఆ టాటూని సమంత బయటపెట్టలేదు. అదేంటో ఫొటోలో స్పష్టంగా కనిపించడం లేదు. కానీ.. ఆ టాటూకి సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ విషయాన్ని సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘లివింగ్ మై బెస్ట్ లైఫ్’ అని చెబుతూ ఇన్ని రోజులూ తాను దాచుకున్న ఒకే ఒక టాటూ ఇది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ‘నా భర్తే నా ప్రపంచం’ అని కూడా రాసుకొచ్చింది. అంటే ఇది తన భర్త నాగచైతన్యకు సంబంధించినదే అని అంతా భావిస్తున్నారు.

సమంతకి టాటూలు వేయించుకోవడం కొత్తేమీ కాదు. ఇంతకుముందే ఆమె శరీరంపై కొన్ని టాటూలున్నాయి. మెడపై ‘ymc’ అని టాటూ వేయించుకుంది. నాగచైతన్యతో ఆమె చేసిన తొలిసినిమా ఏమాయ చేశావేకి షార్ట్ ఫామ్ అది. అలాగే ‘యు ఆర్ మైన్ చైయ్’ అని కూడా  ఆ టాటూకి అర్ధమట. ఆమె నడుముపై సైతం గులాబీ టాటూ ఒకటుంటుంది. అల్లుడు శీను సినిమాలో ఈ టాటూ మనకు కనిపిస్తుంది. అలాగే ఆమె చేతిపై కూడా మరో టాటూ ఉంటుంది.

మోర్స్ కోడ్ లో ఉన్న ఈ టాటూ నాగచైతన్య, సమంత పెళ్లి తేదీకి సంబంధించినది. ఇన్ని రోజులూ సమంత తన కుడి ఛాతీ మీద ఉన్న టాటూ గురించి బయటపెట్టలేదు. ఇప్పుడు బయటపెట్టడం వెనక కారణం ఏంటో సరిగ్గా తెలియడం లేదు. బహుశా తనకు, నాగ చైతన్యకు మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో చెప్పడానికే ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

టాటూలు వేయించుకోవడం మన హీరోయిన్లకు కొత్తేమీ కాదు. ప్రతిఒక్కరి శరీరంపై ఎక్కడో ఓ చోట టాటూ లేకుండా పోదు. కొన్ని టాటూలను స్టైల్‌గా కనిపించడానికి వేయించుకొంటే.. మరికొన్నింటిని తమవారి పట్ల తమకున్న ప్రేమను తెలియజేయడానికి వేయించుకుంటారు. అసలు టాటూ లేని సెలబ్రిటీని చూడటం అరుదనే చెప్పుకోవాలి. పైగా ఇప్పుడు టాటూలు వేయించుకోవడం లేటెస్ట్ ట్రెండ్ కూడా.

ఇది కూడా చదవండి: స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!

సమంత ఛాతీపై ఉన్న టాటూలో ఏముందనే సంగతి ఎవరికీ తెలియకపోయినా.. ఈ ఫొటోలో మాత్రం ఆమె చాలా అందంగా మెరిసిపోతోంది. వైట్ డ్రస్‌లో క్యూట్ గా కనిపిస్తోన్న సమంత చెవులకు వైట్ స్టోన్స్ పొదిగిన గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. కళ్లకు బ్లూ ఐలైనర్, పెదవులకు న్యూడ్ లిప్‌స్టిక్ అప్లై చేసి నిజంగానే దేవతలా మెరిసిపోతోంది. ఆమె హెయిర్ స్టైల్ సైతం ఆమె అందాన్ని మరింత పెంచుతోంది.

ఇది కూడా చదవండి: స్టైలిష్ ఇయ‌ర్ రింగ్స్‌తో స్మార్ట్ లుక్ కావాలంటే.. సమంతను ఫాలో అవ్వాల్సిందే..!

View this post on Instagram

✌️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

సమంత(Samantha) లీడ్ రోల్‌లో గత వారం విడుదలైన ఓ బేబీ(Oh Baby) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకుంది. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి ఇది రీమేక్. ఇప్పటికే సుమారుగా 8 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. సమంత నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. రంగస్థలం, మజిలీ, యూటర్న్ వంటి సినిమాలతో విభిన్న తరహా పాత్రలు పోషించిన సమంతను నటిగా ఓ బేబీ సినిమా మరో మెట్టు  పైకెక్కించింది. తాను నటనకు వీడ్కోలు పలికే లోపు ఇలాంటి పాత్రలే మరిన్ని చేస్తానని చెబుతోంది సమంత.

ఇది కూడా చదవండి:  అమ్మ మనసుని తెరపై.. హృద్యంగా చూపించిన ‘ఓ బేబీ’

 

Featured Image: Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది