తల్లి కాబోతున్న "దంగల్ గర్ల్" గీతా ఫోగాట్ .. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫొటో..!

తల్లి కాబోతున్న "దంగల్ గర్ల్" గీతా ఫోగాట్ .. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫొటో..!

గీతా ఫోగాట్ (geeta phogat).. దంగల్ గర్ల్‌గా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రెజ్లర్ (Wrestler) ఆమె. అమ్మాయిలు, అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తూ రెజ్లర్‌గా పేరు సంపాదించింది గీత. ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్ గీతని, ఆమె సొదరి బబితను రెజ్లర్లుగా సిద్ధం చేసిన కథను అమీర్ ఖాన్ నటించిన దంగల్ (Dangal) సినిమాలో మనం చూశాం.

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొని స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా పేరుగాంచింది గీతా ఫోగాట్. కామన్‌వెల్త్ లోనూ స్వర్ణం గెలిచిందామె. ప్రొఫెషనల్ కెరీర్‌లో అద్భుతంగా సాగుతూనే తన తోటి క్రీడాకారుడు పవన్ కుమార్ సరోహాని (Pawan kumar saroha) ప్రేమించి పెళ్లాడింది గీతా ఫోగాట్. వీరిద్దరూ మొదటిసారి 2012లోనే కలిసినా.. 2016లో వీరిరువురూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ గాయాల పాలై ఆస్పత్రిలో చేరిన తర్వాత.. తిరిగి రికవర్ అయ్యే క్రమంలో  ప్రేమించుకున్నారు.

వీరిద్దరిలో పవన్ కుమార్ గీత కంటే ఐదేళ్లు చిన్నవాడు. అయితేనేం ప్రేమకు వయసు అడ్డు కాదని వీరి లవ్  స్టోరీ నిరూపించింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ కపుల్ ఫొటొలను అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. 

హర్యానాకి చెందిన రెజ్లర్, కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతక విజేత అయిన పవన్ కుమార్ సరోహాను 2016 నవంబర్ 20న పెళ్లాడింది గీత. పెళ్లయిన మూడేళ్లకు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తాను తల్లి కాబోతున్న శుభవార్తను వెల్లడించింది గీత. కేవలం ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్త మాత్రమే కాదు.. తల్లి కాబోతున్న ఆమె అమ్మదనం గురించి స్పూర్తినిచ్చే వాక్యాలను కూడా పంచుకుంది.

కొండాకోనల్లో ఓ పెద్ద కొండ అంచున నిలబడి దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ "అమ్మగా ఓ స్త్రీ ఆనందం మాటల్లో చెప్పలేనిది. తన లోపల ఓ కొత్త జీవం ప్రాణం పోసుకుంటుదన్న ఫీలింగ్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మొదటిసారి తన గుండె చప్పుడు విన్నప్పుడు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.

కడుపులోంచి ఆ కిక్ ఈ ప్రపంచంలో మనం ఒంటరి కాదు అనిపించేలా చేస్తుంది. ఇదంతా ఓ ప్రాణం అంటే ఏంటో.. జీవితం అంటే ఏంటో అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఈ ఫీలింగ్ తల్లయితేనే అనుభవంలోకి వస్తుంది" అంటూ కవితాత్మకంగా తనలోని భావాలను చెప్పుకొచ్చింది గీతా ఫోగాట్.                 

Instagram

ఈ అందమైన క్యాప్షన్తో పాటు ప్రెగ్నెన్సీ, బేబీ బంప్, మదర్ హుడ్ వంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించింది గీత. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మిలియన్ల కొద్దీ ఫ్యాన్లు ఈ ఫొటోను లైక్ చేసి, కామెంట్లు పెడుతున్నారు. గీతా ఫోగాట్, పవన్ కుమార్ సరోహాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమెతో పాటు ఖత్రోంకీ ఖిలాడీలో పాల్గొన్న హీనా ఖాన్, నియా శర్మ, కరణ్ వీర్ బొహ్రా.. నటి ఈషా గుప్తాలతో పాటు ఎందరో సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Instagram

అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ అయిన గీతా ఫోగాట్ తండ్రి శిక్షణలో రాటుదేలి.. ఎన్నో అంతర్జాతీయ పతకాలు సంపాదించింది. ఆమెతో పాటు ఆమె సోదరి బబిత కుమారి, కజిన్ వినేష్ ఫోగాట్, కామెన్వెల్త్‌లో స్వర్ణ పతకాలను సాధించారు. మరో ఇద్దరు చెల్లెళ్లు రితూ ఫోగాట్, సంగీతా ఫోగాట్, మరో కజిన్ ప్రియాంకా ఫొగాట్‌లు కూడా రెజ్లింగ్ కెరీర్‌ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు. గీత రెజ్లర్‌గా కెరీర్ కొనసాగించడంతో పాటు.. ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 లోనూ పాల్గొంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.