ADVERTISEMENT
home / వినోదం
మహేష్ బాబుతో ‘స్పై’ థ్రిల్లర్ చేయాలని ఉంది: హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్

మహేష్ బాబుతో ‘స్పై’ థ్రిల్లర్ చేయాలని ఉంది: హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్

అమెరికన్ గిగోలో, కమాండో, ప్రిడేటర్, ఎక్స్ మెన్ ది లాస్ట్ స్టాండ్ లాంటి చిత్రాలతో హాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు బిల్ డ్యూక్ (Bill Duke). చిత్రమేంటంటే.. ఆయన మన ఇండియన్ సినిమాలు కూడా చూస్తారట.

ఇటీవలే ఆయన తనకు టాలీవుడ్ నటుడు మహేష్ బాబుతో (Mahesh Babu) సినిమా చేయాలని ఉందని ట్విటర్ ద్వారా ప్రకటించారు. మహేష్‌తో ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ చేయాలని ఉందని తెలిపారు.

“మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లికి చెప్పేదేమిటంటే.. మీరు లాస్ ఏంజెలీస్‌కు వస్తే.. ఒక సారి వచ్చి కలవండి. లంచ్‌కు వెళ్దాం.  మీతో ఓ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ చేయాలని ఉంది” అని ట్వీట్ చేశారు. ఆయన ఈ ట్వీట్ ఎందుకు చేశారో తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త ప్రిన్స్ అభిమానుల్లో పెద్ద చర్చకే తెరలేపింది.

చాలామంది మహేష్ బాబు అభిమానులు ఇప్పటికే ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ ప్రముఖులను ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ డైరెక్టర్ జోయ్ రూసో.. మన దక్షిణాది దర్శకుడు శంకర్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

 

తనకు శంకర్ తీసిన రోబో చిత్రం నచ్చిందని.. తనకు బాగా ప్రేరణను అందించిందని ఆయన ఓ ట్వీట్‌లో తెలిపారు. తాజాగా వంశీ పైడిపల్లిని, మహేష్ బాబును ట్యాగ్ చేసిన బిల్ డ్యూక్ మరో అడుగు ముందుకు వేసి.. తన తర్వాతి ట్వీట్‌లో దర్శకుడు మురుగుదాస్‌ని కూడా ట్యాగ్ చేశారు.

ఆయనతో కలిసి మహేష్ బాబు లాస్ ఏంజెలీస్ వచ్చినా.. తనకు సంతోషమే అన్న రీతిలో ఆ ట్వీట్ ఉంది. అలాగే
తన మరో ట్వీట్‌లో బిల్ డ్యూక్.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ని ట్యాగ్ చేశారు. ఆమెతో మహిళా విద్య అనే అంశంపై చర్చించాలని ఉందని తెలిపారు.

 

ADVERTISEMENT

ఈ హాలీవుడ్ నటుడు ఈ ట్వీట్స్ ఎందుకు చేశారన్న విషయాలు తెలియనప్పటికీ.. అవి ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనే రేపుతున్నాయి. ఇండియన్ సినిమాను హాలీవుడ్ నటులు బాగానే ఫాలో అవుతున్నందుకు తమకు సంతోషంగానే ఉందని.. పలువురు చలన చిత్ర విశ్లేషకులు ఈ సందర్భంగా తెలిపారు.

 

ఎస్.ఎస్.రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం అంతర్జాతీయంగా విడుదలై.. విజయ ఢంకా మోగించాక.. ఇలాంటి ట్వీట్స్‌ను హాలీవుడ్ నటులు చాలామంది చేశారు. బ్లాంక్ పాంథర్ నటుడు విన్ స్టన్ డ్యూక్ తనకు బాహుబలి చిత్రం ఎంతగానో నచ్చిందని.. ట్విటర్ ముఖంగా అప్పట్లో వెల్లడించడంతో.. అది పెద్ద సంచలనాన్నే నమోదు చేసింది. ఈ మధ్యకాలంలో మన ఇండియన్ సినిమాలకు హాలీవుడ్ సమీక్షకులు కూడా రివ్యూలు రాయడంతో.. మన హీరోల గురించి ఇతర దేశాల నటులకు కూడా తెలుస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఇటీవలే బిల్ డ్యూక్ చేసిన ట్వీట్.. ఇప్పుడు మహేష్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. 

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన… బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా..?

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

28 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT