home / వినోదం
ఆమె తొలి చిత్రమే “స్వలింగ సంపర్కం”పై :  హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం

ఆమె తొలి చిత్రమే “స్వలింగ సంపర్కం”పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం

(Hyderabad based Woman Shreedevi Chowdary to act in Homosexuality based film “Friends in Law” )

2018 జనవరిలో మన దేశ అత్యున్నత న్యాయస్థానం “స్వలింగ సంపర్కం” అనేదాన్ని ఒక నేరంగా భావించే “సెక్షన్ 377″పై వ్యతిరేకతను కనబరుస్తూ.. ఇకపై ఆ సెక్షన్ చెల్లదంటూ తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును బట్టి.. మన దేశంలో ఆ రోజు నుండి స్వలింగ సంపర్కానికి చట్టబద్దత లభించింది.   స్వలింగ సంపర్కమనేది ఇద్దరు వ్యక్తులకు సమ్మతమైతే.. అది నేరం కానేకాదని కోర్టు తెలిపింది. 

హైదరాబాద్ మణిహారం.. చౌమహల్లా ప్యాలెస్ గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

ఈ క్రమంలో స్వలింగ సంపర్కం అనే  అంశాన్ని మూలకథగా తీసుకుని, ఒక 23 ఏళ్ళ కుర్రాడి కథను తెరకెక్కించే ప్రయత్నం జరిగింది. ఆ కుర్రాడు తన తల్లితో మాట్లాడుతూ “తాను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని.. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని” చెప్పడం ఈ కథలో కొసమెరుపు. పైగా తను ఇష్టపడుతున్న అబ్బాయిని గురించి తెలుసుకోవడానికి.. స్వయానా కొడుకే తన తల్లిని హాంకాంగ్‌కి ఒక 10 రోజులు పంపిస్తాడట. మరి ఆ కుర్రాడి బాయ్ ఫ్రెండ్‌ని కలిసిన ఆ తల్లి వారిద్దరి ప్రేమను అంగీకరిస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే “ఫ్రెండ్స్ ఇన్ లా” సినిమా చూడాల్సిందే.

గత సంవత్సరమే రూపొందిన ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాదే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శనకి ఎంపికవ్వడం విశేషం. ఆ దేశంలో ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు అందుకుందీ చిత్రం.

ఇక ఈ ‘ఫ్రెండ్స్ ఇన్ లా’  చిత్రంలో 23 ఏళ్ళ కుర్రాడికి తల్లి పాత్రలో హైదరాబాద్  నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్యాషన్ డిజైనర్, సెలబ్రిటి అయిన శ్రీదేవి చౌదరి  నటించడం విశేషం.

47 ఏళ్ళ వయసులో తెరంగేట్రం చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఒకవైపు చెబుతూనే ” ఈ సినిమా కథ ఇప్పటి సమాజానికి ప్రతిబింబంలా ఉంటుందని.. అందుకే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని” ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తాను నిజ జీవితంలో కూడా 23 ఏళ్ళ కుర్రాడికి తల్లి కావడంతో.. ఈ పాత్రలో నటించడం తనకేమంత కష్టం కాలేదని కూడా ఆమె తెలిపింది.

హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే…

తనకు చిన్నతనం నుండి సినిమాల్లో నటించాలని ఉన్నప్పటికి, సినీ పరిశ్రమ పట్ల తన తల్లిదండ్రులకి మంచి అభిప్రాయం లేని కారణంగా.. ఆ రంగంలోకి అడుగు పెట్టలేక పోయానని శ్రీదేవి చౌదరి తెలిపింది.

అయితే పెళ్లైయి.. ఇన్నేళ్ళ పాటు వేరే వృత్తిలో ఉన్న తరువాత తనకి దక్కిన ఈ అవకాశాన్ని వదులుకోకుండా.. నటనపై తనకు గల అనురక్తిని తీర్చుకున్నానని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం తనకి హిందీ పరిశ్రమ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయని ఆమె తెలిపింది. ఇక ఈ చిత్రానికి శ్రీదేవి కూడా ఒక నిర్మాత కావడం విశేషం.

‘ఫ్రెండ్స్ ఇన్ లా’ చిత్ర వివరాల్లోకి వెళితే, ఇదొక హాలీవుడ్ క్రాసోవర్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇందులో 85 శాతం ఇంగ్లిష్ ఉంటే.. 15 శాతం తెలుగు ఉంటుంది. అందుకనే ఈ రెండు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా (amit khanna) దర్శకత్వం వహించడంతో పాటు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి గత ఏడాదే రావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా.. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో విడుదల చేయడం గమనార్హం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కాబోతుంది.

47 ఏళ్ళ వయసులో కూడా ఒక చిత్రంలో నటించాలనే తన కోరికని  శ్రీదేవి తీర్చుకోవడం విశేషం. ఏ కలనైనా నెరవేర్చుకోవాలంటే.. అందుకు వయసు అడ్డంకి కాదని నిరూపించి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు శ్రీదేవి.

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

 

08 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this