బ్యూటిఫుల్ కపుల్ ఇలియానా, ఆండ్రూల దారులు వేరయ్యాయా..?

బ్యూటిఫుల్ కపుల్ ఇలియానా, ఆండ్రూల దారులు వేరయ్యాయా..?

ఇలియానా (Ileana).. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై.. అద్భుతమైన చిత్రాలతో ఆకట్టుకున్న గోవా బ్యూటీ. తెలుగు తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి.. అక్కడా మంచి పేరు సాధించింది. గత రెండు సంవత్సరాల నుండి ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో (andrew kneebone) ఆమె  ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ సీక్రెట్‌గా వివాహం కూడా జరిగిపోయిందని చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ వీటి గురించి ఎప్పుడూ ఏమాత్రం స్పందించలేదు ఆమె. అయితే అతడు తన జీవితంలో ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పింది ఇల్లూ బేబీ. డిప్రెషన్ బారిన పడిన తను.. అతడు పరిచయం అయ్యాకే దాన్నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పింది.

Instagram

అయితే ఇప్పుడు ఈ అందాల జంట విడిపోయిందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరు అకౌంట్లను మరొకరు అన్ ఫాలో అవ్వడం, ఆండ్రూతో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ ఇలియానా డిలీట్ చేయడంతో.. వీరిద్దరు విడిపోయి ఉంటారనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో ప్రారంభమైంది. వీరిద్దరూ ఫిజి హాలిడేలో దిగిన రొమాంటిక్ ఫొటోలతో పాటు ఆండ్రూ తీసిన.. తన ఫొటోలు కొన్నింటిని కూడా తన అకౌంట్ నుంచి తొలగించింది ఇలియానా.

మరోవైపు ఆండ్రూ కూడా కూడా ఇలియానాని అందమైన యాంగిల్స్‌లో ఫొటోలు తీసి.. తన అందాన్ని వర్ణిస్తూ పెట్టిన పోస్టులను డిలీట్ చేశాడు. ఆఖరికి జులై 31న ఆండ్రూ పుట్టిన రోజు సందర్బంగా "ఆండ్రూ కోసం నా అద్భుతమైన భాగస్వామికి హ్యాపీ బర్త్ డే. ఈరోజున నేను నీతో పాటు ఉండాలనుకున్నా. కానీ ఉండలేకపోయినందుకు సారీ.." అంటూ పోస్ట్ చేసిన విషెస్‌ని కూడా ఇలియానా డిలీట్ చేసింది. 

ఈ అంశం మీద మాట్లాడేందుకు బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్ సైట్ ఇలియానా సన్నిహితులను సంప్రదించగా.. వారిద్దరి మధ్య పెద్ద గొడవైందని.. అందుకే ఇద్దరూ విడిపోయారని వెల్లడించారట. అంతేకాదు.. గొడవను మర్చిపోయి తిరిగి తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు.. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ ప్రయత్నం చేయడానికి కూడా సిద్ధంగా లేరట. అయితే ఈ విషయంపై ఇలియానా ఇంకా స్పందించలేదు.

జులై 31న ఇలియానా ఆండ్రూకి విషెస్ చెప్పడం చూస్తుంటే.. ఈ గొడవంతా ఈ మధ్యే జరిగిందని అంతా భావిస్తున్నారు. తాజాగా ఇలియానా తన స్టేటస్‌లో భాగంగా "అన్ని సమయాల్లో మీరు ఒక ప్లాన్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జరిగే దాన్ని జరగనివ్వాలి" అంటూ పోస్ట్ చేసింది.

అంతేకాదు.. "మీ నెత్తిన ఎంత బరువు ఉందో దాన్ని దింపే వరకూ తెలీదు" అంటూ మరో స్టేటస్.. ఇతరుల నుంచి మీరు పొందే శక్తి మిమ్మల్ని బాధపెడుతుంటే.. దాన్ని మీకు దూరం చేయడానికి కూడా వెనుకాడద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని మీరులా ఉండనివ్వదు అంటూ మరో స్టేటస్‌ని కూడా పెట్టి తన పరిస్థితిని వెల్లడించింది ఇలియాానా. 

ఇలియానా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడదు. అయితే ఆండ్రూతో సన్నిహితంగా దిగిన చిత్రాలను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాము సహజీవనం చేస్తున్నామని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో అతడిని భర్తగా కూడా వెల్లడించింది. అందుకే వారిద్దరికీ వివాహం జరిగిందన్న వార్తలు చాలా సార్లు వచ్చాయి.

దీని గురించి ఆమె స్పందిస్తూ "నా వ్యక్తిగత విషయాల గురించి స్పందించడం నాకు ఇష్టం ఉండదు. నేను వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నాను. మేమిద్దరం జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని అలా రహస్యంగానే ఉంచాలనుకుంటున్నా" అంటూ వెల్లడించింది.

మొన్న శ్రుతి హాసన్ , మైఖేల్ కొర్సలే.. నిన్న విశాల్, అనీషా.. ప్రస్తుతం ఇలియానా, ఆండ్రూ నీబోన్.. ఇలా వరుసగా తారల బ్రేకప్ వార్తలు అభిమానుల మనసులను గాయపరుస్తున్నాయనే చెప్పుకోవచ్చు. వీరిద్దరూ త్వరలోనే తమ మధ్య ఉన్న విభేధాలను పక్కన పెట్టి కలిసిపోవాలని కోరుకుందాం. ప్రస్తుతం ఇలియానా ‘పాగల్‌ పంతి’ అనే హిందీ సినిమాతో బిజీగా ఉంది. అనీజ్ బాజ్మీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.