'సరిలేరు నీకెవ్వరు' హీరోయిన్ రష్మిక మంధాన.. ఇంటిపై ఐటి దాడులు ..!

'సరిలేరు నీకెవ్వరు' హీరోయిన్ రష్మిక మంధాన.. ఇంటిపై ఐటి దాడులు ..!

Income Tax officials raid Rashmika Mandanna's residence in Virajpet

గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రష్మిక మంధాన ఇంటిపై ఐటి శాఖ దాడులు నిర్వహించింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని ఆమె సొంత ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతం కొడగు ప్రాంతంలోని విరాజ్ పేటలో నివసిస్తోంది. తెలుగు చిత్రాలలో నటించకమునుపు.. రష్మిక కన్నడ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె కన్నడంలో నటించిన 'కిరాక్ పార్టీ' చిత్రం అప్పట్లో పెద్ద సూపర్ హిట్. 

'రష్మిక' అవకాశాలు వదులుకోవడానికి కారణం.. రెమ్యునరేషనా...?

తెలుగులో 'గీతగోవిందం'లో నటించాక.. రష్మిక తన పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు.. ఆమె పాత్రకు మంచి పేరు రావడంతో రష్మికకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం రష్మిక, నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న 'భీష్మ' చిత్రంలో నటిస్తోంది. ఫిబ్రవరి 21వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కార్తీతో కలిసి ఓ తమిళ సినిమాలో కూడా నటిస్తోంది రష్మిక. 'ఛలో' చిత్రం రష్మిక తెలుగులో నటించిన తొలిచిత్రం కాగా.. ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం మాత్రం 'గీత గోవిందం' కావడం విశేషం.

ఈ ముద్దుకు... కథకు సంబంధముంది: 'డియర్ కామ్రేడ్' కథానాయిక రష్మిక

కన్నడంలో 'కిరాక్ పార్టీ' చిత్రం హిట్ అవ్వగానే.. నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది రష్మిక. కానీ తర్వాత.. వారిద్దరూ విడిపోయి.. కెరీర్‌లో బిజీగా మారారు. ఆ తర్వాత అడపాదడపా కన్నడ చిత్రాలలో నటించిన రష్మిక.. ఎక్కువ శాతం టాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. 'గీత' గోవిందం సినిమా సక్సెస్ అయ్యాక.. తన పారితోషికాన్ని రూ.70 లక్షలకు పెంచిన రష్మిక.. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి మాత్రం.. రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. తను నటించిన తొలి చిత్రానికి ఉత్తమ నటిగా సైమా అవార్డు గెలుచుకున్న రష్మిక.. 'గీతగోవిందం' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా గెలుచుకుంది. 

View this post on Instagram

🌼

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

కర్ణాటకలోని విరాజ్ పేటలో పుట్టి పెరిగిన రష్మిక.. కూర్గ్ పబ్లిక్ స్కూలులో చదువుకుంది. ఆ తర్వాత రామయ్య ఆర్ట్స్ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం కోర్సులలో డిగ్రీ చేసింది. కాలేజీలో చదువుతున్న రోజులలోనే మోడలింగ్‌తో పాటు.. పలు వాణిజ్య ప్రకటనలలో నటించే అవకాశాలను దక్కించుకున్న రష్మిక.. ఆ తర్వాత కొద్ది రోజులకే సినీ పరిశ్రమలో కాలుమోపింది. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజులలో పునీత్ రాజకుమార్ సరసన 'అంజనీ పుత్ర' చిత్రంలో నటించింది రష్మిక. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అక్కడ వరుసగా ఆఫర్లు వచ్చాయి. 

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

ప్రస్తుతం 'పొగరు' అనే ఓ కన్నడ చిత్రంతో పాటు.. తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి మరో సినిమాకి కూడా సైన్ చేసింది రష్మిక. అలాగే తమిళంలో సుల్తాన్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో నటించిన 'సరిలేరు' నీకెవ్వరు సినిమా సూపర్ సక్సెస్ కావడంతో.. ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ క్రమంలో ఆమె ఇంటి పై ఐటి దాడులు జరగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సెలబ్రిటీల ఇళ్లలో ఇలాంటి సోదాలు జరగడం సర్వసాధారణమేనని అంటున్నారు నెటిజన్లు. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి