భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక్కటైన జంట.. వైరల్‌గా మారిన వీడియో..!

భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక్కటైన జంట.. వైరల్‌గా మారిన వీడియో..!

భారత్, పాక్ మ్యాచ్ అంటే చాలు.. ఈ రెండు దేశాలకు చెందిన ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు.. క్రికెట్ (Cricket) ఫ్యాన్సందరికీ ఎంతో ఆసక్తి. వరల్డ్ కప్ ఫైనల్ అయినా అంతలా చూస్తారో లేదో తెలీదు కానీ.. ఈ రెండు దేశాల మ్యాచ్‌ని మాత్రం తప్పక చూస్తారు. గత ఆదివారం (జూన్ 16) తేదిన మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్షల మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమ మద్దతుని తెలియజేస్తే; కోట్లమంది టీవీల ముందు.. కొన్ని వేల మంది స్టేడియంకు చేరి ఆయా దేశాలకు సపోర్ట్ చేశారు. కేవలం సామాన్యులే కాదు.. రణ్‌వీర్ సింగ్, సైఫ్ అలీ ఖాన్, శిబానీ దండేకర్, రకుల్ ప్రీత్ సింగ్, మంచులక్ష్మి, ఉపాసన, లియాండర్ పేస్, క్రునాల్ పాండ్య, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా.. వంటి వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ మ్యాచ్‌కి హాజరయ్యారు.

Twitter video screengrab

అలాంటి ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో జరిగిన ప్రత్యేక సంఘటన ఇప్పుడు ట్విట్టర్లో వైరల్‌గా మారింది. అలాగే ప్రతిఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు భారత్ గెలుపుకి దగ్గర్లో ఉందని సంబరాలు చేసుకుంటూనే.. ఇటు తమ ప్రేమను కూడా చాటుకొని తమ స్పెషల్ డేని మరింత ప్రత్యేకంగా మార్చుకుందో యువ జంట. ఓ అమ్మాయికి ఏ మాత్రం తెలియకుండా తనకు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచాడు ఆమె బాయ్ ఫ్రెండ్. తను కూడా ఆనందంగా ఒప్పుకోవడంతో.. అటు మ్యాచ్ గెలుపుతో పాటు తమ ప్రేమ గెలుపును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ జంట.

ట్విట్టర్ యూజర్ అన్విత (@BebuJ), ఆమె బాయ్ ఫ్రెండ్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ (Match) చూడడానికి కలిసే వెళ్లారు. గ్రౌండ్‌కి దగ్గర్లో మొదటి వరుసలోనే కూర్చున్న వారిద్దరూ మ్యాచ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇద్దరూ నీలి రంగు దుస్తులు ధరించి జెండాలు పట్టుకొని భారత జట్టును ప్రోత్సహించారు. అయితే భారత్ బ్యాటింగ్ పూర్తయిపోయి.. జట్టు అందించిన 337 పరుగుల టార్గెట్‌ని పాకిస్థాన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆఖరి దశలో భారత్ గెలుపు ఇక ఖాయం అయిపోయినట్లే అనిపించింది.

అప్పుడు ఈ సంఘటన జరిగింది. సంతోషంతో భారత్ జట్టు ఆటను ఆస్వాదిస్తున్న గర్ల్ ఫ్రెండ్ చేతికి ఉంగరం తొడిగి.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు. దానికి సంభ్రమాశ్చర్యాలకు గురైన ఆ అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్ చూసిన ప్రతిఒక్కరూ అద్భుతం అంటున్నారు. అతడు ఉంగరం చూపగానే.. ఆమె ఒప్పుకోవడం, ఉంగరం పెట్టుకోవడానికి చేయి ముందుకు చాచడం.. అతడు ఉంగరాన్ని తొడిగి ఆమెను హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం.. అక్కడే ఉన్న తమ స్నేహితులకు ఆమె ఒప్పుకున్న విషయం చెప్పడం.. వంటివిన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.

దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. "భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా ఇది జరిగింది. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. తన ప్రపోజల్ నాకెంతో నచ్చింది" అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రపోజల్ (Proposal) వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారుతోంది. ఎంతో మంది యూజర్లు ఈ జంటకు తమ విషెస్‌ని తెలియజేస్తున్నారు.

ఓ యూజర్ ఇదే విషయం పై స్పందిస్తూ "అతడి ఆత్మవిశ్వాసం నాకు చాలా నచ్చింది. భారత్ గెలుస్తుందన్న నమ్మకం అతడికి ఉంది. అందుకే అంతకంటే తక్కువ ప్రాధాన్యం ఉన్న అంశాలపై దృష్టి పెట్టాడు" అంటూ కామెంట్ చేశాడు.

మరో యూజర్ "ఈ మ్యాచ్ గెలుపు ముందే ఫిక్సయిపోయింది" అని కామెంట్ చేయడం విశేషం.

ఈ అబ్బాయి ప్లాన్స్ నాశనం చేయకుండా గెలుపు ఫిక్స్ చేసిన ఇండియన్ క్రికెట్ టీం కి ధన్యవాదాలు అంటూ మరో యూజర్ కామెంట్ చేయడం విశేషం.

ఈ అబ్బాయి నా కళ్ల వెంట కన్నీళ్లు తెప్పించాడు అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, డియర్ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్స్ మీరూ ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

ఈ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ పై 89 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

వీరిద్దరిదీ సమాధులు కలిపిన ప్రేమ బంధం.. ఈ వింత ప్రేమకథ మీరూ చదవండి..!తన పుట్టినరోజున నేనిచ్చిన సర్ ప్రైజ్ చూసి.. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఫీలయ్యాడంటే..!ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!