యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రంపై... స్పెషల్ ఫోటో ఫీచర్..!

యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రంపై... స్పెషల్ ఫోటో ఫీచర్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas) నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం "సాహో" (saaho). సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ క్రమంలో నిన్నే చిత్ర కథానాయకుడు ప్రభాస్ ఈ సినిమా కొత్త పోస్టరును రిలీజ్ చేసి.. విడుదల తేదిని ప్రకటించారు. ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదిన ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాహో చిత్రంపై స్పెషల్ ఫోటో ఫీచర్ మీకోసం ప్రత్యేకం.


 


sahoo-5


మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న నటుడు లాల్. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అలాగే కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆయన సాహో చిత్రంలో కూడా నటిస్తున్నారు. దాదాపు అయిదు భాషలకు చెందిన నటులు సాహో చిత్రంలో నటించడం విశేషం. 


Image: Facebook


 


saaho-10


సాహో చిత్రంలోని సింహభాగం షూటింగ్ అబుదబిలో జరిగిందన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రభాస్ ఆ ప్రాంతంలోని ప్రముఖులతో కలిసి ముచ్చటించారట. అబుదబి మీడియా జోన్ అథారిటీ సీఈఓ మరియం ఈద్ అలమహరితో కొంతసేపు ఆయన సినీ విశేషాలను పంచుకున్నారు.


Image: Instagram


 


sahoo-3


సాహో చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ రోజు అనుకోకుండా ఓ పని మీద ప్రభాస్ ముంబయి వచ్చినప్పడు.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. ముఖేష్ ఇంటికి వెళ్లి ఆయనను ఆశ్చర్యంతో ముంచెత్తారట.


Image: Facebook


 


sahoo-2


సాహో లాంటి చిత్రాన్ని సుజీత్ లాంటి యువ దర్శకుడికి అప్పగించడం.. నిజంగానే ప్రభాస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని పలు పత్రికలు వార్తలు ప్రచురించాయి. సుజీత్ గతంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన "రన్ రాజా రన్" చిత్రానికి దర్శకత్వం వహించారు. సాహో చిత్రానికి ప్రభాస్ సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Image: Facebook


sahoo-1


తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సాహో చిత్రాన్ని.. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. టీసీరీస్ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 


neil-nitin-mukesh-1


సాహో చిత్రంలో ప్రభాస్, శ్రద్ధాదాస్ హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ఎవిలిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, ఆదిత్య శ్రీవాస్తవ, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.మది ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఏఏ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ముంబయి, దుబాయ్, అబుదబి, రొమేనియా లాంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ముఖ్యంగా దుబాయిలోని ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా వద్ద తీసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. 


prabas-fan-poster-1


సాహో సినిమా విడుదల కాకమునుపు.. ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అందులో దర్శకుడు సుజీత్ కొన్నింటిని ఎంపిక చేసి.. తన ఫేస్బుక్ ఫీడ్‌లో పోస్టు చేశారు. అందులో ఒకటి ఈ పోస్టర్.


Image: Facebook


uvcreations-1


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీక్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన వస్తువులను కొనేయండి


ఇవి కూడా చదవండి


సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!


ముగింపు లేకుండా 'సాగే' కథ (మహేష్ బాబు 'మహర్షి' మూవీ రివ్యూ)


మాస్ మసాలా... పూరి జగన్నాధ్ - రామ్‌ల "ఇస్మార్ట్ శంకర్" టీజర్..!