ADVERTISEMENT
home / వినోదం
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో.. మనకు కనిపించే 5 ‘ఇస్మార్ట్’ విషయాలు..!

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో.. మనకు కనిపించే 5 ‘ఇస్మార్ట్’ విషయాలు..!

పూరి జగన్నాథ్ అంటేనే వైవిధ్యమైన పాత్రలకి ప్రాణం పోసే దర్శకుడు. ఇడియట్, పోకిరి, బిజినెస్‌మెన్, బుజ్జిగాడు, టెంపర్.. సినిమాల్లో సృష్టించిన పాత్రలే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలు రూపొంది ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ప్రేక్షకుల మనసులో మాత్రం ఇవి ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇక, చాలా రోజుల తరువాత దాదాపు అటువంటి పంథాలోనే.. ఆయన పెన్ను నుంచి వచ్చిన పాత్రే -ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ( ismart shankar).

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ టాక్ – పూరి జగన్నాధ్ మార్క్ హీరోగా రామ్

ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలైన నాటి నుంచే.. ఈ చిత్రంపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. మరి, ఇన్ని అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ తీసుకున్న “అయిదు ‘ఇస్మార్ట్’ నిర్ణయాలు” గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. రామ్

ADVERTISEMENT

హీరో రామ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రల్లో చాలా వైవిధ్యంగా ఉన్న పాత్ర ఈ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. ఈ పాత్ర కోసం రామ్ తెలంగాణ యాస నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న యాసని దాదాపు ఎటువంటి తప్పులు లేకుండానే పలకగలిగాడు. ఇక రామ్ లుక్ కూడా ఇందులో పక్కా మాస్‌గా ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఒక గూండా పెంపకంలో పెరిగిన వాడు.. ఎలాగైతే ఉంటాడని మనం ఊహిస్తామో అచ్ఛం అలాగే స్క్రీన్ పై కనిపించి అలరిస్తాడు రామ్. డ్యాన్సుల పరంగా కూడా రామ్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

అయితే ఆ ఎనర్జీ ఇందులో మనకు ఫుల్‌గా కనిపిస్తుంది. అతడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ తానై ఈ కథను ముందుకు నడిపించాడు రామ్. అందుకే అతని కెరీర్‌లో ఈ పాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. మాస్ ప్రేక్షకులకు అదే స్థాయిలో వినోదాన్ని పంచడం కోసం.. శంకర్ పాత్రకు రామ్‌ని ఎంచుకోవడం పూరి జగన్నాథ్ తీసుకున్న మొదటి ‘ఇస్మార్ట్’ నిర్ణయం. 

2. హీరోయిన్స్ – నిధి అగర్వాల్ & నభా నటేష్

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్‌లు సినిమాకే అదనపు ఆకర్షణగా నిలిచారు. గ్లామర్‌పరంగా ఇద్దరూ చక్కగా ఆకట్టుకోగా; ఇటు తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి నభా నటేష్ శెభాష్ అనిపించుకోవడమే కాదు.. దాదాపు రామ్ పాత్ర ఎంత మాస్‌గా కనిపిస్తుందో.. అదే స్థాయిలో ఆమె పాత్ర కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

ADVERTISEMENT

కేవలం నటన విషయంలోనే కాదు.. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్‌లో కూడా రామ్‌కి తగిన జోడీ అనిపించుకున్నారు. ముఖ్యంగా బీచ్ సాంగ్‌లో అయితే.. నిధి అగర్వాల్ ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇలాంటి టాలెంటెడ్, గ్లామరెస్ కథానాయికలను తన కథలో భాగం చేసుకోవడం పూరి జగన్నాథ్ తీసుకున్న రెండో ‘ఇస్మార్ట్’ నిర్ణయం.

“బిగ్‌బాస్ తెలుగు”కి కోర్టు చిక్కులు తొలుగుతాయా? అసలు ఈ సీజన్ ప్రారంభమవుతుందా?

3. సంభాషణలు

పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చేది పక్కా మాస్ డైలాగ్స్. ఆయన రాసిన డైలాగ్స్ స్క్రీన్ పై హీరోలు చెబుతుంటే ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. పూరి రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యం చెంది ఉండచ్చు.. కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. ఇందులోనూ డైలాగ్స్ అదే స్థాయిలో వినిపించాయి.

ADVERTISEMENT

అయితే ఇందులో రామ్ పాత్ర పక్కా తెలంగాణ మాండలికంలో సంభాషణలు పలకాలి. ఇప్పటివరకు పూరి తెలంగాణ యాసలో డైలాగ్స్ రాయగలరా? లేదా? అని ప్రేక్షకుల మనసులో ఏదో మూల చిన్న సందేహం ఉండేది. దీంతో అది కూడా పటాపంచలైపోయింది. ఇస్మార్ట్ శంకర్‌లో పూరి రాసిన డైలాగ్స్ ఏక్ ధమ్ ‘ఇస్మార్ట్’ అంటున్నారు సినీ అభిమానులు. ఇలా ప్రేక్షకులు మెచ్చే విధంగా రామ్ పాత్ర పలికే సంభాషణలను తెలంగాణ యాసలో రాయాలని అనుకోవడం.. పూరి జగన్నాథ్ తీసుకున్న మూడో ‘ఇస్మార్ట్’ నిర్ణయం.

4. పక్కా కమర్షియల్ ఫార్ములా

సినిమాలను చాలా రకాలుగా తీయవచ్చు. అయితే పక్కా కమర్షియల్ ఫార్ములా అంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆ ఫార్మాట్‌లో లాజిక్స్‌కి చోటు ఉండదు.. సరికదా సినిమా మొత్తం ఒక పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. ఈ ఇస్మార్ట్ శంకర్ కూడా అటువంటి కోవకే చెందుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు లాజిక్స్‌ని కాస్త పక్కకి పెడితే.. సగటు ప్రేక్షకుడికి ఇది నచ్చే అవకాశం వందశాతం ఉంది. ఎందుకంటే ఇది పక్కా మాస్ ఆడియన్స్ కోరుకునే ‘స్మార్ట్’ కమర్షియల్ చిత్రం. ఒక రకంగా ఈ సినిమాకి ఇటువంటి మాస్ పంథాని ఎంచుకోవడం పూరి జగన్నాథ్ తీసుకున్న నాల్గవ ‘ఇస్మార్ట్’ నిర్ణయం. 

5. పాటలు

ADVERTISEMENT

చాలారోజుల తరువాత ఈ చిత్రం ద్వారా పూరి జగన్నాథ్ – సంగీత దర్శకుడు మణిశర్మ కలిసి పనిచేశారు. వీరిరువురి కలయికలో వచ్చిన చిత్రాలన్నీ పాటలు & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా సూపర్ హిట్స్‌గా నిలిచినవే. ఇక ఈ సినిమాకి కూడా మణిశర్మ అందించిన పాటలు సూపర్ హిట్ టాక్ సంపాదించుకోగా..  తను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరోసారి తన సత్తాని చాటుకున్నాడు. సంగీత సారధ్య బాధ్యతల కోసం మణిశర్మని ఎంపిక చేసుకోవడం పూరి జగన్నాథ్ తీసుకున్న ఐదో ‘ఇస్మార్ట్’ నిర్ణయం.

ఇవీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని విజయవంతం చేయడానికి తీసుకున్న ‘అయిదు’ ఇస్మార్ట్ నిర్ణయాలు.

ఆఖరుగా ఈ సినిమా ఎలా ఉందంటే – కమర్షియల్ సినిమాని ప్రేమించే వారు ఈ సినిమాని కచ్చితంగా ఇష్టపడతారు. వేరే వాళ్లు కాస్త నిరుత్సాహపడే అవకాశాలున్నాయి.

“ఫ్రెండ్‌షిప్ డే” గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ కోసం క్లిక్ చేయండి

ADVERTISEMENT
18 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT