జ‌య‌ల‌లిత క‌థ‌, నా క‌థ ఒక‌టే.. కానీ మా స్వ‌భావాలే వేరు..!

జ‌య‌ల‌లిత క‌థ‌, నా క‌థ ఒక‌టే.. కానీ మా స్వ‌భావాలే వేరు..!

కంగ‌నా ర‌నౌత్‌ (kangana ranaut).. బాలీవుడ్ క్వీన్‌.. వివాదాల రాణిగా పేరు సంపాదించినా.. న‌ట‌న‌తో అద్భుతంగా ఆక‌ట్టుకుంటుందీ అందాల రాశి. ఇటీవ‌లే మ‌ణిక‌ర్ణిక చిత్రంతో ఇటు హీరోయిన్‌గా, అటు ద‌ర్శ‌కురాలిగా విజ‌యాన్ని సాధించి ముందుకెళ్తోందీ తార‌. తాజాగా ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న త‌లైవి సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంది కంగ‌న‌. దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత (jayalalitha) జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న ఈ బ‌యోపిక్ తమిళంతో పాటు హిందీలో కూడా రూపొంద‌నుంది. తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల్లోకి దీన్ని డ‌బ్బింగ్ చేయ‌నున్నార‌ట‌. బాహుబ‌లికి క‌థ‌ను అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమా క‌థ‌ను రాయ‌డం విశేషం.


tt


త‌మిళం, హిందీల్లో విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం కంగ‌న మ‌రింత ఎక్కువ‌గా క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ట‌. ఈ సినిమా కోసం త‌మిళం కూడా నేర్చుకొని త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌నేది కంగ‌న ఉద్దేశంగా తెలుస్తోంది. అంతేకాదు.. జ‌య‌ల‌లిత పాత్ర కోసం భ‌ర‌త‌నాట్యంతో పాటు జ‌య‌ల‌లిత మ్యాన‌రిజం నేర్చుకుంటోంద‌ట‌. అక్టోబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం భారీ పారితోష‌కాన్ని అందుకుంటోంది కంగ‌న. ఈ సినిమాలో భాగ‌మైన త‌ర్వాత నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూల్లో భాగంగా కంగ‌న‌ జ‌య‌ల‌లిత త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌రైన నేత అని చెప్ప‌డం విశేషం.


బాహుబ‌లి చిత్ర ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ నేను న‌టించిన మ‌ణిక‌ర్ణిక సినిమా క‌థ‌ను కూడా రాశారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో మేం చాలాసార్లు క‌లిసి మాట్లాడుకున్నాం. ఆ స‌మ‌యంలోనే నా నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థ ఇది అని చెప్పి జ‌య‌ల‌లిత క‌థ‌ను వినిపించారు. అది నాకు బాగా న‌చ్చింది. దీంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. తాను ఉత్త‌రాదికి చెందిన అమ్మాయినే అయినా కోయంబ‌త్తూర్‌లోని ఆశ్ర‌మంలో ఏడాదికి పది రోజులైనా గ‌డిపి త‌న శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యాన్ని బాగుచేసుకుంటాన‌ని.. అలా త‌న‌కి ద‌క్షిణాది సంప్ర‌దాయాల‌పై ఇష్టం ఏర్ప‌డింద‌ని చెబుతుంది కంగ‌న‌.


జ‌య‌ల‌లిత తమిళ‌నాడు రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ‌మైన వ్య‌క్తి అని తెలుసు కానీ కథ వినే వ‌ర‌కూ జ‌య గురించి త‌న‌కున్న అభిప్రాయం వేర‌ని చెబుతుందామె. నేను నా బ‌యోపిక్ కోసం సిద్ధ‌మ‌వుతున్నా. కానీ ఈ క‌థ విన్న త‌ర్వాత త‌న క‌థ నా జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని అర్థ‌మైంది. కానీ ఇది నా క‌థ కంటే మంచి స‌క్సెస్ సాధించిన క‌థ‌. అందుకే నా క‌థ కంటే దానికే ప్రాధాన్య‌మిచ్చాను.. అని చెప్పింది కంగ‌న‌.


main 1


జ‌య‌ల‌లిత జీవితానికి త‌న జీవితానికి సారూప్యం ఉంద‌ని చెప్పిన కంగ‌న తామిద్ద‌రి వ్య‌వ‌హార శైలి భిన్నంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. జ‌య‌ల‌లిత చాలా విధేయ‌త‌తో వ్య‌వ‌హ‌రించేవారు. కానీ తాను ఏ మార్గంలో వెళ్తున్నా.. దాని ప‌ర్య‌వస‌నాలు ఏంటి? అన్న విష‌యం ఆవిడ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అందుకే ఎన్నో వివాదాలు, క‌ష్టాలు ఎదుర్కొన్నారు. అలా మా ఇద్ద‌రి వ్య‌వ‌హార శైలి చాలా వేరుగా ఉంటుంది. జ‌య‌ల‌లిత సినిమా కోసం నాకు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే ఒప్పుకోలేదు. కానీ త‌న గురించి పుస్త‌కాలు చ‌ద‌వ‌డం త‌న సినిమాలు చూడ‌డం వంటివి చేశాను. త‌న క‌థ ప్ర‌తిఒక్క‌రితో చెప్పాల్సినది అనిపించింది. అందుకే ఈ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకున్నా అది కంగ‌న‌.


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.


ఇవి కూడా చ‌ద‌వండి.


ఆ సినిమా కోసం కంగన రనౌత్‌కి ఇచ్చే.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


 ఈ మోడ్ర‌న్ సీతతో అంత వీజీ కాదండోయ్‌..ఎందుకంటే త‌ను శూర్ఫ‌ణ‌క లాంటిది!


RRR హీరోయిన్ అలియా భట్.. డిప్రెషన్ వెనుక ఉన్న కారణాలేమిటి..?


తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?