ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్.. పుట్టినరోజు స్పెషల్ ఫొటోస్ చూసారా...!

ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్.. పుట్టినరోజు స్పెషల్ ఫొటోస్ చూసారా...!

నందమూరి తారక రామారావు అంశగా పిలవబడే.. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఇప్పుడు టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరు. తన తాత పేరుని నిలబెడుతూ.. ఆయన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువహీరో. 

ఇక తన తాత, తండ్రి హరికృష్ణ మాదిరిగానే కుటుంబానికి తొలి ప్రాధన్యమిచ్చే మనస్తత్వం ఉన్నవాడు ఎన్టీఆర్. షూటింగ్ సమయాల్లో ఆయన తన పాత్రలో ఒదిగిపోయి మరీ నటిస్తాడు. అదే షూటింగ్ ముగిశాక ఇంటికే పరిమితమై.. తన భార్య పిల్లలతో హాయిగా గడుపుతుంటాడు తారక్. అందుకే ఆయన వృత్తిపరంగానే కాకుండా.. ఇటు కుటుంబపరంగానూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఈరోజు విషయానికి వస్తే, ఎన్టీఆర్ తన చిన్న కొడుకు ఫోటోని.. మొదటిసారిగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈరోజే ఆ ఫోటో‌ని షేర్ చేయడానికి గల కారణం - ఆ బుడ్డోడి పుట్టినరోజు కావడమే. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్‌‌లో ఫోటో  పోస్టు చేశారు.  తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ తో పాటుగా.. చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఫోటోని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. 

నందమూరి అభిమానులు ప్రస్తుతం ఈ ఇద్దరి ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు జూ. ఎన్టీఆర్.. కాస్త సీనియర్ ఎన్టీఆర్ అయిపోయారని.. ఈ ఇద్దరు బుడతలు జూనియర్ టైగర్స్ అయ్యారని తెగ పొగిడేస్తున్నారు. ఇంకొందరైతే బుడ్డ ఎన్టీఆర్లు వచ్చేశారు... అని కామెంట్ పెట్టగా..  నందమూరి వంశంలో నాల్గవ తరం హీరోలు వీరే! అంటూ పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తారక్ ఈరోజు తన అభిమానులను ఈ రెండు ఫోటోల ద్వారా ఖుషి చేసేశాడు.       

గత సంవత్సరం, తారక్ జీవితంలో మరిచిపోలేని రెండు ఘటనలు జరిగాయి.   ఒకటి తన చిన్న కొడుకు పుట్టడం.. రెండవది తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కాలం చేయడం. వీటితో పాటు మూడవది త్రివిక్ర‌మ్‌తో కలిసి చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంతో ఘన విజయం సాధించడం.

ప్రస్తుతం ఆయన ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని 2019లో #RRR లాంటి ఒక భారీ మల్టీ స్టారర్‌ని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన షూటింగ్‌లో తారక్, చరణ్ ఇద్దరూ గాయపడడం జరిగింది. ప్రస్తుతం తారక్ #RRR చిత్రం షూటింగ్‌లో అయిన గాయం నుండి కోలుకున్నట్టుగానే కనిపిస్తుంది, ఎందుకంటే తన కొడుకుతో దిగిన ఫోటోలో చేతికి ఎటువంటి కట్టు లేదు! అయితే పోయిన నెలలో మాత్రం ఎన్టీఆర్ చేతికి కట్టు ఉన్న ఒక ఫోటో వైరల్ కావడంతో.. గాయం ఏమైనా తీవ్రమైందా అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమైంది. అయితే ఈరోజు పోస్ట్ చేసిన ఫోటోలతో ఆ ఆందోళన తొలిగిపోయింది.

#RRR షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌లో సినిమా షూటింగ్ పూర్తికాగా.. త్వరలోనే మూడవ షెడ్యూల్ మొదలుకాబోతుంది. ఈ సినిమా తాలూకా వివరాలు చెబుతున్నప్పుడే, #RRR విడుదల తేదీని జులై 20, 2020 అని ప్రకటించారు. షూటింగ్‌ని కూడా దాదాపు వచ్చే ఏడాది తొలి భాగంలోనే పూర్తి చేయడంతో పాటుగా.. తదుపరి కార్యక్రమాలని కూడా అనుకున్న సమయానికి ముగిస్తారట. అలాగే చిత్రాన్ని వచ్చే జులై నాటికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారట దర్శకుడు రాజమౌళితో పాటు అతని టీమ్. 

ఏదేతైనేం ... ఈరోజు నందమూరి అభిమానులకి.. ఎన్టీఆర్ తన స్వీట్ సర్ఫరైజ్ ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా తనకైన గాయం నుండి కూడా కోలుకున్నట్టుగా అందరికి హింట్ కూడా ఇచ్చేశాడు. ఎన్టీఆర్ మొత్తానికి ఈరోజు తన చిన్న కొడుకు భార్గవ రామ్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. తన అభిమానులకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

View this post on Instagram

#Bhargav turns one!

A post shared by Jr NTR (@jrntr) on