కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా.. 'రణరంగం' పోస్టర్ విడుదల..!

కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా.. 'రణరంగం' పోస్టర్ విడుదల..!

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)...  తెలుగు సినీ అభిమానులకి ఈమె గురించి పరిచయం ఏ మాత్రం అవసరం లేదు. కారణం - ఆమె గత దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని కూడా సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు తేజ (Teja) పరిచయం చేసిన హీరోయిన్లలో అద్భుతమైన కెరీర్‌ని సొంతం చేసుకున్న నటిగా.. కీర్తి శిఖరాలు అధిరోహించిన కథానాయిక కాజల్. 

Kajal Aggarwal Ranarangam Movie Look

ఈరోజు ఈ ముద్దుగుమ్మ తన 35వ పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. ఈ శుభతరుణంలో కాజల్ అగర్వాల్ తాజాగా నటిస్తున్న తెలుగు చిత్రం "రణరంగం" (Ranarangam) ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ మునుపటి లాగే ఎంతో అందంగా కనిపించడం గమనార్హం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక వైద్యురాలి పాత్రలో నటిస్తుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న శర్వానంద్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకోగా.. మొన్నీమధ్యనే హీరో శర్వానంద్‌ పై (Sharwanand) కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. అదే సమయంలో ఆయన భుజానికి తీవ్రగాయమైంది. ఆయన కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడం గమనార్హం. దీంతో ఈ చిత్ర విడుదలపై పలు సంశయాలు నెలకొన్నాయి. ఆగస్టు 2వ తేదిన చిత్రం రిలీజ్ అవుతుందని గతంలో ప్రకటించినా.. ఇంకా కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉండడం.. అలాగే హీరోకి గాయాలవడంతో విడుదల తేదిపై ట్రేడ్ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక నటి కాజల్ విషయానికి వస్తే.. దాదాపు 11 ఏళ్ళు సినీ పరిశ్రమలో ఒక మంచి నాయకిగా కితాబునందుకుంది ఆమె. సుమారు 50కి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి.. ఆ ఘనతను సాధించిన  ఇప్పటితరం నాయికల్లో ఒకరిగా నిలిచారామె. అయితే ఈ 50 చిత్రాల ప్రయాణం హిందీ చిత్ర పరిశ్రమతో మొదలై తమిళ, తెలుగు భాషలకి విస్తరించడం విశేషం. కాజల్ అగర్వాల్ కూడా ఎక్కువ శాతం తెలుగు,  తమిళ చిత్రాల ద్వారానే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకోగలిగింది.

Kajal Aggarwal

తెలుగులో కాజల్ అగర్వాల్ తొలి చిత్రం "లక్ష్మి కళ్యాణం" కాగా..  "మగధీర" చిత్రంలోని అవకాశం ఆమె కెరీర్‌ని మరో మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ చిత్రం తరువాత కాజల్.. ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోగా.. అటు తమిళంలో కూడా తన సత్తాని చాటింది. తమిళ హీరోలు సూర్య (Suriya), విజయ్ (Vijay) & ధనుష్‌ల (Dhanush) సరసన నటించి.. అక్కడ సైతం తన మార్కెట్‌ని విస్తరించుకోగలిగింది. అలాగే టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి చెందిన అగ్రహీరోలందరితోనూ నటించే అవకాశం దక్కించుకుంది కేవలం కాజల్ మాత్రమే. అందుకే 'మెగా హీరోయిన్'  అనే ట్యాగ్‌ని కూడా సొంతం చేసుకుంది.  

ఒకవైపు నటనలో కొనసాగుతూనే.. కొద్ది సంవత్సరాల క్రితం, తన చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి 'మరసాల' (Marsala) పేరిట జ్యూవెలరీ బిజినెస్‌ని కూడా నెలకొల్పింది కాజల్. తద్వారా మంచి ఎంట్రప్రెన్యూర్ అనిపించుకుంది కూడా. 

కాజల్ అగర్వాల్ సినీ కెరీర్‌ను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇటీవలే హిందీలో ఘనవిజయం సాధించిన 'క్వీన్' (Queen) చిత్ర తమిళ రీమేక్‌లో నటిండానికి సైన్ చేసిందామె. పారిస్ పారిస్ (Paris Paris) పేరుతో ఆ చిత్రం రీమేక్ చేయగా.. అందులో కాజల్ టైటిల్ పాత్రని పోషించింది. ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'రణరంగం'తో పాటుగా.. తమిళంలో చేస్తున్న 'కోమలి' చిత్రం కూడా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది.

ఇవి అన్ని ఒక ఎత్తయితే.. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో ప్రధాన నాయికగా కూడా అవకాశం కొట్టేసింది కాజల్. ఈ చిత్రానికి శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నారు.

తన 11 ఏళ్ళ సినీ ప్రస్థానంలో.. ఎక్కువ శాతం విజయాలే సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్‌కు  భవిష్యత్తులో కూడా.. మరిన్ని విజయాలు దక్కాలని మనసారా ఆశిద్దాము.

ఇవి కూడా చదవండి

సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా

'సీత' అభిమానులను ఆకట్టుకోగలిగిందా? (సినిమా ప్లస్ & మైనస్ పాయింట్స్)

టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?