ఆ మిస్ క్యారేజ్.. మా ఇద్దరినీ చాలా బాధపెట్టింది : కాజోల్

ఆ మిస్ క్యారేజ్.. మా ఇద్దరినీ చాలా బాధపెట్టింది : కాజోల్

కాజోల్ (Kajol), అజయ్ దేవగణ్ (Ajay Devgn).. వీరిద్దరూ బాలీవుడ్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫేమస్ జంటల్లో ఒకరు. ప్రేమించి పెళ్లాడిన వీరిద్దరూ..ఒక బంధం అంటే ఎలా ఉండాలో అనతికాలంలోనే అందరికీ చాటిచెప్పారు. ఈ క్రమంలో పలువురు జంటలకు ఆదర్శంగానూ నిలిచారు. తమ దాంపత్య జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించేందుకు చాలామంది వీరిని ఆదర్శంగా తీసుకుంటారట. ప్రతి రోజు సరికొత్తగా ఎంజాయ్ చేసే వీరిద్దరూ.. పెళ్లి చేసుకొని ఇరవై సంవత్సరాలు పూర్తయింది.

అయినా కొత్తగా పెళ్లైన జంటల్లా వీరి అనుబంధం ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. ఫిబ్రవరి 24, 1999 తేదిన పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు. వారే నైసా, యుగ్. కాజోల్ దంపతులు చాలా విభిన్నమైన వ్యక్తులు. కాజోల్ గలగల పారే గోదారి అయితే అజయ్ నిశబ్ద సాగరం.. అందుకే వీరి పెళ్లి ఎక్కువ రోజులు కొనసాగదని చాలామంది అన్నారు. కానీ వారందరి నోళ్లు మూయిస్తూ.. ఇరవై ఏళ్ల నుండీ వీరిద్దరూ ఇంకా అన్యోన్యంగా జీవిస్తుండడం విశేషం.

ఒక్కసారి మేకప్ వేసుకుంటే... అది జీవితాంతం మనల్ని వదిలిపెట్టదు ('కాజోల్' బర్త్ డే స్పెషల్)

తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా విషయాలు పంచుకుంది కాజోల్. సాధారణంగా వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయట పెట్టరు. అలాంటిది పెళ్లి, పిల్లల గురించి ఎన్నో సీక్రెట్లు పంచుకోవడంతో.. ఈ ఇంటర్వ్యూ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మరి, కాజోల్ చెప్పిన ఆ సీక్రెట్స్ ఏమిటో మనమూ తెలుసుకుందాం రండి..

"మేమిద్దరం మొదటిసారి 'హల్చల్' సినిమా సెట్స్‌లో కలుసుకున్నాం. షాట్ కోసం రడీ అయ్యాక హీరో ఎక్కడ? అని అడిగాను. ఎవరో అజయ్‌ని చూపించారు. తను ఓ మూలన కూర్చొని తన స్క్రిప్టు చదువుకుంటున్నాడు. తనని కలవడానికి పది నిమిషాల ముందు తన గురించి ఏదో ఆలోచించాను. ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. నెమ్మదిగా మంచి స్నేహితులమయ్యాం. అప్పుడు నేను వేరే వ్యక్తిని ప్రేమించేదాన్ని.

అజయ్ కూడా వేరే అమ్మాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. నేను నా బాయ్ ఫ్రెండ్‌కి, నాకు జరిగిన గొడవల గురించి అజయ్‌తో పంచుకునేదాన్ని. ఆ తర్వాత మేమిద్దరం వారిద్దరితో విడిపోయాం. మేం ప్రేమించుకుంటున్నామని మాకు అర్థమైంది. కానీ ఇద్దరిలో ఎవరూ ప్రపోజ్ చేయలేదు. మేమిద్దరం కలిసి గడపాలనుకుంటున్నాం అని మాకు అర్థమైంది. చేయి పట్టుకునే స్థాయి నుంచి నేను తనకు చాలా క్లోజ్ అయ్యాను. డిన్నర్లకు, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లం. తను నాకంటే చాలా విభిన్నమైన వ్యక్తి అని నాకు తెలుసు. అయినా తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా"

"నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత.. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ ఈ విషయం చెప్పగానే మా నాన్న నాతో నాలుగు రోజుల పాటు మాట్లాడలేదు. తనకు అజయ్ నచ్చలేదని కాదు కానీ.. నా కెరీర్ మీద నేను ఇంకాస్త శ్రద్ధ పెట్టాలన్నది ఆయన ఉద్దేశ్యం. కానీ నేను పట్టు వీడలేదు. ఆఖరికి నాన్న కూడా ఒప్పుకోవడంతో మేం పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి పంజాబీ, మరాఠీ రెండు పద్ధతుల్లోనూ జరిగింది. మా పెళ్లి గురించి ముందే మీడియాకి తెలిసిపోవడంతో వారికి వేరే అడ్రస్ ఇచ్చి.. మేం ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం.

ఆ రోజు మీడియా హడావిడి లేకుండా మాకు మేమే అన్నట్లుగా ఆనందంగా పెళ్లిచేసుకోవాలని అలా చేశాం. మళ్లీ మీడియా వాళ్లు ఎక్కడ వచ్చేస్తారో అని.. అజయ్ పండితుడిని త్వరగా పెళ్లి పూర్తి చేయాలని కంగారు పెట్టాడు. తనకు డబ్బు కూడా ఇస్తానని చెప్పాడు. అలా మా పెళ్లి ఏ హడావిడి లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా జరిగిపోయింది. పెళ్లి సింపుల్‌గా చేసుకున్నా.. హనీమూన్ మాత్రం చాలా రోజులు ఉండాలని నేను కోరుకున్నా. అందుకే మేం సిడ్నీ, హవాయి, లాస్ ఏంజిల్స్ చూశాం. ఐదు వారాల పాటు ఈ మూడు ప్రాంతాలు చూసిన తర్వాత ఈజిప్టు వెళ్లాల్సి ఉండగా.. అజయ్‌కి ఆరోగ్యం పాడైంది. దాంతో మేం తిరిగి వచ్చేశాం. నువ్వు నాకు ఈజిప్టు తీసుకెళ్లడం బాకీ ఉన్నావు" అంటూ ఇప్పటికీ తనని నేను ఏడిపిస్తుంటా.

"కొన్నేళ్ల తర్వాత మేం పిల్లల కోసం ప్లానింగ్ ప్రారంభించాం. కభీ కుషీ కభీ ఘమ్ చిత్రం షూటింగ్ సమయంలో నేను గర్భవతిని. అయితే ఆ సినిమా విడుదల సమయానికి నాకు మిస్ క్యారేజ్ జరిగింది. అప్పుడు నేను ఆసుపత్రిలో ఉన్నా. సినిమా పెద్ద హిట్ అని నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ నేను ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉండిపోయాను. ఆ మిస్ క్యారేజ్ మమ్మల్ని చాలా బాధపెట్టింది. ఆ తర్వాత మరోసారి మిస్ క్యారేజ్ జరిగింది. చాలా బాధపడ్డాం. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత వైద్యుల సాయంతో నా కల తీరింది. నైసా, యుగ్ పుట్టారు. మా జీవితం పరిపూర్ణమైపోయింది.

ఆ తర్వాత మా జీవితాల్లో చాలా జరిగింది. మేం మా సొంత కంపెనీ పెట్టాం. అజయ్ వంద సినిమాలు పూర్తిచేసుకున్నాడు. ప్రతి రోజూ మేం మా బంధాన్ని కొత్తగా నిర్మించుకుంటున్నాం. తనతో జీవితం చాలా ఆనందంగా ఉంది. మేమిద్దరం అంత రొమాంటిక్ కాదు. కానీ ఒకరి మీద మరొకరికి చాలా ప్రేమ ఉంది. నేను నా మనసులో ఏం ఆలోచిస్తానో నోటి నుంచి అదే బయటకు వచ్చేస్తుంది. తను కూడా అంతే. మా బంధంలో అంత స్వేచ్ఛ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది కాజోల్.

నేను జీవితంలో పడిపోతున్నప్పుడు.. సైఫ్ నన్ను కాపాడాడు : కరీనా

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.