వారు విడాకులు తీసుకోవడం.. నా జీవితంలో పెద్ద షాక్ : కల్యాణీ ప్రియదర్శన్

వారు విడాకులు తీసుకోవడం.. నా జీవితంలో పెద్ద షాక్ : కల్యాణీ ప్రియదర్శన్

(Kalyani Priyadarshan talks about her parents Lissy and Priyadarshan's Divorce Issue)

కల్యాణీ ప్రియదర్శన్ .. అలనాటి నటి లిస్సీ, దర్శకుడు ప్రియదర్శన్‌ల కుమార్తె.. అఖిల్ నటించిన రెండో చిత్రం 'హలో' సినిమాతో వెండితెరకు పరిచయమైందీ బ్యూటీ. ఆ తర్వాత చిత్రలహరి, రణ రంగం చిత్రాలలోనూ నటించింది. ఇప్పుడు తెలుగు, మలయాళ, తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోందీ నాయిక. సింగపూర్‌లో చదువుకొని న్యూయార్క్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కల్యాణి.. సినిమాలంటే ఉన్న ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టిందట. కథానాయికగా పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే ప్రొడక్షన్ డిజైనర్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది.      

నేను జీవితంలో పడిపోతున్నప్పుడు.. సైఫ్ నన్ను కాపాడాడు : కరీనా                             

కోలీవుడ్‌లో కల్యాణి నటించిన మొదటి చిత్రం 'హీరో' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండగా పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ హీరో కథగా భావిస్తున్న ఈ సినిమాలో విద్య ప్రాముఖ్యతను వివరించారట. ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది కల్యాణి. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం జరిగిన తన తల్లిదండ్రుల విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. దాని ప్రభావం తనపై ఎలా పడిందో వివరించింది కల్యాణి.

దీని గురించి చెబుతూ.. "అలాంటివి ఎవరికైనా బాధగా అనిపిస్తాయి. దాని ప్రభావం నాపై పడలేదు అని చెబితే అది అబద్ధం అవుతుంది. అయితే విడాకుల సమయంలో మా అమ్మానాన్న ప్రవర్తన చూసి వారిని ప్రశంసించాలనిపించింది. వాళ్లు మమ్మల్ని ఎప్పుడూ ఆ సమస్యల సుడిగుండంలో పడేయలేదు. వాళ్లు మానసికంగా ఎంత బాధలో ఉన్నా సరే.. దాన్ని బయటకు చూపించలేదు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు. అందుకే వారిద్దరి విడాకులు మాకు షాక్‌ని కలిగించాయి. కానీ అది జరగడమే మంచిదేమో. ఈరోజు వాళ్లు ఆనందంగా ఉన్నారు. మేం కూడా ఆనందంగా ఉన్నాం. నా తల్లిదండ్రులిద్దరితో నా బంధం మరింత బలంగా తయారైంది. ఇది చాలా ముఖ్యమైంది. అది నాకు చాలు' అని అంటోంది కల్యాణి.

2016 లో లిస్సీ, ప్రియదర్శన్.. వీరిద్దరూ తమ 24 సంవత్సరాల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ.. చెన్నై ఫ్యామిలీ కోర్ట్‌లో విడాకులు తీసుకున్నారు. కొన్ని సమస్యల కారణంగా తమ వివాహ బంధం సమస్యలమయంగా మారిందని.. ఈ క్రమంలో తమ ఇరువురి గౌరవానికి భంగం కలగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని లిస్సీ ప్రకటించారు. 'పెళ్లయినప్పటి నుంచి పరిస్థితులు అలాగే ఉన్నా.. వాటిని భరించే ఓపిక లేక విడాకులు తీసుకున్నా' అని చెప్పారు లిస్సీ.

అందుకే పెళ్లి చేసుకున్నాకే కలిసి ఉండాలనుకున్నాం.. : దీపికా పదుకొణె

ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన లిస్సీ 'ఇది నా జీవితంలోనే అత్యంత కష్టమైన సమయం. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు మేమందరం గతాన్ని మర్చిపోయి ముందుకు సాగగలం. నాకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ.. నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నా పిల్లలిద్దరూ నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చారు లిస్సీ.

1990 లో ప్రియదర్శన్‌ని వివాహం చేసుకున్న లిస్సీ.. రోమన్ క్యాథలిక్ నుంచి హిందూగా మారారు. తన పేరును కూడా లక్ష్మిగా మార్చుకున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుండీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆమె.. తన విడాకుల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.