మరోసారి వార్తల్లో పీటీ ఉష బయోపిక్... పరుగుల రాణిగా కత్రినా నటించనుందా..?

మరోసారి వార్తల్లో పీటీ ఉష బయోపిక్... పరుగుల రాణిగా కత్రినా నటించనుందా..?

ప్రస్తుతం సినిమా రంగంలో బయోపిక్(Biopic) ల ట్రెండ్ బాగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా క్రీడాకారుల జీవితాల నేపథ్యంగా చిత్రాలను తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన భాగ్ మిల్కా భాగ్, ధోనీ, మేరీకోమ్, దంగల్.. మొదలైన చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్రీడా జీవితాల నేపథ్యంలో బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి.


ఇప్పుడు అదే బాటలో మరో క్రీడాకారిణి జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభమైంది. పరుగుల రాణిగా పేరు గాంచిన పీటీ ఉష(P.T. Usha) జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందిచనున్నారు. మరి, పరుగుల రాణిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? ఇంకెవరు మన మల్లీశ్వరి. అదేనండీ మన కత్రినా కైఫ్(Katrina kaif).
 

 

 


View this post on Instagram


#feetupwiththestars @anaitashroffadajania 🦋💕🌟


A post shared by Katrina Kaif (@katrinakaif) on
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తమిళ, మళయాళ చిత్రాలకు దర్శకత్వం వహించే రేవతి ఎస్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే కత్రినాకు స్క్రిప్ట్ వివరించారట. కథ నచ్చడంతో కత్రినా సైతం ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తోందట. కానీ ఇంకా తన అంగీకారాన్ని తెలియజేయలేదని సమాచారం. కొన్నేళ్ల క్రితమే పీటీ ఉష బయోపిక్ రూపొందించాలని రేవతి భావించారు. ఈ విషయమై ప్రియాంక చోప్రాను కూడా కలిశారు.


కథ నచ్చినప్పటికీ ఆమె అంగీకారం తెలపకపోవడంతో ఈ చిత్రం కాస్తా పెండింగ్‌లో పడిపోయింది. ఆ తర్వాత ప్రియాంక మేరీకోమ్‌గా నటించి అందరి మెప్పు పొందింది. ఇప్పుడు రేవతి కత్రినాను కలవడం, ఆమెకు కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కబోతోందేమోననే ఆశ అటు క్రీడాభిమానుల్లోనూ.. సినీ ప్రేక్షకుల్లోనూ నెలకొంది.


ప్రస్తుతం కత్రినా ఖిలాడీ అక్షయ్ కుమార్ సరసన స్యూర్యవంశి చిత్రంలో నటిస్తోంది. అలాగే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తోన్న భారత్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.


పీటీ ఉష గురించి కొంత:


1-pt-usha-biopic


పీటీ ఉష మన భారతీయులకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులందరికీ పరిచయం అక్కర్లేని పేరు. అథ్లెటిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగానికి ఆమెను ఇండియన్ క్వీన్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు.. ఆమెను పయ్యోలి ఎక్స్ ప్రెస్ అని కూడా అంటారు. 1979లో అథ్లెట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.


ప్రస్తుతం కోచ్ గా మెరికల్లాంటి అథ్లెట్లను తయారుచేస్తున్నారు. 200మీ, 400మీ, 400మీ హర్డిల్స్, 4X400మీ రిలేలో ఆమె లెక్కలేనన్ని పతకాలు అందుకొన్నారు. ఆమె పతకం అందుకోని ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాలు లేవంటే నమ్మండి.


మన దేశం నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన మొదటి క్రీడాకారిణి పీటీ ఉష. అంతేకాదు.. ఒలింపిక్ ఫైనల్స్ చేరుకొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగానూ పేరుగాంచారు. సుమారుగా 100కి పైగా పతకాలు పీటీ ఉష సొంతం చేసుకొన్నారు. ఆమె క్రీడా ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున క్రీడా పురస్కారం, పద్మశ్రీ పౌర పురస్కారంతో సత్కరించింది.


ప్రస్తుతం ఆమె కేరళలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ప్రారంభించి.. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భావి అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మేటి అథ్లెట్లుగా రాణిస్తోన్న జిస్నా మాథ్యూ, టింటు లుకా, జెస్సీ జోసెఫ్ ఆమె శిష్యులే. వీరితో పాటు మరికొందరిని మెరికలుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు పీటీ ఉష.


Images: Instagram


ఇవి కూడా చదవండి:


నల్లగా, లావుగా ఉన్నావు.. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు: సోనమ్


ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?


ఇప్పుడు ఆ భయం.. మహిళలను వేధించేవారిలో కనిపిస్తోంది: కృతి సనన్