నీకెంత మంది ప్రపోజ్ చేశారు? అభిమాని ప్రశ్నకు రకుల్ ఎలాంటి జవాబిచ్చిందంటే..?

నీకెంత మంది ప్రపోజ్ చేశారు? అభిమాని ప్రశ్నకు రకుల్ ఎలాంటి జవాబిచ్చిందంటే..?

రకుల్ ప్రీత్ సింగ్.. ఆమె అందానికి, అభినయానికి తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయ్యారు. ఎన్టీయార్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా నేటితరం అగ్ర కథానాయకులందరి సరసన నటించింది రకుల్. కోలీవుడ్లో సైతం నటిగా మంచి గుర్తింపు పొందింది. దే దే ప్యార్ దే సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.


ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ట్విట్టర్ (twitter) వేదికగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది రకుల్ ప్రీత్ (Rakul Preet). వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది కూడా. వాటిలో కొన్ని ఆసక్తకరమైనవి మీకోసం..


మీ ఫేవరెట్ మార్వల్ హీరో ఎవరు?


ఐరన్ మ్యాన్


మన్మథుడు 2 షూటింగ్ ఎలా జరుగుతోంది?


చాలా బాగా జరుగుతోంది. సెట్లో అందరూ పాజిటివ్‌గా ఉంటారు.


రాజమౌళితో పనిచేసే అవకాశం వస్తే ఏం చేస్తారు?


ఏమీ ఆలోచించకుండా వెంటనే సైన్ చేసేస్తా.


ఒత్తిడి అనిపించినప్పుడు మీరేం చేస్తారు?


ఫ్రెండ్స్, ఫ్యామిలీతో బయటకు వెళ్లి దాన్నుంచి బయటపడతా.


మీ ఫేవరెట్ నటీమణులు


అలియాభట్, అనుష్కా శర్మ, కాజోల్


సమంత గురించి మీ అభిప్రాయం


సమంత అంటే నాకు చాలా ఇష్టం. తను  పవర్ ఉమన్.


సాయి పల్లవి గురించి ఒక్క మాట.


చాలా నేచురల్‌గా ఉంటుంది. ప్రతిభ ఉన్న, కష్టపడే అమ్మాయి.


అల్లు అర్జున్ గురించి చెప్పండి


నాకు తెలిసినవారిలో చాలా మంచి వ్యక్తి.


ముగ్గురు ఖాన్లలో పనిచేసే అవకాశం వస్తే మీరు ఎవరిని ఎంచుకొంటారు?


ఎవరు ముందు ఆఫర్ ఇస్తే వారితోనే


షారుఖ్ ఖాన్ సినిమాల్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి?


దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.


3-rakul-preet


మీకిష్టమైన ఫుడ్?


ఆరోగ్యకరమైనది ఏదైనా ఇష్టమే.


మీకు నచ్చిన సౌత్ ఇండియన్ ఫుడ్


అప్పం


మూడు కోరికలు కోరుకొనే అవకాశం వస్తే ఏం కోరుకొంటారు?


బాగా తినాలి. కానీ లావు అవ్వకూడదు. ఈ ఒక్క కోరిక తీరిస్తే చాలు.


ఇప్పటి వరకు మీకెంతమంది ప్రపోజ్ చేశారు?


ఎవరూ చేయలేదు.


మీ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి?


ఫిట్‌గా ఉండడం సీక్రెట్ ఏమీ కాదు. ఫిట్‌నెస్ రొటీన్ మీ జీవితంలో భాగం చేసుకోండి.


మీకు ఫిట్‌నెస్ సెంటర్లు ఉన్నాయి కదా. మీ అందం, ఫిట్ నెస్ వెనక ఉన్న రహస్యం?


క్రమశిక్షణ.


పాఠశాల రోజుల్లో నటి కావాలని ఎప్పుడైనా అనుకొన్నారా?


నటిని అవ్వాలనుకోలేదు. కానీ ప్రయత్నిస్తే బాగుంటుందనుకొన్నా.


2-rakul-preet


మీ సౌందర్య రహస్యం?


ఎప్పుడూ  సంతోషంగా ఉండడం.


మీకిష్టమైన హాలిడే స్పాట్?


లండన్


బాలీవుడ్ సినిమాకు ప్రమోట్ చేసినట్టుగా దక్షిణాది చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో మీరెందుకు పాల్గొనరు?


బాలీవుడ్‌లో దాని కోసం ప్రత్యేకమైన ప్లాన్ ఉంటుంది. అలాంటి ప్లాన్ దక్షిణాది చిత్రాల్లోనూ ఉంటే కచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటా.


మీరు గర్వంగా ఫీలైన సందర్భం ఏదైనా ఉందా?


నేను చేస్తున్నది సరైన పనే అని నా తల్లిదండ్రులు భావించే ప్రతి క్షణం నేను గర్వంగా ఫీలవుతుంటా.


సూర్యతో కలసి మరోసారి పనిచేస్తారా?


మంచి కథతో వస్తే కచ్చితంగా నటిస్తా. ఆయనతో నటించడం మంచి అనుభవం.(రకుల్ సూర్య సరసన ఎన్జీకే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది)


అభిమానులకు మీరేదైనా సందేశాన్నిస్తారా?


సందేశం ఏమీ ఇవ్వను కానీ.. వారికి థ్యాంక్స్ చెబుతా.


Image: Instagram


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి:


నాతో సహజీవనం చేయడం కోసం.. సైఫ్ మా అమ్మని పర్మిషన్ అడిగాడు: కరీనా


నల్లగా, లావుగా ఉన్నావు.. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు: సోనమ్