మంచుకొండ‌ల్లో మెగాస్టార్ హాలిడే.. విరామాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి దంపతులు..!

మంచుకొండ‌ల్లో మెగాస్టార్ హాలిడే..  విరామాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి దంపతులు..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. త‌న కెరీర్ ప్రారంభించి ఐదు ద‌శాబ్దాలు పూర్త‌వుతోన్నా.. అభిమానుల్లో ఆయ‌న‌పై ఉన్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. మ‌ధ్య‌లో రాజ‌కీయాల కోసం కెరీర్‌కి గ్యాప్ ఇచ్చిన చిరు.. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆపై ఆయ‌న న‌టిస్తోన్న చిత్రం సైరా(syeraa) న‌ర‌సింహా రెడ్డి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తుండ‌డం విశేషం. ప్ర‌ముఖ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ గ‌తేడాది ప్రారంభించినప్ప‌టికీ.. వివిధ కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఎక్కువ‌కాలం సాగుతూ వ‌స్తోంది.


అందుకే తాజాగా చిత్రబృందం సినిమా షూటింగ్‌ని వేగ‌వంతం చేసి మే ఆఖ‌రిలోపు పూర్తి చేయాల‌ని.. ఆగ‌స్టులో ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఇందుకోసం సినిమా షూటింగ్‌ని నిర్విరామంగా కొన‌సాగించ‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. అందుకేనేమో.. సినిమా మ‌రో షెడ్యూల్ ప్రారంభం కాక‌ముందే.. భార్య‌తో కాస్త స‌మ‌యాన్ని గ‌డిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.


తాజాగా త‌న భార్య సురేఖ‌తో క‌లిసి ఆయ‌న జ‌పాన్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారట. ఈ విష‌యాన్ని ఆయ‌న పెద్ద కూతురు సుస్మిత సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితోనూ పంచుకుంది. సైరా బిజీ షెడ్యూల్ నుంచి కాస్త స‌మయం దొర‌క‌గానే.. అమ్మా,నాన్న ఇద్ద‌రూ మంచి ట్రిప్‌ని ఎంజాయ్ చేశారు. వారీ ట్రిప్ కోసం జ‌పాన్‌లోని మౌంట్ ఫుజీకి వెళ్లారు. అక్క‌డి సుకురా చెర్రీ బ్లాస‌మ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వారికి ఈ కొద్ది స‌మ‌యం విరామం ఇచ్చినందుకు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీకి నా కృత‌జ్ఞ‌త‌లు అంటూ పోస్ట్ చేశారు సుస్మిత.
ఈ ఫోటోల్లో మెగాస్టార్ చిరు, ఆయ‌న భార్య సుస్మిత మంచు ప‌ర్వాతాల మ‌ధ్య.. ఎంతో ఆనందంగా గ‌డుపుతున్న వైనాన్ని మ‌నం చూడచ్చు. అంతేకాదు.. చ‌క్క‌టి చెర్రీ పువ్వులు నిండిన చెట్టు ద‌గ్గ‌ర కూడా.. మెగాస్టార్ దంప‌తులు ఫొటో దిగ‌డం విశేషం. సుస్మిత ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అభిమానులు వీటిని రీపోస్ట్ చేయ‌డంతో.. ఇవి చాలా వైర‌ల్‌గా మారిపోయాయి. సుస్మిత చేసిన ఈ పోస్ట్‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా కామెంట్లు చేయ‌డం విశేషం.


మెగాస్టార్‌ని నాన్న అని పిలిచేంత క్లోజ్ అయిన.. ఆయ‌న త‌మ్ముడి కూతురు నిహారిక "క్యూట్ క‌పుల్" అంటూ కామెంట్ చేయ‌గా.. అల్లుడు క‌ల్యాణ్‌దేవ్ "సూప‌ర్ క‌పుల్" అని.. మంచు లక్ష్మి "ల‌వ్ ల‌వ్ ల‌వ్‌.." అంటూ కామెంట్లు చేశారు.


image big 157585b976154504a0


గ‌తేడాది ప్రారంభంలో మొద‌లైన సైరా షూటింగ్ ఇంకా పూర్తికాక‌పోయినా.. వ‌చ్చే కొన్ని వారాల్లో షూటింగ్ పూర్తి చేస్తామ‌ని చెబుతున్నారు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్ తార‌లు కూడా న‌టిస్తోన్న ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తుండ‌డం విశేషం. జార్జియాలో జ‌రిగిన ఓ యుద్ధ స‌న్నివేశం షూటింగ్‌కి యాభై కోట్ల‌కి పైగా ఖ‌ర్చు చేయ‌డం ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఈ ఏడాది హిస్టారిక‌ల్ సినిమాగా విడుద‌ల కాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న తార‌, త‌మ‌న్నా న‌టిస్తున్నారు. ఇందులో సుదీప్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు వంటి స్టార్లు కూడా న‌టిస్తుండ‌డం సినిమా ప‌ట్ల అంచ‌నాల‌ను పెంచుతోంది.


ఇవి కూడా చ‌ద‌వండి.


జ‌య‌ల‌లిత క‌థ‌, నా క‌థ ఒక‌టే.. కానీ మా స్వ‌భావాలే వేరు..!


ఈ మోడ్ర‌న్ సీతతో అంత వీజీ కాదండోయ్‌..ఎందుకంటే త‌ను శూర్ఫ‌ణ‌క లాంటిది!


షారూఖ్ పార్టీకి అమీర్ టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాడట.. ఎందుకో తెలుసా?