పవర్ ఫుల్‌గా సాగిన.. "సైరా నరసింహారెడ్డి" టైటిల్ సాంగ్ లిరిక్స్..!

 పవర్ ఫుల్‌గా సాగిన.. "సైరా నరసింహారెడ్డి" టైటిల్ సాంగ్ లిరిక్స్..!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న "సైరా" (Syeraa) చిత్రం.. అక్టోబరు 2వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నిన్నే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ వీడియోను నిర్మాతలు యూట్యూబులో విడుదల చేశారు. హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషలలో ఈ పాటను విడుదల చేయడం విశేషం.

బర్త్‌డే స్పెషల్ : మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలోని.. 10 కీలక మైలురాళ్లు ..!

ఈ పాటకు తెలుగులో సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి అందివ్వగా.. తమిళంలో ఇదే పాటను కార్కి రాశారు. హిందీలో ఇదే పాటకు సాహిత్యాన్ని స్వానంద్ కిర్‌కిరే అందించారు. మలయాళంలో ఇదే పాటను సుజు తురువూర్ రాయగా.. కన్నడంలో ఆజాద్ వరద రాజ్ పదాలు అందించారు. ఈ సినిమాలో పాటలకు అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 

మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" మేకింగ్ వీడియోలో.. హైలైట్స్ ఇవే..!

ఈ పాట తెలుగు లిరిక్స్ 

పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవురా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా
రేనాటి సీమ కన్న సూర్యుడా
నింగి శిరసు వంచి.. నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా
ఓ సైరా.. ఓ సైరా
ఓ సైరా.. ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయెరా
యశస్సు నీకు రూపమాయెరా
పాశాన జీవించడం కన్నా
చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులే అయితే మనం.. అణచివేసే జులుం
వద్దంది నీ ఉద్యమం
ఓ సైరా.. ఓ సైరా
ఓ సైరా.. ఓ సైరా
ఆలిని, బిడ్డని, అమ్మని, జన్మని
బంధనాలన్నీ వదిలి సాగుదాం
ఓ నువ్వే లక్షలై.. ఒకే లక్ష్యమై
అటే వేయనీ ప్రతి పథం
కదనరంగమంతా కొదమసింగమల్లే
ఆక్రమించి, విక్రమించి
తరుముతుందిరా.. వీర సంహారా
ఉషస్సు నీకు ఊపిరాయెరా

 

ఈ పాటను అన్ని భాషల్లోనూ సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్‌లు కలిసి పాడడం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నిహారిక కొణిదెల, అమితాబ్ బచ్చన్, బ్రహ్మాజీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రేనాటి వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడు నరసింహారెడ్డి జీవిత కథను ప్రేరణగా తీసుకొని.. ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

"సైరా" టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!

ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథను అందించగా.. బుర్రా సాయిమాధవ్ మాటలను అందించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా.. జులియస్ పకియమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పంపిణీ చేస్తోంది. అలాగే ఏఏ ఫిలిమ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోగా.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ తమిళంలో ఇదే సినిమాను పంపిణీ చేస్తోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.