ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ పాత్రలను చూస్తుంటే.. ప్రపంచంలో మంచితనమంతా వీరిలోనే ఉన్నట్లుంటుంది..!

ఈ పాత్రలను చూస్తుంటే.. ప్రపంచంలో మంచితనమంతా వీరిలోనే ఉన్నట్లుంటుంది..!

మజిలీ.. ప్రేమించిన అమ్మాయిని మనసులో పెట్టుకొని.. తాను అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేక.. పెళ్లయినా భార్యకు దగ్గరకాలేకపోయిన ఓ భర్త కథ ఇది. అయితే తన భర్త వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసినా.. అతనికి సంపాదన లేకపోయినా.. తనని ప్రేమిస్తుంది కథానాయిక శ్రావణి. అతని గాయాన్ని మాన్పేందుకు ప్రయత్నిస్తూ.. ఆర్థికంగా అతడికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దీని కోసం తన కలలన్నింటినీ మర్చిపోతుంది. 

ఇలాంటి ఎంతో బాధతో కూడుకున్న కథలోనూ.. కథానాయిక శ్రావణి  పాత్ర మాత్రం అందరికీ ఇలాంటి భార్య నాక్కూడా ఉంటే ఎంత బాగుండో అనో.. లేక నా భార్య నన్ను ఇంతలా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనో ఆలోచించేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. శ్రావణి పాత్ర ప్రతిఒక్కరికీ అంతగా నచ్చేసింది మరి..

majili

శ్రావణి భర్త పూర్ణ కోసం క్లర్క్‌గా పనిచేస్తూ ఇంటి బాధ్యతలు తీసుకుంటుంది. ఇంటికి పెద్ద దిక్కుగా మారుతుంది. భర్త ఆత్మాభిమానం దెబ్బతినకుండా అతడికి కూడా సాయం చేస్తుంది. వాటికి బదులుగా భర్త నుంచి ఏమీ ఆశించదు. ఎప్పటికైనా తన భర్త మనసులో ఉన్న గాయం మానిపోయి అతడు తనవాడవుతాడని.. తనని ప్రేమిస్తాడనే ఆశతోనే జీవిస్తుంటుంది శ్రావణి. అటు మామగారికి, ఇటు పుట్టింటివారికి కూడా సమాధానం చెప్పుకుంటూ మంచితనానికి మారుపేరుగా కనిపిస్తుంది. సమంత కెరీర్‌లోనే అద్భుతంగా నిలిచిపోయే.. చెప్పుకోదగిన పాత్ర ఇది.

ADVERTISEMENT

ఇలాంటి పాత్రలు మన జీవితాల్లో కనిపిస్తాయో లేదో చెప్పలేం కానీ.. తెలుగు సినిమాల్లో మాత్రం అక్కడక్కడా తారసపడుతూనే ఉంటాయి. ఇంత మంచి వాళ్లు మన ఇంట్లోనూ ఉంటే ఎంత బాగుండు అని మనం అనుకునేలా చేస్తాయి ఈ పాత్రలు. అలా మంచితనానికి, అమాయకత్వానికి మారుపేరుగా తెలుగు సినిమాల్లో కనిపించిన (movies) పాత్రలను (Characters) మనం కూడా ఓసారి చూసేద్దాం.

svsc 8683000

రేలంగి మావయ్య

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మిగిలిన పాత్రలు ఎంతమందికి నచ్చాయో..  నచ్చలేదో అన్న విషయం పక్కనపెడితే ప్రతిఒక్కరికీ నచ్చిన పాత్ర ఒకటుంది. అదే రేలంగి మావయ్య. ఈ పాత్రలో ప్రకాశ్ రాజ్ ప్రాణం పెట్టి నటించాడని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ పాజిటివిటీ మాత్రమే చూసే రేలంగి మావయ్య తన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా దాన్నే పంచుతారు.

మంచితనానికి రోజులు లేవు అంటూ చెప్పే బంధువులు కూడా ఒకానొక సందర్భంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన మంచితనానికి దాసోహం అంటారు. అదీ పాజిటివిటీలోని పవర్. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. ఆనందంగా ఉంటే చాలని చెప్పే రేలంగి మావయ్య లాంటివారు మన ఇంట్లో.. లేదా కనీసం మన బంధువుల్లో ఒకరుంటే చాలు.. యువతరానికి ఆదర్శంగా మారతారు.

hd

టైసన్

స్నేహానికి మారుపేరుగా టైసన్ అని చెప్పుకోవచ్చు. స్నేహితుడు తనకు హాని చేసినా.. స్నేహం కోసం తనకు మేలు చేయాలన్నదే టైసన్ ఆలోచన. సీనియర్లు వచ్చి తనని కొడుతున్నప్పుడు వదిలేసి వెళ్లిన స్నేహితుడి కోసం.. తనకిష్టమైన బ్రాంచిలో సీట్ వదిలేయడం సాధారణంగా ఎవరూ చేయరేమో. ఇంతచేసినా తన గర్ల్ ఫ్రెండ్ గురించి నిజం చెప్పినందుకు ఆ స్నేహితుడి చేతిలోనే దెబ్బలు తింటాడు. అయితేనేం.. ఎంతైనా వాడు మన ఫ్రెండ్ కదరా.. అంటూ తననే వెనకేసుకొస్తాడు టైసన్ అలియాస్ అర్జున్.

ADVERTISEMENT

సినిమా చివరలో ఆ ఫ్రెండ్ నిజం తెలుసుకొని టైసన్ దగ్గరికి రావడం కొసమెరుపైతే.. కేవలం ఈ ఒక్కడి కోసమే కాదు.. తన స్నేహితులందరికీ సాయం చేస్తూ తన వాళ్ల కోసం నిలబడుతూ స్నేహానికి అర్థం చెబుతాడు టైసన్. హ్యాపీ డేస్ సినిమాలో మిగిలిన పాత్రలు ఎవరికి నచ్చుతాయో లేదో చెప్పలేం కానీ టైసన్ పాత్రను ఇష్టపడని వారుండరు. ఒక్కోసారి తను చేసే పనులు చూస్తే మరీ ఇంత త్యాగం అవసరమా? అని కోపం వచ్చినా స్నేహం కోసం ఇంత చేస్తున్నాడు అన్న ఫీలింగ్ తన పాత్ర పట్ల మనకు గౌరవాన్ని పెంచుతుంది. ఇలాంటి ఓ స్నేహితుడు మనకీ ఉంటే బాగుండు అనిపించేలా చేస్తుంది.

Rasika-Mad 2151792

విజయ్ గోవింద్

అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత ఇంతలా ప్రేమించే వ్యక్తి దొరుకుతాడా అనుకునే అమ్మాయిలు.. గీత గోవిందం సినిమా చూశాక మాత్రం విజయ్ గోవింద్ లాంటి వ్యక్తే తమకు భర్తగా రావాలని కోరుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. సినిమాలో హీరోగా ఉన్నా తన మంచితనాన్ని చూపడానికి, హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడానికి.. లేక తన అభిప్రాయం మార్చడానికి పెద్దగా ప్రయత్నం చేయకుండా తను తనలాగే ఉంటాడు విజయ్.

అంతేకాదు.. మేడం మేడం.. అంటూ ప్రతి పనిలోనూ తనకు తోడు నిలుస్తాడు. తనే కావాలని వచ్చిన అమ్మాయిని కూడా.. తప్పు దారి నుంచి సరైన దారిలోకి మార్చాలని ప్రయత్నిస్తాడు. విజయ్ లాంటి భర్త దొరికితే ప్రతి అమ్మాయి లక్కీనే అని చెప్పుకోవచ్చు.

Nani 1160574

దాస్

అమాయకత్వానికి, స్నేహానికి మచ్చుతునక దాస్. దేవదాస్ చిత్రంలో నాని పోషించిన ఈ పాత్ర చాలామందికి నచ్చేస్తుంది. సినిమా పెద్ద విజయాన్ని సాధించలేకపోయినా.. స్నేహితుడి కోసం రహస్యాలను దాచుకునే దాస్ లాంటి వ్యక్తులు మనకు బయట పెద్దగా కనిపించరు. దేవా లాంటి గ్యాంగ్ స్టర్‌కి వీలైనంత దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు ఎవరైనా. కానీ దాస్ మాత్రం దేవానే మార్చాలనుకుంటాడు. తనలోని మంచితనాన్ని బయటకు తీయాలనుకుంటాడు.

ADVERTISEMENT

దాని కోసం దేవాను ప్రేమలో దింపడం, రకరకాలుగా ప్రయత్నించడం మనకు తెలిసిందే. అయితే ఎంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవా తన స్నేహితుడు అన్న రహస్యాన్ని మాత్రం బయటపెట్టడు. చివరకు తను ప్రేమించే అమ్మాయితోనూ ఈ నిజం చెప్పకుండా దాచి స్నేహం, మంచితనం తనలోనే ఉన్నాయని చెప్పిన దాస్ లాంటి ఫ్రెండ్ ఒక్కరైనా మనకు స్నేహితులైతే బాగుంటుంది కదా. మనం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వాళ్లు మనకు ఎంతో సాయం చేస్తారు.

వీళ్లే కాదు.. మన సినిమాలను గమనిస్తే ఇలాంటి మంచి పాత్రలు మనకు అక్కడో ఇక్కడో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పాత్రలేవైనా మీకు తెలిసి ఉంటే ఇక్కడ కామెంట్లలో మాతో పంచుకోండి.

ఇవి కూడా చదవండి.

మ‌జిలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చై-సామ్ ఆడిన ఈ గేమ్స్ చూశారా?

ADVERTISEMENT

ఈ మోడ్ర‌న్ సీతతో అంత వీజీ కాదండోయ్‌..ఎందుకంటే త‌ను శూర్ఫ‌ణ‌క లాంటిది!

న‌య‌న‌తార ఒక్క‌రే కాదు.. వీరంతా డ్యుయెల్‌ రోల్స్‌లో అద‌ర‌గొట్టిన వారే..!

10 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT