"ఇది అన్నాద‌మ్ముల అనుబంధం.." అంటూ పాట‌లు పాడుతోన్న ట్విట్ట‌ర్.. ఎందుకో తెలుసా?

"ఇది అన్నాద‌మ్ముల అనుబంధం.." అంటూ పాట‌లు పాడుతోన్న ట్విట్ట‌ర్.. ఎందుకో తెలుసా?

అనిల్ అంబానీ (Anil ambani), ముఖేష్ అంబానీ(Mukhesh ambani)ల గురించి తెలియ‌ని వ్య‌క్తి మ‌న దేశంలో ఎవ‌రూ ఉండ‌రేమో.. ప్ర‌పంచ కుబేరుల్లో స్థానం సంపాదించుకున్న ఈ ఇద్ద‌రు అన్నాద‌మ్ముల అనుబంధం మాట‌ల్లో చెప్ప‌లేనిది. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత ఇద్ద‌రూ ఆస్తులు పంచుకున్నా.. ఒక‌రికి క‌ష్టం వ‌స్తే మ‌రొక‌రు అండ‌గా నిలుస్తామ‌ని నిరూపించారు. స్వీడిష్ సంస్థ ఎరిక్‌స‌న్‌కి అనిల్ అంబానీ సంస్థ ఆర్‌కామ్‌.. రూ.550 కోట్లు చెల్లించాల‌ని కోర్టు నాలుగు వారాల గ‌డువు విధించిన సంగ‌తి తెలిసిందే.


ఒక‌వేళ ఆ మొత్తాన్ని అనిల్ చెల్లించ‌లేక‌పోతే జైలుకి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని కూడా హెచ్చ‌రించింది. న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌తో ఈ అప్పును ఎలా తీర్చాలో తెలీక ఇబ్బంది ప‌డుతోన్న త‌మ్ముడికి స‌హాయం చేస్తూ ఆ డ‌బ్బును అందించారు అన్న ముఖేష్ అంబానీ. స‌మయానికి త‌గిన సాయం చేసిన అన్నావ‌దిన‌ల‌కు అనిల్ అంబానీ ధ‌న్య‌వాదాలు కూడా తెలిపారు.


"ఈ కష్ట‌స‌మ‌యంలో నాకు తోడుగా నిలిచి సాయం చేసిన నా అన్నావ‌దిన‌లు ముఖేష్‌, నీతాల‌కు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా.. కుటుంబ విలువ‌లు, అవ‌స‌రానికి సాయం చేయ‌డం వంటివి మ‌న కుటుంబంలో ఉన్నాయ‌ని ఈ సాయంతో నిరూపిత‌మైంది.." అంటూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు.


53236615 1165875230265340 8844499425845730129 n


మార్చి 19లోగా రూ.550 కోట్లు క‌ట్టాల‌ని కోర్టు ఆదేశించినా.. ఆ మొత్తాన్ని ఇచ్చే కుబేరుడైన అన్న ఉండ‌డం అనిల్ అంబానీ అదృష్ట‌మ‌ని ఎంతోమంది పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ అన్నాద‌మ్ముల బంధం గురించి సోష‌ల్‌మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా ప్రారంభ‌మ‌య్యాయి. త‌మ‌కూ అలాంటి అన్న ఒక్క‌డుంటే బాగుండ‌ని ఎంతో మంది కోరుకుంటున్నార‌ని ఈ మీమ్స్ ద్వారా చాలామంది చెబుతున్నారు. ##MukeshSavesAnil పేరుతో ఈ మీమ్స్ ట్విట్ట‌ర్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మ‌రి, సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం పాపుల‌రైన కొన్ని మీమ్స్ చూసేద్దాం రండి.


1. ఇప్ప‌టినుంచి నాకూ టైమ్ వ‌స్తుంది అన‌కుండా.. నాకూ అన్న ఉన్నాడు అని చెప్పాలేమో..2. ముఖేష్ అంబానీలాంటి అన్నని వ‌ద్ద‌నేవారు ఎవ‌రు చెప్పండి?3. నా ద‌గ్గ‌ర అన్న ఉన్నాడు.. అని అనిల్ అంబానీ చెప్పాల్సిందే..4. ఆఖ‌రి నిమిషంలో త‌మ్ముడిని ఇలా కాపాడేశాడు..5. త‌న‌కీ అన్న ఉంటే బాగుండ‌ని.. అంద‌రితో పాటు విజ‌య్ మాల్యా కూడా కోరుకుంటున్నారేమో..6. కొన్నిసార్లు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కొన్ని ప‌నులు చేయాల్సిందే..7. ఇలాంటి త‌మ్ముళ్లు ఎంతోమంది త‌యార‌వుతూనే ఉంటారు..8. మంచి ఫ్యామిలీ డ్రామా సినిమాకి స్టోరీ సిద్ధం.9. హాహాహా... మ‌నంద‌రి అన్న‌లు, త‌మ్ముళ్లు ఇలాగే ఉంటారు క‌దా..10. మ‌రీ అంబానీ అంత కాక‌పోయినా చెల్లెలికి ఇవ్వాల‌న్న కోరిక ఉన్న‌ట్లుంది ఈ అన్న‌కి..11. మంచి అన్న అంటే ముఖేష్‌లా ఉండాలేమో..ఇవి కూడా చ‌ద‌వండి..


క్యూట్ కౌబాయ్ తైమూర్‌.. జంతువులంటే ఈ స్టార్‌కిడ్‌కి ఎంత ప్రేమో..!


బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!


మ‌గాళ్ల‌కు నెల‌స‌రి వ‌స్తే. . ఎలా ఉంటుందో మీకు తెలుసా??