తైమూర్ అలీ ఖాన్ (Taimur ali khan).. బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్ (Kareena kapoor), బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif ali khan)ల ముద్దుల కుమారుడు. దేశమంతటికీ పాపులర్‌గా మారిన స్టార్కిడ్ (Starkid). సెలబ్రిటీల పిల్లల్లో అందరికంటే ఫేమస్ ఎవరంటే తైమూర్ అనే చెబుతారు. అంతగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ బుడ్డోడు. ఫొటోగ్రాఫర్లు ఎప్పుడు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినా.. వాళ్లకు హాయ్ చెబుతూ చక్కగా పోజులివ్వడం తన ప్రత్యేకత. అంతేకాదు.. తనని తైమూర్ అని కాకుండా టిమ్ అని పిలవాలని చెబుతుంటాడు.
View this post on Instagram
తైమూర్‌కి జంతువులంటే ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం పటౌడీ వెళ్లిన జూనియర్ నవాబ్ తన జంతు ప్రేమను చాటుకున్నాడు. ఆవులు, గుర్రాలంటే ఎంతో ఇష్టపడే తైమూర్ ఇతర జంతువులను చూసినా ఇష్టపడతాడు.
పటౌడీ వెళ్లినప్పుడు కూడా ప్యాలస్ వదిలి ఆవులను చూసేందుకు బయటకొచ్చారు కరీనా, సైఫ్, తైమూర్లు. తండ్రి భుజాలపై కూర్చొని ఆవులను చూస్తూ ఎంతో ఎక్సయిటింగ్‌గా ఫీలయ్యాడు తైమూర్. దారిలో వెళ్తుంటే ఆవులను చూసి అక్కడికి వెళ్లాలనుకున్న తైమూర్‌ని తీసుకొని.. ఓ ఇంటికి వెళ్లారు సైఫ్ దంపతులు.
"నమస్కార్ దీదీ.. ఆప్కే గాయ్ దేఖనే ఆయే హే..." (నమస్కారం అండీ.. మీ ఆవులు చూడడానికి వచ్చాం..) అని సైఫ్ అడగడం ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఇలాంటి విషయాలను తైమూర్‌కి పరిచయం చేయడం వెనుక కూడా ఓ కారణం ఉంది. సెలబ్రిటీలుగా ప్రజలకు దూరంగా ఉండకుండా.. అందరితో కలిసిపోవడమే కాదు.. తమ బిడ్డకు జంతువులపై ప్రేమను కలిగించడం ద్వారా కూడా తననో మంచి వ్యక్తిగా మార్చాలన్నది సైఫ్, కరీనాల ఉద్దేశంగా మనకు అర్థమవుతోంది.
View this post on Instagram
మరో వీడియోలో ఆవులకు దగ్గరగా వెళ్తూ అమ్మ దగ్గరికి వచ్చిన తైమూర్ పశువులకు తినిపించడం కోసం గాజర్ని (క్యారట్) అడగడం మనం చూడొచ్చు.
View this post on Instagram
తైమూర్‌కి చిన్నతనం నుండీ ఆవులంటే ఇష్టం. ముంబైలో ఉన్నప్పుడు కూడా తైమూర్ ఆవులకు, గుర్రాలకు తినిపిస్తూ ఆనందంగా గడపేవాడు. ఈ ఫొటోలు, వీడియోలను మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. తనకంటే ఎంతో పెద్దవైన ఈ పశువుల దగ్గరికి వెళ్లేందుకు తైమూర్ ఏమాత్రం భయపడకపోవడం విశేషం.
ఈ ఫొటోలో తన సైజ్‌లో ఉన్న చిన్న పోనీతో తైమూర్ ఆటలాడడం చూడొచ్చు.
View this post on Instagram
మరో ఫోటోలో ఇంటి నుంచి బయటకొచ్చి.. నాన్నతో పాటు తిరుగుతోన్న తైమూర్ ఆవును చూడడం మనకు కనిపిస్తుంది.
View this post on Instagram
కొన్ని వారాల క్రితం కరీనాతో షూటింగ్ స్పాట్‌కి వెళ్లినప్పుడు.. అక్కడ కనిపించిన ఓ పిల్లిని చూసి తైమూర్ మ్యావ్.. అంటూ పిలవడం వైరల్‌గా మారింది.
ఇవే కాదు.. తైమూర్ గుర్రపుస్వారీ కూడా నేర్చుకుంటున్నాడట. దాన్ని కూడా ఈ జూనియర్ నవాబ్ ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు. గుర్రపు స్వారీ చేయడం అంటే తనకెంతో ఇష్టం. అందుకే తైమూర్‌ని చాలామంది క్యూట్ కౌబాయ్‌గా పిలుస్తుంటారు.
ఇంట్లోనూ ఎల్విస్ అనే కుక్క తైమూర్‌కి తోడుగా ఉంటుంది. వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఇవేనా.. తైమూర్ ఆడుకునే బొమ్మల్లోనూ గుర్రాలు, యూనికార్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ బుజ్జాయికి జంతువులపై ఎంత ప్రేముందో అర్థమవుతోంది కదా..
ఇవి కూడా చదవండి..
ఆరాధ్య ముద్దులొలికే ఎక్స్ప్రెషన్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
తమ తల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భలే ఫేమస్ తెలుసా..!
నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్కిడ్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.. !