హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం

హైదరాబాద్ కీ షాన్..  సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం

హైదరాబాద్ పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేవి.. బిర్యానీ , ఇరానీ చాయ్ , చార్మినార్, గోల్కొండ. అయితే ఇవే కాకుండా గత కొంతకాలంగా హైదరాబాద్ (Hyderabad) పేరు మరో కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు ప్రధాన కారణం స్పోర్ట్స్.


భాగ్యనగరానికి చెందిన మహిళా క్రీడాకారిణులు.. వివిధ క్రీడా రంగాల్లో తమ ప్రతిభని చూపెడుతూ జాతీయ , అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పతకాలు సాధిస్తూ తమ సత్తాని చాటుతున్నారు. అలాంటి ఎందరో క్రీడాకారిణుల పేర్లు మనకి సుపరిచితమే. గుత్తా జ్వాల, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ , పీవీ సింధు, మిథాలీ రాజ్, అరుణ రెడ్డి & సిక్కి రెడ్డి లాంటి క్రీడాకారిణుల పేర్లు వినని హైదరాబాదీ ఉండరంటే అతిశయోక్తి కాదు.


ఈ క్రమంలో హైదరాబాద్ పేరుని జగద్విఖ్యాతం చేసిన పలువురు అలనాటి క్రీడాకారిణులతో పాటు యంగ్ స్పోర్ట్స్ విమెన్ గురించి కూడా మనం తెలుసుకుందాం


శ్రీ వైష్ణవి


మెమరీ స్పోర్ట్ రంగంలో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ హోదాను కైవసం చేసుకొని.. గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారిణి శ్రీ వైష్ణవి . తన ప్రస్థానంలో అత్యుత్తమమైన ప్రపంచ రెండవ ర్యాంక్ సాధించడం ఆమె కెరీర్ హైలైట్ అని చెప్పొచ్చు.


sri-vaishnavi-gained-popularity-with-her-medal-in-memory-sports


రజని వేణుగోపాల్


మహిళా క్రికెట్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు మిథాలీ రాజ్. అలాంటి మిథాలీ రాజ్ కన్నా ముందే మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాట్స్ వుమన్ రజని గోపాల్ హైదరాబాదీ అమ్మాయి అనే విషయం చాలా తక్కువమందికే తెలుసు.


రుష్మి చక్రవర్తి


టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి జతగా ఈ తెలుగమ్మాయి 2012 ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం ఆమె క్రీడా జీవితంలో ఒక ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో సానియాతోనే కలిసి 2010 కామన్ వెల్త్ క్రీడల్లో ఈమె కాంస్య పతాకాన్ని గెలుపొందడం విశేషం.


rushmi-chakravarthy-gained-fame-as-hyderabad-tennis-player


సైదా ఫాలక్


ఈ యువ కరాటే క్రీడాకారిణి ఇప్పటికే పలు జాతీయ ,అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తన ప్రతిభ చాటగా.. మన దేశం నుండి ప్రపంచ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్న తొలి క్రీడాకారిణిగా ఈమె చరిత్ర సృష్టించింది. ఇంతటి ప్రతిభ ఉన్న ఈ క్రీడాకారిణికి మొన్నీమధ్యనే తెలంగాణ ప్రభుత్వం నగదు సహాయం అందించి మరింతగా ప్రోత్సహించింది.


Syeda-Falak-is-the-first-woman-karate-champion-from-hyderabad


గౌహర్ సుల్తానా


మిథాలీ & రజని వేణుగోపాల్ మొదలైన క్రీడాకారిణుల మాదిరిగానే.. ఈమె కూడా హైదరాబాద్ తరపున భారత మహిళా క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించింది. స్పిన్ బౌలర్ గా మంచి పేరున్న గౌహర్ దాదాపు 50 అంతర్జాతీయ మ్యాచులలో మన దేశం తరపున తన ప్రతిభని చాటింది .


హైదరాబాద్ కీర్తిని ప్రపంచానికి చాటిన ఇలాంటి క్రీడాకారిణులను.. మరింతమంది ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం.


Images: Instagram, Twitter, Wikimedia Commons