ప్యారడైజ్ బిర్యానీ తింటే.. ఐపీఎల్ టిక్కెట్స్ ఫ్రీ

ప్యారడైజ్ బిర్యానీ తింటే.. ఐపీఎల్ టిక్కెట్స్ ఫ్రీ

హైదరాబాద్‌కు చెందిన ప్యారడైజ్ (Paradise) రెస్టారెంట్స్ గ్రూప్ ఓ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ ఔట్ లెట్స్‌లో బిర్యానీ తినే కస్టమర్లకు ఐపీఎల్ (IPL) 2019 టికెట్లు గెలుచుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.


తమ రెగ్యులర్ కస్టమర్ల కోసమే ఈ అరుదైన బంపర్ ఆఫర్‌ని ప్రకటించామని.. దీనిని బట్టి తమ వినియోగదారులను ఎంతగా ప్రేమిస్తున్నామో తెలుస్తుందని ఈ సందర్భంగా ప్యారడైజ్ సీఈఓ గౌతమ్ గుప్తా తెలిపారు.


"కోకాకోలాతో కలిసి ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించాం. ఈ ఆఫర్‌లో భాగంగా.. ఎంపికైన కస్టమర్లకు సోమవారం ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్, కింగ్స్ 11 పంజాబ్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌కు ఉచిత టికెట్లు ఇస్తున్నాం" అని ఆయన తెలిపారు.


 


ఇప్పటికే ఆదివారం నాడు కొందరు కస్టమర్లకు ఈ ఆఫర్‌లో భాగంగా టిక్కెట్లు ఇచ్చినట్లు సీఈఓ తెలిపారు.


ప్యారడైజ్ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించాక.. ఇప్పటికే 10 లక్షల మంది కస్టమర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారట. ఇది ఒక రికార్డు అని హోటల్ యాజమాన్యం తెలిపింది.


ప్రస్తుతం బిర్యానీ అమ్మకాలకు సంబంధించి.. భారతదేశంలోనే టాప్ బ్రాండ్‌గా వెలుగొందుతున్న ప్యారడైజ్.. గత 65 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తోంది. పలుమార్లు ప్రతిష్టాత్మక ఫుడ్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకుంది.


paradise-ipl-1


అమీర్ ఖాన్ లాంటి నటులు ముంబయి నుండి ఇక్కడకి వచ్చి.. ప్యారడైజ్ బిర్యానీని టేస్ట్ చేయడం విశేషం. అలాగే పలువురు భారతీయ క్రికెటర్లు కూడా తాము ప్యారడైజ్ బిర్యానీని ఇష్టపడతామని గతంలో తెలిపారు.


ప్రస్తుతం రంజాన్ సందర్భంగా.. ప్యారడైజ్ గ్రూపు హలీమ్ ఫెస్టివల్‌ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈసారి ఔట్ లెట్ల సంఖ్యను హైదరాబాద్‌లో పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా యాజమాన్యం తెలిపింది.


గత సంవత్సరం భారతదేశంలోనే అత్యధికంగా బిర్యానీ అమ్మకాలు చేసినందుకు.. ప్యారడైజ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే.


ఒక ఏడాదిలో 70,44,289 బిర్యానీలను అమ్మినందుకు.. ప్యారడైజ్‌కు ఈ అరుదైన గౌరవం లభించింది. అలాగే ఆసియా ఫుడ్ కాంగ్రెస్ ప్రకటించిన ఉత్తమ బిర్యానీ తయారీదారుల్లో కూడా గతంలో ప్యారడైజ్ చోటు దక్కించుకుంది.


ప్రస్తుతం ప్యారడైజ్ బ్రాంచీలు హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, విజయవాడలో కూడా ఉండడం విశేషం. వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ అనే ట్యాగ్ లైనుతో ఈ రెస్టారెంట్స్ తమ బిర్యానీని మార్కెట్ చేస్తున్నాయి.


ప్యారడైజ్ ఫేస్‌బుక్ పేజీలో దాదాపు 1 లక్షమందికి పైగానే ఫాలవోర్లు ఉన్నారు. బిర్యానీతో పాటు కబాబ్స్, కీమా, హలీమ్ వంటి మాంసాహార వంటకాలకు కూడా ప్యారడైజ్ పెట్టింది పేరు. 


ఇవి కూడా చదవండి


మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యార‌డైజ్ బిర్యానీ


మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..


హైదరాబాద్‌లో బెస్ట్ 'హలీమ్' రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!