మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..

మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..

హైద‌రాబాద్ ఎన్నింటికి ప్ర‌సిద్ధిగాంచినా.. బిర్యానీ (Biryani)కి వ‌చ్చిన క్రేజ్ మాత్రం ఇంక దేనికీ రాలేదంటే అతిశ‌యోక్తి కాదు. బిర్యానీ అంటే మ‌న‌కెంతో ప్రేమ‌, ఇష్టం.  బిర్యానీ ప్రేమికులంటే మామూలా మ‌రి. మ‌న‌లాంటి వాళ్లు బ‌త‌కాలంటే గాలి పీల్చ‌డం ఎంత ముఖ్యమో.. బిర్యానీ తిన‌డం కూడా అంత ముఖ్య‌మే.. ఎప్పుడు రెస్ట‌రంట్‌కి వెళ్లినా బిర్యానీ అనే ప‌దం గురించే మ‌నం వెతుకుతూ ఉంటాం. మీరూ ఇలా బిర్యానీ అంటే ప్రాణ‌మిచ్చే ర‌క‌మేనా (Biryani lovers)? అయితే ఈ కింది అంశాలు మీలాంటివారి గురించే.. ఓసారి లుక్కేయండి.


1. స‌లాడ్స్ తిన‌డ‌మా? అంటే ఏంటి? మీ జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాప‌కాలంటే మీరూ మీ స్నేహితురాలు క‌లిసి కూర్చొని ప్లేట్ల‌కు ప్లేట్లు బిర్యానీ తిన‌డ‌మే. దాంతో పాటు రైతా మ‌ర్చిపోలేం అనుకోండి..


2. చ‌క్క‌గా వండిన బిర్యానీ ఎంత మంచి జ్ఞాప‌కాల‌ను మిగులుస్తుంది..? అలాగే మీ రోజు బాలేదు అనుకోవ‌డానికి మీరు తిన్న బిర్యానీ రుచి బాగా లేక‌పోవ‌డం ఒక్క‌టి చాలు..


bir2


3. బ్రేక‌ప్ త‌ర్వాత లేదా ఏదైనా బాధ‌పెట్టే సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత.. అంద‌రూ ఐస్‌క్రీం, చాక్లెట్ లేదా ఏదైనా స్వీట్ తింటూ దాన్ని మ‌ర్చిపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. మీరు మాత్రం నోరూరించే బిర్యానీ.. దాంతో పాటు మిర్చీ కా సాల‌న్‌, ఉల్లిపాయ‌లు ఉంటే చాలు.. దాన్ని మ‌ర్చిపోయి మామూలు మ‌నిషైపోతారు.


4. మీకు బిర్యానీ గురించి అన్ని వివ‌రాలు తెలుసు. ఎన్ని ర‌కాల బిర్యానీలున్నాయో కూడా మీకు తెలుసు. ఆఫ్గ‌నీ, క‌శ్మీరీ, అమృత్‌స‌రీ.. ఇలా అన్ని ర‌కాల బిర్యానీలూ మీరు టేస్ట్ చేసే ఉంటారు.


5. మీరు ఒక్క‌రే ఇంట్లో ఉండి బిర్యానీ తిన‌డం అంటే మీకు ఎంతో ఇష్టం. అప్పుడేగా.. తృప్తిగా ప్ర‌తి ముద్ద‌నూ ఆస్వాదిస్తూ తిన‌గ‌లుగుతారు. అంతేకాదు.. దాన్ని ఫోర్క్, స్పూన్ సాయంతో కాకుండా.. మీ చేత్తో తిన‌డ‌మే మీకు ఇష్టం.


6. వెజిటేరియ‌న్స్‌తో స్నేహం చేయ‌డం, వారితో బ‌య‌ట‌కు వెళ్ల‌డం మీకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు మీ ప్లేట్లోంచి బిర్యానీ తీసుకోరు క‌దా..


7. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు కూడా.. ముందు ఆ ప్రాంతంలో ఉన్న ప్ర‌దేశాలు తిరిగి చూడ‌డం మీ ప్రాధాన్యం కాదు. అక్క‌డ మంచి బిర్యానీ ఎక్క‌డ దొరుకుతుందో వెతికి ముందు చూసి ఆ త‌ర్వాత మిగిలిన ప‌నులు చేస్తారు.


8. మీ దృష్టిలో అన్ని ర‌కాల బిర్యానీల కంటే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా తినే బిర్యానీ చాలా బెస్ట్‌. అందులో ఏవైనా మిగిలితే మ‌ధ్యాహ్నం లంచ్‌కి, ఇంకా మిగిలితే రాత్రి డిన్న‌ర్‌కి కూడా దాన్నే తినేందుకు మీరు ఎప్పుడూ సిద్ధ‌మే.


9. వెజిటేరియ‌న్ బిర్యానీ అనే వంట‌క‌మే ఉండ‌ద‌ని చెప్పేందుకు.. మీ ద‌గ్గ‌ర ఫుల్ డేటా, లెక్క‌లు.. ఇలా చ‌రిత్ర మొత్తం సిద్ధంగా ఉంటుంది.


bir1 5262894


10. రాత్రి డిన్న‌ర్‌కి మీకోసం బిర్యానీ సిద్ధంగా ఉంటే చాలు. రాగానే దానిపై దండెత్తే టైప్ కాదు మీరు. చ‌క్క‌గా డ్ర‌స్ మార్చుకొని నింపాదిగా కూర్చొని ఒక‌టీ రెండూ కాదు.. పీక‌ల వ‌ర‌కూ నాలుగైదు ప్లేట్లు లాగించేస్తారు.


11. బిర్యానీ బెస్ట్ కాద‌ని.. దాని బ‌దులు పిజ్జా లేదా ఫ్రైడ్ రైస్ ఆర్డ‌ర్ చేద్దామ‌ని ఎవ‌రైనా అంటే.. అది త‌ప్ప‌ని వాదిస్తూ ఎంత‌సేపయినా ఉండేందుకు మీరు సిద్ధం. మీరు ఇత‌రుల‌తో చేసే వాద‌న‌ల్లో ఇవే ఎక్కువ‌గా ఉంటాయి.


12. ఆహారానికి, ముఖ్యంగా బిర్యానీకి సంబంధించిన పోస్టుల్లో మీ స్నేహితులు మిమ్మ‌ల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఇది మీకు నిత్య‌కృత్య‌మ‌వుతుంది కాబ‌ట్టి వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు కూడా.


13. ఇదంతా చ‌దువుతుంటే.. మ‌ళ్లీ బిర్యానీ గుర్తుకొచ్చి.. ఈ ఆర్టిక‌ల్ ఎప్పుడు అయిపోతుందా? నోరూరించే బిర్యానీ ఎప్పుడు ఆర్డ‌ర్ చేద్దామా అని వేచి చూస్తుంటారు. ఇంకెందుకాల‌స్యం? ఆర్డ‌ర్ చేసేయండి.


ఇవి కూడా చ‌ద‌వండి.


మీరూ లేట్ ల‌లిత‌లేనా? అయితే మీ జీవితంలోనూ ఇవి జ‌రుగుతూ ఉంటాయి..


తొలి సంపాదన అందగానే.. అమ్మాయి మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లివే..!


బ్రేక‌ప్ త‌ర్వాత.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బందే మ‌రి!