టాలీవుడ్ పరిశ్రమలో విషాదం.. స్టార్ కమెడియన్ వేణుమాధవ్ మృతి

టాలీవుడ్ పరిశ్రమలో విషాదం.. స్టార్ కమెడియన్ వేణుమాధవ్ మృతి

(Popular Telugu Comedian Venu Madhav Passes Away in Hyderabad)

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వేణుమాధవ్ ఈ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో మృతి చెందారు. మూత్ర పిండాల వ్యాధితో గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన ట్రీట్‌మెంట్ నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. మంగళవారం వేణుమాధవ్ ఆరోగ్యం విషమించడంతో.. ఆయనను ఐసీయూలో చేర్చారు. ఆ తర్వాత వెంటిలేటర్ సహాయంతో తనకు డాక్టర్లు చికిత్సను అందించారు. కానీ పరిస్థితి బాగా విషమించడంతో.. ఆయన కన్నుమూశారు. కోదాడలో పుట్టి పెరిగిన వేణుమాధవ్.. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

టాలీవుడ్ టాప్ 10.. లేడీ కమెడియన్స్ వీరే

వేణుమాధవ్‌కు తొలిసారిగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో "సంప్రదాయం" అనే చిత్రంలో అవకాశం వచ్చింది. అదే సినిమా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటికే ఆయన మిమిక్రీ ఆర్టిస్టు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టి. రామారావు వేణుమాధవ్‌‌కు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉపాధిని చూపించారు. తర్వాత కొన్నాళ్లు అదే పార్టీలో క్రియాశీల కార్యకర్తగా కూడా వేణుమాధవ్‌గా పనిచేశారు. సై, తొలిప్రేమ, లక్ష్మి, దిల్, రాధాగోపాళం మొదలైన చిత్రాలు వేణుమాధవ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. 

తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన "హంగామా" చిత్రం ద్వారా.. హీరోగా కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు వేణుమాధవ్. ప్రేమాభిషేకం, భూకైలాస్ చిత్రాలలో కూడా హీరోగా నటించారు. కానీ.. ఆ చిత్రాలు అనుకున్నంత సక్సెస్ కాకపోవడం గమనార్హం. 2016 విడుదలైన "డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్" చిత్రం వేణుమాధవ్ నటించిన ఆఖరి సినిమా. సినిమాలలో తన నటనకు గాను వేణుమాధవ్ పలుమార్లు నంది పురస్కారం కూడా అందుకున్నారు. 

మాట కఠినం.. మనసు నవనీతం.. సూర్యకాంతం ది గ్రేట్

మిమిక్రీ ఆర్టిస్టుగా అప్పట్లోనే షోకి రూ.1000 పారితోషికం తీసుకున్న వేణుమాధవ్.. తన తొలిసినిమాకే రూ.70 వేలు పారితోషికం తీసుకున్నారు. తనకు తొలి సినిమా కోసం అవకాశమిచ్చిన నిర్మాత అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల మీద ప్రేమతో తన ఇంటికి "అచ్చి వచ్చిన కృష్ణ నిలయం" అనే పేరు పెట్టుకున్నారు. కొంతకాలం వరుసగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో కూడా.. వేణుమాధవ్ నటించారు. తమిళంతో పాటు.. ఇతర భాషా చిత్రాాలలో కూడా వేణు మాధవ్ కొన్ని పాత్రలలో నటించారు. 

వేణుమాధవ్ ఆరోగ్యానికి సంబంధించి గతంలో కూడా అనేక వదంతులు, పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన వాటిని ఖండిస్తూ.. మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన చనిపోయారని కూడా గతంలో పలు  సోషల్ మీడియా ఛానల్స్ ఫేక్ వార్తలను ప్రచురించాయి. వాటిపై కూడా అప్పట్లో ఆయన స్పందించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా వేణుమాధవ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వేణుమాధవ్ మరణంతో టాలీవుడ్ విషాదసాగరంలో మునిగిపోయింది.

"కన్యాశుల్కం" నాటకంలోని.. చిత్రమైన సంభాషణలు మీకోసం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.