ప్రియాంక చోప్రా (Priyanka chopra).. మిస్ వరల్డ్‌గా గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె నటన దిశగా అడుగులు వేయడంతో పాటు.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగి భారతదేశానికే వన్నె తెచ్చింది. ఓ వైపు నటిగా తనని తాను నిరూపించుకుంటూనే.. సాటి మహిళల్లో ఉత్సాహం నింపేందుకు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతోంది. తన వంతుగా నడుం బిగించి యునిసెఫ్‌తో కలిసి పని చేస్తోంది.
ఇన్ని బాధ్యతల నడుమ గతేడాది డిసెంబర్‌లో తాను మనసిచ్చిన.. నిక్ జొనాస్‌ని అంగరంగ వైభవంగా పెళ్లాడింది ప్రియాంక. ఆ తర్వాత ఇల్లాలిగానూ మారింది. మరి, తాను చేపట్టిన ప్రతి బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తించే ఈ సుందరి.. భార్యగా తన భర్త సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలి కదా. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమైంది పీసీ.
అవునండీ.. గతేడాది డిసెంబర్‌లో ఉమ్మేద్ భవన్‌లో నిక్ జొనాస్‌ని పెళ్లాడిన ఈ భామ.. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భర్తతో కలిసి విదేశాలకు టూర్లకు చెక్కేస్తూనే ఉంది. గత వారం నిక్ జొనాస్ సోదరుడు జో జొనాస్, సోఫీ టర్నర్‌ల వివాహ వేడుకకు హాజరైన తర్వాత.. ఈ జంట ఇటలీలో విహరించడానికి అక్కడ వాలిపోయింది.
టస్కనీలో నచ్చిన ప్రదేశాల్లో విహరిస్తూ, ఒకరి కోసం మరొకరు ప్రేమగా వంట చేస్తూ.. చక్కగా సమయం గడుపుతున్నారు నిక్ – పీసీ. అంతేకాదు.. వారి మధ్య ఏర్పడుతున్న ఈ మధుర క్షణాల ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూనే ఉందీ జంట.
తాజాగా నిక్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఓ వీడియో అభిమానులను అలరించడం మాత్రమే కాదు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మీకు తెలుసా?? చక్కని సాయంసంధ్య వేళ వినసొంపైన పాటకు.. ఈ భార్యాభర్తలిద్దరూ సరదాగా రొమాన్స్ చేస్తూ చూడచక్కగా డ్యాన్స్ చేశారు.
కేవలం గంటల వ్యవధిలోనే 12 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులంతా.. “మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందంటూ” కితాబివ్వడమే కాదు.. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి తెగ మురిసిపోతున్నారు కూడా.
ఒకరికోసం మరొకరు పాస్తా ప్రిపేర్ చేసుకున్న వీడియోలు, డ్యాన్స్ చేసిన వీడియో.. వంటివి నిక్ పోస్ట్ చేస్తే.. పీసీ మరో అడుగు ముందుకు వేసింది. సాయంత్రం సమయంలో పూల్‌లో స్విమ్ సూట్‌లో సేదతీరుతున్న సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
పైగా.. ‘టూర్స్‌కి వెళ్లినప్పుడు బాగా ఉపయోగపడడం అంటే ఇదే.. భర్త ఫొటోలు తీయడం..’ అంటూ వాటికి ఫన్నీగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. క్లీవేజ్ షో చేస్తూ చేతిలో వైన్ గ్లాస్‌తో, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌తో ఉన్న ఈ ఫొటోలు చాలా హాట్‌గా ఉన్నాయంటూ అభిమానులంతా కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘నా భర్త నిక్, నేను ఇప్పటికీ ప్రేమ పక్షుల్లానే విహరిస్తున్నాం. పెళ్లైనా ఆ తేడా మా బంధంలో అంతగా ఏమీ కనిపించడం లేదు. అసలు నిక్‌ని చూస్తుంటే ఇప్పటికీ నా బాయ్ ఫ్రెండ్‌లానే అనపిస్తున్నాడు. భర్తకు, బాయ్ ఫ్రెండ్‌కు తేడా కనిపించడం లేదు. అయితే పెళ్లితో మా బంధానికి ఓ భద్రత ఏర్పడిందన్న భావన మాకు కలిగింది.
కానీ నిక్‌తో జీవితం మాత్రం ఎప్పటిలానే సాధారణంగానే అనిపిస్తోంది. బహుశా.. నిక్ నా సొంతం అనే అభిప్రాయం ముందు నుంచే నాలో ఉండడమే దీనికి కారణం కావచ్చు. కానీ మా పెళ్లి మా ఇద్దరిలోనూ బాధ్యతను మరింత పెంచింది. ఇద్దరం రోజూ ఏదో ఒక జీవిత పాఠం నేర్చుకుంటూనే ఉన్నాం..’ అంటూ తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది పీసీ.
మరోవైపు కెరీర్ పరంగా చూస్తే.. ప్రియాంక ప్రస్తుతం ‘స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో నటిస్తోంది. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిక్ సైతం తన సోదరులతో కలిసి త్వరలో తన టూర్‌ని ప్రారంభించనున్నాడు.
ఇవి కూడా చదవండి
తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!
మగవాళ్ల గురించి.. ఈ విషయాలు పెళ్లి తర్వాతే తెలుస్తాయి..!
“కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..” అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?